3 July 2023
Hyderabad
Ranbir Kapoor and Sandeep Reddy Vanga’s upcoming action-thriller Animal pre-teaser was unveiled a few days ago to a thumping response and it increased prospects for the movie. Movie buffs are waiting eagerly to watch Animal in theatres. However, the film's release stands postponed. Animal which was initially scheduled for release on August 11th is pushed to December 1st.
Director Sandeep Reddy Vanga released a video where he explained the reason for the postponement. He said the extensive post-production is the prime reason for the delay. He revealed that the movie has 7 songs and recording each song with perfect lyrics in five different languages is a big task. He also made it clear that the sequence in the pre-teaser is there in the movie.
This action saga in a combination of dynamic powerhouses of the Indian film Industry is produced by visionary Bhushan Kumar, alongside Pranay Reddy Vanga on T Series and Bhadrakali Pictures.
National crush Rashmika Mandanna is playing the leading lady opposite Ranbir, while Anil Kapoor will be seen in an important role. Top-notch technicians handle different crafts of the movie which will release in cinemas in Hindi, Telugu, Tamil, Kannada and Malayalam languages.
Cast: Ranbir Kapoor, Anil Kapoor, Rashmika Mandanna
Technical Crew:
Director: Sandeep Reddy Vanga
Producers: Bhushan Kumar, Pranay Reddy Vanga
Banners: T Series, Bhadrakali Pictures
రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ 'యానిమల్' డిసెంబర్ 1న విడుదల
రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా యాక్షన్-థ్రిల్లర్ 'యానిమల్' ప్రీ-టీజర్ కొన్ని రోజుల క్రితం విడుదలై ట్రెమండస్ రెస్పాన్స్ తో అంచనాలు పెంచింది. యానిమల్‌ని థియేటర్లలో చూసేందుకు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా విడుదల వాయిదా పడింది. మొదట ఆగస్ట్ 11న విడుదల కావాల్సిన యానిమల్ డిసెంబర్ 1కి వాయిదా పడింది.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేసి వాయిదాకు గల కారణాన్ని చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అధికంగా ఉండటమే ఆలస్యానికి ప్రధాన కారణమని వివరించారు. సినిమాలో 7 పాటలు ఉన్నాయని, ఒక్కో పాటను ఐదు భాషల్లో పర్ఫెక్ట్ లిరిక్స్‌తో రికార్డ్ చేయడం బిగ్ టాస్క్ అని చెప్పారు. ప్రీ టీజర్‌లోని సీక్వెన్స్ సినిమాలో ఉందని కూడా స్పష్టం చేశారు.
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోని డైనమిక్ పవర్‌హౌస్‌ల కలయికలో విజనరీ భూషణ్ కుమార్ టి సిరీస్ పై భద్రకాళి పిక్చర్స్‌పై ప్రణయ్ రెడ్డి వంగాతో కలసి ఈ యాక్షన్ సాగాను నిర్మిస్తున్నారు.
రణబీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా, అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.
తారాగణం: రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా
నిర్మాతలు: భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా
బ్యానర్లు: టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్