pizza

Anakapalli Trailer, Packed with High-Octane Action, Launched at Elite Cricket League by Tollywood Thunders Team; Film Set for Grand Release on August 7
ఎలైట్ క్రికెట్ లీగ్ లో ఫుల్ యాక్షన్ మోడ్‌లో సాగే ‘అనకాపల్లి’ ట్రైలర్ ను విడుదల చేసిన టాలీవుడ్ థండర్స్ టీం.. ఆగస్ట్ 7న భారీ ఎత్తున చిత్రం విడుదల

You are at idlebrain.com > news today >

27 July 2026
Hyderabad

Starring Vikram Sahidev, Sandhya Vasishta, and Tarak Ponnappa in the lead roles, Anakapalli is a raw and rustic entertainer produced by Kandregula Naidu and Thrinadha Rao Nakkina under the Bhavya Sri Movie Makers and Nakkina Narratives banners. The film is directed by Khagesh Tammineni. Kandregula Kumar Raja serves as the co-producer. Along with writing the story and screenplay, Thrinadha Rao Nakkina also plays a key role in the movie. Anakapalli is gearing up for a grand theatrical release on August 7. The film's songs and teaser have already received a great response on social media.

The makers have now unveiled the film's trailer. It was launched during the Elite Cricket League Season 2 event held in Visakhapatnam, where the Tollywood Thunders team released it in the presence of thousands of spectators. Actors Srikanth, Thaman, Sudheer Babu, Tarun, Ashwin Babu, and several others attended the event, unveiled the trailer, and congratulated the team.

The trailer presents a refreshing love story between the lead pair, while Tarak Ponnappa's villainous role stands out with a unique approach. The action sequences look raw, realistic, and intense, giving the film a fresh appeal. Thrinadha Rao Nakkina and Indraja, who play middle-class parents, bring strong emotional depth that is likely to connect with family audiences. At the same time, the film offers plenty of romance and action to entertain youth and mass audiences. Overall, the trailer suggests that Anakapalli is designed to appeal to viewers across all sections.

The film's cinematography is handled by Maaya V, while Srikrishna Attaluri is the editor. The story and screenplay are written by Thrinadha Rao Nakkina, and the dialogues are penned by Uday Bhagavatula. Anakapalli is all set for a grand worldwide release on August 7.

Cast : Vikram Sahidev, Sandhya Vasishta, Tarak Ponnappa, Thrinadha Rao Nakkina, Indraja Absar, Mahaboob Basha, Srinivas Vadlamani, Kandregula Naidu, Nandini Rai, Sangeetha Krish, and others.

Technical Crew:
Banners: Bhavya Sri Movie Makers, Nakkina Narratives
Producers: Kandregula Naidu, Thrinadha Rao Nakkina
Co-Producer: Kandregula Kumar Raja
Story & Screenplay: Thrinadha Rao Nakkina
Director: Khagesh Tammineni
Director of Photography: Maya V
Music: Davzand
Editor: Srikrishna Attaluri
Executive Producer: Setramaraju Mallela
Dialogues: Uday Bhagavatula
Production Designer: Raghu Kulkarni
Choreography: Sekhar VJ, Yash Master, Jithu Master
Costume Designer: Surya Koya
Lyrics: Anantha Sriram, KK, Ganesh Saladi, Rambabu Goshala, Teja Gorle
Additional Songs: V. Kiran Kumar
Co-Director: Ramesh Babu Yepati
Sound Effects: Hemanth
DI: Red Ochre
Colourist: M. Raju Reddy
Line Producer: NVSS Suresh
Production Controller: Chandu Desetti

ఎలైట్ క్రికెట్ లీగ్ లో ఫుల్ యాక్షన్ మోడ్‌లో సాగే ‘అనకాపల్లి’ ట్రైలర్ ను విడుదల చేసిన టాలీవుడ్ థండర్స్ టీం.. ఆగస్ట్ 7న భారీ ఎత్తున చిత్రం విడుదల

విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న రా అండ్ రస్టిక్‌ చిత్రం ‘అనకాపల్లి’. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కిన ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. ఆగస్ట్ 7న చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పాటలు, టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. విశాఖపట్నంలో జరిగిన ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2లో ఈ ట్రైలర్‌ను టాలీవుడ్ థండర్స్ టీం కలిసి వేలాది మంది సమక్షంలో ఈ ట్రైలర్‌ను విడుదల చేసింది. హీరో శ్రీకాంత్, తమన్, సుధీర్ బాబు, తరుణ్, అశ్విన్ బాబు తదితరులంతా కూడా ట్రైలర్‌ను విడుదల చేసి అభినందనలు తెలియజేశారు.

ఈ ట్రైలర్‌లో హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ కొత్తగా ఉండటం, తారక్ పొన్నప్ప విలనిజం డిఫరెంట్‌గా ఉండటం, యాక్షన్ సీక్వెన్స్ ఎంతో సహజంగా ఉండటంతో ఓ కొత్త ఫీల్ కలుగుతుంది. ఈ ట్రైలర్‌లో మిడిల్ క్లాస్ పేరెంట్స్‌గా త్రినాథరావు నక్కిన, ఇంద్రజ కనిపిస్తున్న తీరు చూస్తుంటే ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కావాల్సినంత ఎమోషన్ ఉందనిపిస్తోంది. యూత్, మాస్ ఆడియెన్స్‌కి నచ్చే లవ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా పుష్కలంగా ఉన్నాయి. అన్ని వర్గాల ఆడియెన్స్‌ను టార్గెట్ చేయబోతోన్నామని ఈ ట్రైలర్‌ కట్‌తో చెప్పకనే చెప్పారు.

ఈ చిత్రానికి మాయా.వి కెమెరామెన్‌గా, శ్రీకృష్ణ అట్టలూరి ఎడిటర్‌గా పని చేశారు. త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి ఉదయ్ భాగవతులు డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు. ఈ మూవీని ఆగస్ట్ 7న భారీ ఎత్తున విడుదల చేయబోతోన్నారు.

తారాగణం : విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప, త్రినాధ రావు నక్కిన, ఇంద్రజ అబ్సర్, మహబూబ్ బాషా, శ్రీనివాస్ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందిని రాయ్, సంగీత క్రిష్ తదితరులు

సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్
నిర్మాతలు: కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన
సహ నిర్మాత: కాండ్రేగుల కుమార్ రాజా
కథ & స్క్రీన్‌ప్లే: త్రినాధరావు నక్కిన
దర్శకుడు: ఖగేష్ తమ్మినేని
డీ ఓ పి : మాయా. వి
సంగీతం: దేవ్ జండ్
ఎడిటర్: శ్రీకృష్ణ అట్టలూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సెట్రామరాజు మల్లెల
సంభాషణలు: ఉదయ్ భాగవతుల
ప్రొడక్షన్ డిజైనర్: రఘు కులకర్ణి
కొరియోగ్రఫీ: శేఖర్ VJ, యష్ మాస్టర్, జిత్తు మాస్టర్
కాస్ట్యూమ్ డిజైనర్: సూర్య కొయ్య
సాహిత్యం: అనంత శ్రీరామ్, కెకె, గణేష్ సలాది, రాంబాబు గోశాల, తేజ గొర్లె
అదనపు పాటలు: వి.కిరణ్ కుమార
కో-డైరెక్టర్: రమేష్ బాబు యేపాటి
సౌండ్ ఎఫెక్ట్స్: హేమంత్
డి ఐ : రెడ్ ఓచర్
రంగు: ఎం. రాజు రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: NVSS సురేష్
ప్రొడక్షన్ కంట్రోలర్: చందు దేశెట్టి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved
ohsukumari-prereleaseevent s