pizza

“Antha Ramuloru Choosukuntaru” is a Beautiful Love Story and Feel-Good Film: Young Promising Hero Sangeeth Shobhan at the Title Glimpse Launch Event
"అంతా రాములోరు చూస్కుంటారు" బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫీల్ గుడ్ ఫిలిం - టైటిల్ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ లో యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్

You are at idlebrain.com > news today >

5 September 2026
Hyderabad

Young and promising hero Sangeeth Shoban is starring in the upcoming film “Antha Ramuloru Choosukuntaru,” with Anaswara Rajan playing the female lead. Presented by Smt. Sravani, the film is being produced by successful producer Dheeraj Mogilineni and new-age aspiring producer Giribabu Vallabhaneni under the banners of Dheeraj Mogilineni Entertainment and VGB Entertainment. Talented director Palnati Surya Pratap is helming this entertaining love story, with Lakshmi Bhupal serving as the writer.

The grand title glimpse launch event of “Antha Ramuloru Choosykuntaru” was held today in Hyderabad. Speaking on the occasion:

Producer Giribabu Vallabhaneni said, “We are making ‘Antha Ramuloru Choosukuntaru’ as an entertaining love story. Just as our title suggests, everything will be taken care of by Ramuloru. I wish the entire team the very best.”

Director Palnati Surya Pratap said, “The chemistry between Sangeeth’s and Anaswara’s characters is very good in our movie. Their pairing will motivate and connect with everyone. While watching the film, audiences will get the feeling that they are a wonderful couple. Sangeeth and Anaswara have tuned into each other extremely well.

I would like to thank producer Dheeraj, who believed in this story and called me because he trusted that I could do justice to it. I can never forget him in my life. I also thank producer Giri.

The film is set against a Godavari backdrop. We shot on the other side of Rajahmundry and Konaseema. So, rather than using the exact Godavari dialect, there is a slight variation in the slang used in the film.

We did not choose the title ‘Antha Ramuloru Choosukuntaru’ randomly. There is a concept behind it. I hope you continue to extend the same love and support to our film.”

Producer Dheeraj Mogilineni said, “I have always loved pleasant family entertainers like ‘Nuvvu Naaku Nachav’ and ‘Nuvvu Leka Nenu Lenu.’ In a similar vein, I have produced ‘Antha Ramuloru Choosukuntaru’ as a beautiful love story set against a Godavari backdrop.

When I heard this story a year ago, I felt that it would remain in my personal library as one of my favourite movies. I believe all of us will fall in love with this film.

I wanted to make a film with Sangeeth even before ‘MAD,’ but I could not find the right script. When I heard this story, I felt it was the perfect subject for Sangeeth. The script written by Pratap and the way he brought it to life surprised me. The film has turned out exactly the way we imagined the scenes while listening to the story.

This is a film that will perform well in theatres. Even after it arrives on OTT, people will continue to watch it for years. It is the kind of movie that makes you want to watch it repeatedly with your family whenever you have some free time.

For the character of Shirisha, we could not imagine anyone other than Anaswara. We pursued her for six months before getting her dates. Audiences will fall in love with her performance.

After seeing the kind of following Sangeeth has among the youth, we felt that it would be great to make a film like this with him. From the day the shooting began, Sangeeth completely blended into the character.

I would like to thank Giri, who is producing this movie along with me with great passion for the film.”

Heroine Anaswara Rajan said, “I hope you all liked the title glimpse of our movie. I am confident that you will enjoy the film in theatres as well. Every scene in the movie will appeal to you.

We made this film against the backdrop of the Godavari districts. The atmosphere there felt like a mini Kerala. The love shown by the people there and the food available were both wonderful. We also got to taste some of the region’s special sweets.

We still have some shooting left to complete. I request all of you to come to theatres with your family members and enjoy this film. I hope you will fall in love with the characters of Shirisha and Maruthi.”

Hero Sangeeth Shoban said, “Even though it is a Sunday, many of you have come to our movie’s title glimpse launch and shown us so much love. Thank you very much. You have been showering me with the same love and affection since ‘MAD.’ I consider all of that to be Ramuloru’s blessings.

Since this is only the title glimpse, I won’t reveal much about the movie. We will talk more about it at our upcoming events.

We often leave things to God and say that He will take care of everything. But in this film, the hero Maruthi leaves everything completely to God. He believes that ‘Ramuloru will take care of everything’ and lives his life with that faith.

This is not just a love story but also a beautiful feel-good film. While watching the movie, Maruthi will make you laugh, make you cry, make you feel sorry for him, and even frustrate you. At times, you may also feel, ‘Why is this guy like this?’ I had the confidence from the moment I heard the story that audiences would own this character and watch the film emotionally connected to him.

So far, I have mostly been doing films in the Telangana dialect. I wanted to break that typecast. This movie features the Godavari dialect, and I believed it would be something new for me.

After ‘Raakasa,’ I was in a dilemma about what kind of films I should do next. That was when Dheeraj brought this script to me. When Surya Pratap narrated the script, I really liked all the emotional layers in my character. I could visualize every scene while listening to the narration.

There are scenes throughout this movie that will keep a smile on your face. I hope you will all enjoy it.”

Cast:
Sangeeth Shoban, Anaswara Rajan, and others

Technical Team:
Writer: Lakshmi Bhupal
Presented by: Smt. Sravani
Banners: Dheeraj Mogilineni Entertainment, VGB Entertainment
Producers: Dheeraj Mogilineni, Giribabu Vallabhaneni
Direction: Palnati Surya Pratap
Digital Marketing: House Full Digital

"అంతా రాములోరు చూస్కుంటారు" బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫీల్ గుడ్ ఫిలిం - టైటిల్ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ లో యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్

యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా "అంతా రాములోరు చూస్కుంటారు". ఈ చిత్రంలో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీమతి శ్రావణి సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్, వి.జి.బి. ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని, న్యూ యాస్పరెంట్ ప్రొడ్యూసర్ గిరిబాబు వల్లభనేని నిర్మిస్తున్నారు. ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీతో టాలెంటెడ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ రూపొందిస్తున్నారు. లక్ష్మీ భూపాల్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో "అంతా రాములోరు చూస్కుంటారు" సినిమా టైటిల్ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

ప్రొడ్యూసర్ గిరిబాబు వల్లభనేని మాట్లాడుతూ - ఎంటర్ టైన్ మెంట్ తో కూడిన లవ్ స్టోరీతో మా "అంతా రాములోరు చూస్కుంటారు"ను నిర్మిస్తున్నాం. మా టైటిల్ లో ఉన్నట్లు అంతా రాములోరు చూసుకుంటారు. మా టీమ్ అందరికీ బెస్ట్ విశెస్ అందిస్తున్నా. అన్నారు.

డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ మాట్లాడుతూ - మా మూవీలో హీరో సంగీత్, హీరోయిన్ అనస్వర క్యారెక్టర్స్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. వీళ్ల పెయిర్ మనందరినీ మోటివేట్ చేస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు ఒక మంచి జంట అనే ఫీల్ కలిగిస్తారు. సంగీత్, అనస్వర అంత బాగా ట్యూన్ అయ్యారు. ఈ కథను నమ్మి ఈ కథకు నేను న్యాయం చేయగలను అని నమ్మి నాకు కాల్ చేసిన ప్రొడ్యూసర్ ధీరజ్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ఆయనను జీవితంలో మర్చిపోలేను. ప్రొడ్యూసర్ గిరికు కూడా థ్యాంక్స్. గోదావరి బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన చిత్రమిది. రాజమండ్రికి కోనసీమకు అవతల సైడ్ తీశాము. అందుకే ఈ సినిమాలో ప్రాపర్ గోదావరి స్లాంగ్ కాకుండా ఆ స్లాంగ్ లోనే చిన్న వేరియేషన్ కనిపిస్తుంటుంది. అంతా రాములోరు చూస్కుంటారు అనే టైటిల్ మేము ఊరికే పెట్టలేదు. దాని వెనక కాన్సెప్ట్ ఉంది. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ - నువ్వు నాకు నచ్చావ్, నువ్వు లేక నేను లేను లాంటి ప్లెజెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ తరహాలో గోదావరి బ్యాక్ డ్రాప్ లో మంచి లవ్ స్టోరీతో "అంతా రాములోరు చూస్కుంటారు" చిత్రాన్ని నిర్మించాను. ఏడాది క్రితం ఈ కథ విన్నప్పుడు నా ఫేవరేట్ మూవీలా లైబ్రరీలో ఉండిపోతుంది అనిపించింది. మనమంతా ఈ సినిమాతో ప్రేమలో పడతాం. మ్యాడ్ సినిమా కంటే ముందే సంగీత్ తో సినిమా చేయాలని అనుకున్నాను. సరైన స్క్రిప్ట్ దొరకలేదు. ఈ కథ విన్నప్పుడు సంగీత్ కు కరెక్ట్ సబ్జెక్ట్ అనిపించింది. ప్రతాప్ ఈ సినిమాకు రాసిన స్క్రిప్ట్, రూపొందించిన విధానం నన్ను సర్ ప్రైజ్ చేసింది. కథ విన్నాక మనం సీన్స్ ఎలా ఉంటాయని ఊహించుకుంటామో సరిగ్గా అలాగే రూపొందించారు. థియేటర్స్ లో బాగా ఆడే చిత్రమిది. ఓటీటీలోకి వచ్చాక కొన్నేళ్ల పాటు చూసుకుంటారు. టైమ్ దొరికినప్పుడు ఫ్యామిలీతో కలిసి చూడాలనిపించి రిపీటెడ్ గా చూస్తారు. ఈ చిత్రంలో శిరీష పాత్రకు అనస్వరను తప్ప మరొకరిని ఊహించుకోలేకపోయాం. ఆరు నెలలు ఆమె వెంట పడి డేట్స్ తీసుకున్నాం. ఆమె పర్ ఫార్మెన్స్ కు ఆడియెన్స్ లవ్ లో పడతారు. యూత్ లో సంగీత్ ఉన్న ఫాలోయింగ్ చూశాక ఇలాంటి కథతో ఆయనతో సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది. షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సంగీత్ ఆ క్యారెక్టర్ లో బ్లెండ్ అయిపోయారు. సినిమా మీద ప్యాషన్ తో నాతో కలిసి ఈ మూవీ ప్రొడ్యూస్ చేస్తున్న గిరికి థ్యాంక్స్. అన్నారు.

హీరోయిన్ అనస్వర రాజన్ మాట్లాడుతూ - మా మూవీ టైటిల్ గ్లింప్స్ మీకు నచ్చిందని నమ్ముతున్నాను. మా మూవీని కూడా థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారు. సినిమాలోని ప్రతి సీన్ మీకు బాగా నచ్చుతుంది. ఈ సినిమాను గోదావరి జిల్లాల నేపథ్యంతో చేశాం. అక్కడి వాతావరణం చూస్తుంటే మినీ కేరళలా అనిపించింది. అక్కడ వాళ్లు చూపించే లవ్, దొరికే ఫుడ్ చాలా బాగున్నాయి. అక్కడి స్పెషల్ స్వీట్స్ టేస్ట్ చేశాం. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా ఫినిష్ చేయాల్సిఉంది. మీరంతా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి థియేటర్స్ కు వచ్చి ఈ సినిమాను ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా. ఈ చిత్రంలోని శిరీష, మారుతి క్యారెక్టర్స్ ను మీరు ప్రేమిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.

హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ - సండే అయినా మా మూవీ టైటిల్ గ్లింప్స్ లాంఛ్ కు వచ్చి మీరు చూపిస్తున్న లవ్ కు చాలా థ్యాంక్స్. మ్యాడ్ సినిమా నుంచి మీరు నాపై ఇలాంటి ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. అదంతా రాములోరి దయ అనుకుంటాను. ఇది టైటిల్ గ్లింప్స్ కాబట్టి మూవీ గురించి ఎక్కువగా చెప్పను. నెక్ట్స్ ఈవెంట్స్ లో మాట్లాడుకుందాం. మనం దేవుడు చూసుకుంటాడు అని ఆయన మీద ఎంతో కొంత భారం పెడుతుంటాం. కానీ ఈ సినిమాలో హీరో మారుతి వందశాతం దేవుడి మీద వదిలేస్తాడు. అంతా రాములోరు చూస్కుంటారు అని నమ్మి బతికేస్తుంటాడు ఈ మారుతి. ఇది లవ్ స్టోరీతో పాటు బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ ఫిలిం. మీరు సినిమా చూస్తున్నప్పుడు ఈ మారుతి మిమ్మల్ని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, అతని మీద మీకు జాలి కలుగుతుంది, చిరాకేస్తుంది. ఏంట్రా వీడు ఇలా ఉన్నాడు అనే ఫీల్ కూడా వస్తుంది. ప్రేక్షకులు ఈ పాత్రను ఓన్ చేసుకుని చూస్తారు అనే నమ్మకం కథ విన్నప్పుడే కలిగింది. నేను ఇప్పటిదాకా తెలంగాణ యాసలో సినిమాలు చేస్తూ వచ్చాను. ఆ టైప్ కాస్ట్ బ్రేక్ చేయాలనుకున్నాను. ఈ మూవీ గోదావరి యాసలో ఉంటుంది. నాకు కొత్తగా ఉంటుందని నమ్మాను. రాకాస తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలని డైలమాలో ఉన్న టైమ్ లో ధీరజ్ ఈ స్క్రిప్ట్ నా దగ్గరకు తీసుకొచ్చాడు. సూర్యప్రతాప్ గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడు నా క్యారెక్టర్ లోని ఎమోషన్స్ లేయర్స్ అన్నీ నచ్చాయి. ప్రతి సీన్ ను ఊహించుకోగలిగాను. ఈ సినిమాలో ఆద్యంతం మీ ఫేస్ మీద ఒక స్మైల్ వచ్చేలా సీన్స్ ఉంటాయి. అన్నారు.

నటీనటులు - సంగీత్ శోభన్, అనస్వర రాజన్, తదితరులు

టెక్నికల్ టీమ్

రైటర్ - లక్ష్మీ భూపాల్
సమర్పణ - శ్రీమతి శ్రావణి
బ్యానర్స్ - ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్, వి.జి.బి. ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు - ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని
డైరెక్షన్ - పల్నాటి సూర్యప్రతాప్
డిజిటల్ మార్కెటింగ్ - హౌస్ ఫుల్ డిజిటల్

 


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved