Nithiin's Alias Rukmini movie launch
నాని సమర్పణలో, నితిన్ హీరోగా, మురళీ కాంత్ దేవాసోత్ దర్శకత్వంలో దీప్తి గంటా నిర్మాణంలో యునానిమస్ ప్రొడక్షన్స్' ప్రొడక్షన్ నెం 2 టైటిల్ అలియాస్ రుక్మిణి - అదిరిపోయే కాన్సెప్ట్ వీడియో రిలీజ్
నేచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కిన 'కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' ఘన విజయానంతరం ఆయన యూనానిమస్ ప్రొడక్షన్స్ రెండో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'అలియాస్ రుక్మిణి' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచింది.
అనౌన్స్‌మెంట్ వీడియోలో మొదట నాని, దర్శకుడు మురళీకాంత్ మధ్య ఆసక్తికరమైన సంభాషణ వినిపిస్తుంది. "కృష్ణ కథ చెబుతాను" అని దర్శకుడు చెప్పగానే, రుక్మిణి అనే రచయిత్రి రాసిన పలు రొమాంటిక్ నవలల కవర్లు కనిపిస్తాయి. వాటిని చూసి "నువ్వు కృష్ణ కథ అన్నావు... మరి ఈ రుక్మిణి ఎవరు?" అని నాని అడుగుతాడు. చివర్లో మ్యాథ్స్ టీచర్‌గా కనిపించిన నితిన్, "మై వైఫ్" అని చెప్పడంతో వీడియో ఆసక్తికరంగా ఎండ్ అవుతుంది. కథలోని అసలు మిస్టరీని బయటపెట్టకుండా, ఆసక్తిని మాత్రం రెట్టింపు చేసేలా ఈ వీడియోను రూపొందించారు. వినూత్న కథనం, ఆకట్టుకునే విజువల్స్, ఆసక్తికరమైన నేపథ్యం, హాయిగా సాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై మంచి అంచనాలు పెంచుతున్నాయి.
మంచి కథలను గుర్తించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని ఈ ప్రాజెక్ట్‌తో అనుబంధం కావడం సినిమాపై మరింత నమ్మకాన్ని పెంచుతోంది. 'దండోరా' తర్వాత దర్శకుడు మురళీకాంత్ మరో ఒరిజినల్ కథతో వస్తుండగా, అనౌన్స్‌మెంట్ వీడియోలోనే ఆయన కథ చెప్పే శైలి ప్రత్యేకంగా కనిపించింది. దర్శకుడికీ, బ్యానర్‌కీ ఇది మరో విజయాన్ని అందించే సినిమా అవుతుందనే నమ్మకాన్ని కలిగించింది.
ఈ చిత్రాన్ని తాజాగా సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్ కొట్టగా, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నాని తండ్రి గంటా రాంబాబు, నిర్మాత వెంకట్ బోయనపల్లి స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేశారు. 'కోర్ట్' దర్శకుడు రామ్ జగదీష్, శైలేష్ కొలను కలిసి తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు.
నాని మాట్లాడుతూ: యూనానిమస్ ప్రొడక్షన్స్ రెండో చిత్రం 'అలియాస్ రుక్మిణి' పూజా కార్యక్రమంతో ఈ రోజు ప్రారంభమవడం చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్ ప్రారంభం నుంచే, నేను సక్సెస్ కాకముందే నితిన్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. 'జయం', 'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే' వంటి సినిమాల్లో నితిన్‌ను ప్రేక్షకులు ఎంతగా ప్రేమించారో మనందరికీ తెలుసు. ఇప్పుడు 'అలియాస్ రుక్మిణి'తో మరోసారి ఆయనను ప్రేమించేలా చేసే సినిమా చేస్తున్నామనే నమ్మకం ఉంది. ఇది చాలా అందమైన ప్రేమకథ. మంచి కథ, అద్భుతమైన టెక్నీషియన్స్‌తో కలిసొస్తే అలాంటి ప్రేమకథలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ప్రేక్షకులు చాలా కాలం గుర్తుంచుకునే సినిమా చేయబోతున్నాం. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ సినిమా చాలా ప్రత్యేకంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్."
హీరో నితిన్ మాట్లాడుతూ: ఈ రోజు మా సినిమా ముహూర్తం జరగడం చాలా ఆనందంగా ఉంది. నాని సమర్పణలో, దీప్తి నిర్మాణంలో, మురళీకాంత్ దర్శకత్వంలో ఈ సినిమా నా కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుంది. ఇంత మంచి కథను నాకు తీసుకొచ్చిన నానికి, ఇంత మంచి దర్శకుడిని పరిచయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా నాని, మురళీ, దీప్తి, మొత్తం టీమ్‌తో పాటు నన్ను కూడా గర్వపడేలా చేస్తుందని నమ్ముతున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. త్వరలో థియేటర్లలో కలుద్దాం."
దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ మాట్లాడుతూ: ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కథను నాని అన్నకు చెప్పిన వెంటనే 'చేద్దాం' అని చెప్పడంతో ఈ ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి అన్నీ చాలా అందంగా జరుగుతున్నాయి. నితిన్ అన్న ఈ సినిమాలో భాగం కావడం నా కల నిజమైనట్టే. అదే సమయంలో బాధ్యత కూడా మరింత పెరిగింది. మా బెస్ట్ ఇవ్వడానికి మేమంతా కట్టుబడి ఉన్నాం. త్వరలో షూటింగ్ ప్రారంభించి వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఈ సినిమా అందరినీ అలరించి, ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోయే చిత్రంగా నిలవాలని కోరుకుంటున్నాను."
నిర్మాత దీప్తి గంటా మాట్లాడుతూ: కొన్ని కథలు విన్న వెంటనే ఇది ప్రత్యేకమైన సినిమా అవుతుంది' అనే ఫీలింగ్ వస్తుంది. మురళీ ఈ కథ చెప్పినప్పుడు నాకు అదే అనిపించింది. నాని కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటారని నమ్మాను. 'కోర్ట్' తర్వాత ఎన్నో కథలు విన్నాం. కానీ మొదటిసారి ఈ కథ విన్నప్పుడు మాత్రమే ఆ బలమైన నమ్మకం కలిగింది. ఇది అద్భుతమైన స్క్రిప్ట్. మా కృష్ణ పాత్ర కోసం సరైన హీరోని వెతుకుతున్న సమయంలో 'నితిన్ అన్నను అడుగుదామా' అని నాని సూచించారు. అనౌన్స్‌మెంట్ వీడియో షూట్ చేసిన తర్వాత ఆ లుక్‌లో నితిన్‌ను చూసిన క్షణమే ఆయనే మా కృష్ణ అని ఫిక్స్ అయిపోయాం. ఆ పాత్రకు ఆయన పర్ఫెక్ట్‌గా సరిపోయారు. ఈ ప్రయాణాన్ని మీరంతా ఆస్వాదించే రోజు కోసం ఎదురుచూస్తున్నాను."
సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ: నాని గారి సమర్పణలో ఇది నా మూడో సినిమా. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. దీప్తి గారి నిర్మాణ సంస్థతో మరోసారి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నితిన్ గారి సినిమాకు సంగీతం అందించడం కూడా చాలా సంతోషంగా ఉంది. మురళీ అద్భుతమైన కథ రాశారు. ఆ కథలోని భావోద్వేగాలను మరింత బలంగా ప్రేక్షకులకు చేరేలా నా వంతు అత్యుత్తమ సంగీతాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను."
ఈ చిత్రానికి జోమన్ టి. జాన్ ISC సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న 'అలియాస్ రుక్మిణి' చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభం కానుంది.
తారాగణం: నితిన్
సాంకేతిక సిబ్బంది:
సమర్పణ: నేచురల్ స్టార్ నాని
ప్రొడక్షన్ బ్యానర్: యూనానిమస్ ప్రొడక్షన్స్
రచన & దర్శకత్వం: మురళీ కాంత్ దేవసోత్
నిర్మాత: దీప్తి గంటా
సినిమాటోగ్రఫీ: జోమోన్ T. జాన్ ISC
సంగీతం: విజయ్ బుల్గానిన్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రశాంత్ మండవ
కాస్ట్యూమ్ డిజైనర్: రేఖ బొగ్గర్రపు
పబ్లిసిటీ డిజైనర్: భరణిధరన్