pizza

Andhra King Thaluka FDFS song out
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, మహేష్ బాబు పి, మైత్రి మూవీ మేకర్స్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' టైటిల్ ట్రాక్ ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్

You are at idlebrain.com > news today >

12 November 2025
Hyderabad

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 28న థియేటర్లలోకి వస్తుంది, హై-ఆక్టేన్ ఎనర్జీ, రొమాన్స్, అభిమానులతో కూడిన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది, మొదటి మూడు ట్రాక్‌లు చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. మేకర్స్ ఫోర్స్ట్ సింగిల్ - ఫస్ట్ డే ఫస్ట్ షోను విడుదల చేశారు.

ఈ సాంగ్‌ను అభిమానులు విమల్ థియేటర్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. లాంచ్ ఈవెంట్‌కు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ హీరో రామ్ కటౌట్ లాంచ్ చేశారు. అభిమానుల హంగామా మధ్య సాంగ్ లాంచ్ జరిగింది.

అసలైన సినిమా మ్యాజిక్ అభిమానులు తమ అభిమాన స్టార్లని సెలబ్రేట్ చేసుకునే మూమెంట్స్ లోనే ఉంటుంది. ఈ FDFS పాట ఆ ఉత్సాహం, ఆ క్రేజ్ మొత్తాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. సినిమా పట్ల అభిమానుల ఇష్టం, ఆ ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభూతిని ఈ పాట ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా చూపించింది. అభిమానులను లేచి కేకలు వేయించేలా, డాన్స్ చేయించేలా, ఆ మ్యాజిక్ మూమెంట్ లో పూర్తిగా మునిగిపోయేలా చేస్తుంది.

దినేష్ కాకర్ల రాసిన సాహిత్యం అభిమానుల ప్రేమ, ఆతురత, అంకితభావాన్ని ప్రతీ లైన్ లో ఉత్సవంలా చూపిస్తుంది. పాటలో నిజమైన అభిమానుల గొంతులు వినిపించడం మరింత నిజాయితీని, అసలైన ఉత్సాహాన్ని తెస్తుంది.

రామ్ పోతినేని ఈ పాటలో ప్రతి అభిమాని సోల్ గా అదరగొట్టారు. అతని ఎక్స్‌ప్లోసివ్ డాన్స్ మూవ్స్, ఎలక్ట్రిక్ ఎనర్జీతో స్క్రీన్ మొత్తాన్ని దద్దరిల్లేలాచేశాడు. అతని పెర్ఫార్మెన్స్ పాట రిథమ్‌కి అద్భుతంగా బ్లెండ్ అయ్యింది.

ఈ చిత్రంలో రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌.అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌.

తారాగణం: రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్

సాంకేతిక సిబ్బంది:
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: మహేష్ బాబు పి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
ప్రొడక్షన్ హౌస్: మైత్రీ మూవీ మేకర్స్
సమర్పణ: గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ & T-సిరీస్ ఫిల్మ్స్
CEO: చెర్రీ
సంగీతం: వివేక్ & మెర్విన్
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved