pizza
‘చిత్రాంగద’గా వస్తున్న అంజలి
You are at idlebrain.com > news today >
Follow Us

21 March 2015
Hyderabad

‘గీతాంజలి’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత కథానాయిక అంజలి మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై పిల్లజమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి గంగపట్నం శ్రీధర్ నిర్మాత. కాగా ఈ చిత్రానికి ‘చిత్రాంగద’ అనే టైటిల్‌ని నిర్ణయించారు. అరవైశాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత శ్రీధర్ తెలియజేస్తూ ‘గీతాంజలి’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత అంజలికి లేడీ కథానాయిక చిత్రాల ఆఫర్లు వచ్చినా ఆమె అంగీకరించలేదు. మా కథ విన్న వెంటనే ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ‘గీతాంజలి’ తరహాలోనే ఇది కూడా ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో, పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతున్న థ్రిల్లర్ కామెడీ మూవీ ఇది. ఈ చిత్రంలో ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేయని పలు అంశాలు వుంటాయి. కథ డిమాండ్ మేరకు ఎక్కువభాగం అమెరికాలో చిత్రీకరణ జరిపాం. బ్యాలెన్స్‌గా వున్న పాటలను యూరప్, కేరళలో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నాం. వేసవిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం.అంజలి కెరీర్‌లో మరో మైలురాయిగా ఈ చిత్రం వుండబోతుంది’ అని తెలిపారు. అంజలి, సప్తగిరి, స్వాతిదీక్షిత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సెల్వగణేషన్, స్వామినాథన్, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, సమర్పణ: చంద్రశేఖర్ రెడ్డి, వెంకట్ వడపల్లి.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved