pizza

‘Alcohol’ Teaser Delivers Rib-Tickling Comedy!
కడుపుబ్బా నవ్విస్తున్న 'ఆల్కహాల్' టీజర్

You are at idlebrain.com > news today >

4 September 2025
Hyderabad

After a long gap, Allari Naresh is back with a full-length comedy entertainer—and the teaser, unveiled today, promises a laughter riot. Titled ‘Alcohol’, the film is produced by Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas, and presented by Srikara Studios.

From the teaser, it’s clear that the comic timing between Allari Naresh and Satya is going to be a major highlight. Naresh plays a driver while Satya appears as his employer. The story seems to revolve around Naresh’s character, who behaves wildly and unpredictably after consuming alcohol. The central premise appears to be how Naresh and his gang of friends emotionally torment Satya’s character, resulting in hilarious situations.

Alongside Allari Naresh, comedian Satya plays a pivotal role. The film also stars Ruhani Sharma, Niharika NM, Harsha Vardhan, Girish Kulkarni, Chaitanya Krishna, Ravindra Vijay, and Raghu Babu in key roles. Directed by Meher Tej, who earlier impressed with Suhas’s Family Drama, the film features music by Ghibran. Judging by the teaser, Alcohol appears to be a fun blend of comedy, mystery, and thrills. The film is set to release as a New Year’s treat on January 1, 2026.

కడుపుబ్బా నవ్విస్తున్న 'ఆల్కహాల్' టీజర్

చాలా రోజుల తరువాత అల్లరి నరేష్ నుండి ఓ ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా రాబోతుంది. ఈరోజే ఆ సినిమా టీజర్ బయటకు వచ్చింది. ఆ సినిమా పేరు 'ఆల్కహాల్'. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నిర్మాతలు నాగవంశీ మరియు సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

అల్లరి నరేష్ మరియు సత్య ల మధ్య కామెడీ సీన్స్ చూస్తుంటే చాలాకాలం తరువాత అల్లరి నరేష్ ఖాతాలో మరో హిట్టు పడే అవకాశాలున్నట్టు కనిపిస్తున్నాయి. డ్రైవర్ గా అల్లరి నరేష్, అతని యజమానిగా సత్య కనిపించబోతున్న ఈ సినిమాలో మద్యం సేవించిన తరువాత మారిపోయే పాత్రలో అల్లరి నరేష్ భీభత్సం సృష్టించినట్టే కనిపిస్తుంది. అల్లరి నరేష్ మరియు అతని స్నేహితుల బృందం కలిసి సత్య పాత్రను ఎలా ఏడిపించేశారన్నదే ప్రధాన అంశంలా ఉన్నట్టు టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది.

ఈ సినిమాలో అల్లరి నరేష్ తో పాటు కమెడియన్ సత్య కీలక పాత్రలో కనిపిస్తునారు. రుహాణీ శర్మ, నిహారిక NM, హర్షవర్ధన్, గిరీష్ కులకర్ణి, చైతన్య కృష్ణ, రవీంద్ర విజయ్ మరియు రఘుబాబులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సుహాస్ 'ఫ్యామిలీ డ్రామా' తో ప్రేక్షకుల మన్ననలను పొందిన దర్శకుడు మెహర్ తేజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. టీజర్ లో పండిన హాస్యం చూస్తుంటే మిస్టరీ మరియు థ్రిల్లింగ్ ల కలయికగా తెరపై ఓ మంచి డ్రామాయే రానున్నట్టే అనిపిస్తుంది. ప్రేక్షకులకు నూతన సంవత్సర కానుకగా ఈ చిత్రాన్ని 2026, జనవరి 1 న విడుదల చేయబోతున్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved