pizza

Anumana Pakshi Song Launch
డిజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ, రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, చిలకా ప్రొడక్షన్స్ 'అనుమాన పక్షి' నుంచి రమణ గోగుల పాడిన గులాబ్ జామ్ సాంగ్ లాంచ్

You are at idlebrain.com > news today >

27 March 2026
Hyderabad

రాగ్ మయూర్ హీరోగా, డిజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అనుమాన పక్షి'. చిలకా ప్రొడక్షన్స్ పై రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహనిర్మాత. ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా నుంచి గులాబ్ జామ్ సాంగ్ లాంచ్ చేశారు. శ్రీచరణ్ పాకాల క్యాచి ట్యూన్ గా కంపోజ్ చేసిన ఈ పాటని వెటరన్ సింగర్ రమణ గోగుల పాడిన తీరు కట్టిపడేసింది. కిట్టు విస్సాప్రగడ రాసిన లిరిక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ కి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.

సాంగ్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అనుమాన పక్షి సినిమా కంటెంట్ చాలా నచ్చింది. డైరెక్టర్ విమల్ తో మేము ఒక సినిమా చేయాలనుకున్నాం. కొంత స్క్రిప్ట్ వరకు కూడా జరిగింది. కాకపోతే అది మెటీరియలైజ్ కాలేదు. రాజీవ్ తో మాకు ఎప్పటినుంచో పరిచయం ఉంది. వాళ్ళది ఆనిమేషన్లో చాలా స్ట్రాంగ్ కంపెనీ. డిజె టిల్లు తర్వాత మళ్లీ అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ విమల్ రాసుకున్నాడు. మనం ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో రోజు అనుమాన పడుతూనే ఉంటాం. అలాంటి ఐడియాతో స్క్రిప్ట్ రెడీ చేశారు. టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్ చేస్తున్నారు. రాగ్ మయూర్ చాలా టాలెంటెడ్. శ్రీ చరణ్ నాంది గూడచారి డి జె టిల్లు లాంటి డిఫరెంట్ జోనర్ సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా కంటెంట్ కొంత చూశాను, చాలా ఫన్ వుంది. ఈ సినిమాని మేలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.తప్పకుండా చూస్తాను. చూసాక సినిమా గురించి ఇంకా మాట్లాడుతాను. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.

హీరో రాగ్ మయూర్ మాట్లాడుతూ.. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నాకు ఎప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.నాపై నా కెరీర్ లో ఫస్ట్ సాంగ్ గులాబ్ జామ్ . అది కూడా రమణ గోగుల గారు లాంటి ఒక గొప్ప సింగర్ పాడటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. శ్రీ చరణ్ ఈ పాట పాడి వినిపించినప్పుడు ఆయన అయితే బాగుంటుందని అనుకున్నాం. మేము బలంగా కోరుకున్నట్టే ఫైనల్ గా ఆయన వచ్చి పాడడం, ఆయన స్టూడియోలో పాడుతుంటే మాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. ఆయన ఈ పాటని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లారు. అనుమాన పక్షి పూర్తిగా ఒరిజినల్ కంటెంట్. ఎక్కడ ఏ ఇన్స్పిరేషన్ ఉండదు. డైరెక్టర్ విమల్ చాలా అద్భుతమైన క్యారెక్టర్ డ్రివెన్ కథని రాసుకున్నారు. ఆ కథలో నేను వుండటం అదృష్టంగా భావిస్తున్నాను. ఒక పూర్తి క్యారెక్టర్ ఫిల్మ్ చేయడం నాకు ఇదే ఫస్ట్ టైం. ఈ సందర్భంగా మా దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమా దాదాపుగా కాశ్మీర్లో షూట్ చేశాం. పెహల్గవ్ ఇన్సిడెంట్ తర్వాత అక్కడ షూట్ చేసిన ఫస్ట్ సినిమా ఇది. ఈశ్వర్ గారు చాలా అద్భుతంగా ఈ పాటని కొరియోగ్రఫీ చేశారు. రాశి గారితో తో కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది. అలాగే మెరీన్ గారు చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. అజయ్ బ్రహ్మాజీ పాత్రలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అందరు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. శ్రీ చరణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మిగతా రెండు పాటలు కూడా అదిరిపోతాయి.

డైరెక్టర్ విమల్ కృష్ణ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ముందుగా ప్రొడ్యూసర్ రాజీవ్ గారికి థాంక్స్. ఈ సినిమా విషయంలో నామీద ఆయన ఎలాంటి అనుమానం పెట్టుకోలేదు. కావలసినఅంత ఫ్రీడమ్ ఉండడం వల్ల ఈ సినిమా ఫాస్ట్ గా చేయగలిగాను. ఇది మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. దీంతోపాటు చిన్న సైక్లాజికల్ సస్పెన్స్ కూడా ఉంటుంది. కచ్చితంగా ధియేటర్లో ఒక ఫన్ రైడ్ లానే ఉంటుంది. డిజె టిల్లు కి ఎలా సపోర్ట్ చేశారో ఈ సినిమా కూడా అలా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. శ్రీ చరణ్ మ్యూజిక్ ఈ సినిమాకి బ్యాక్ బోన్. మా డైరెక్షన్ ప్రొడక్షన్ టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రాశి గారితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. అజయ్ గారు బ్రహ్మాజీ గారిని ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా చూస్తారు ఈ సినిమా చూసిన తర్వాత రాగ్ పర్ఫార్మెన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఈ సినిమాతో తను పెద్ద స్టార్ అవుతాడనే నమ్మకం ఉంది. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

సీనియర్ హీరోయిన్ రాశి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. కథ విన్నాక ఎలాంటి అనుమానం లేకుండా ఒప్పుకున్నాను. కొన్ని సినిమాల్లో చేస్తున్నప్పుడే హిట్ అవుతాయని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిన సినిమా ఇది. రాగ్ మయూర్ చాలా మంచి హీరో అవుతాడు. తను ఫ్యామిలీస్ ఇష్టపడే హీరో అవుతాడు. ఈ సినిమా మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా సినిమా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది

హీరోయిన్ మెరీన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. తెలుగులో ఇది నాకు మొదటి సినిమా. డైరెక్టర్ విమల్ గారికి నిర్మాతలకు ధన్యవాదాలు ఈ సినిమాలో భాగంగా చాలా ఆనందంగా ఉంది. నా తొలి సినిమాకి ఎంత మంచి టీం తో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది .తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది. మీ అందరూ సపోర్టు కావాలని కోరుకుంటున్నాను

ప్రొడ్యూసర్ రాజీవ్ చిలకా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా విచ్చేసిన దిల్ రాజు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన చేతుల మీదగా ప్రమోషన్స్ లాంచ్ కావడం చాలా ఆనందంగా ఉంది. విమల్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఇది చాలా యూనిక్ ఫిలిం. ఇలాంటి సినిమా మరొకటి లేదు. రాగ్ మయూర్ చక్కని నటన కనబరిచారు. ఈ ఫిలిం అద్భుతంగా ఉంటుంది. శ్రీ చరణ్ అద్భుతమైన ఔట్ స్టాండింగ్ మ్యూజిక్ ఇచ్చారు. చిలక ప్రొడక్షన్స్ లో ఇదే ఏడాది మరో సినిమాని కూడా రిలీజ్ చేయబోతున్నాం. మీ అందరి సపోర్టు కావాలని కోరుకుంటున్నాం.

కో ప్రొడ్యూసర్ భరత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. రారాగ్ మయూర్. విమల్ కృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ ఈ ముగ్గురు కలిసి అనుమాన పక్షి అనే మ్యాజిక్ ని క్రియేట్ చేశారు థియేటర్లో ఈ మ్యాజిక్ చూస్తారు. తప్పకుండా ఈ మ్యాజిక్ మీ అందరికీ నచ్చుతుంది. ఇది బ్యూటిఫుల్ కామెడీ ఎంటర్టైనర్.

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ.. అనుమానపక్షి నా 50వ సినిమా కావడం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా ఫన్ ఫిలిం. ఇలాంటి సినిమాలు చాలా ఇష్టపడతాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. డి జె టిల్లు తర్వాత విమన్ విమల్ తో నాకిది సెకండ్ కొలాబరేషన్. ఇది మంచి ఫన్ లోడెడ్ సినిమా థియేటర్స్ లో మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. రమణ గోగుల గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన ఈ సాంగ్ పడడం చాలా ఆనందాన్నిచ్చింది.

తారాగణం: రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సెసిల్, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, సుప్రీత్

సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: విమల్ కృష్ణ
నిర్మాతలు: రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్
సహ నిర్మాత - భరత్ లక్ష్మీపతి
ప్రొడక్షన్ హౌస్ - చిలక ప్రొడక్షన్స్
సంగీతం: శ్రీచరణ్ పాకాల,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ప్రశాంత్ మండవ
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : శ్రావణ్ కుప్పిలి
డీవోపీ: సునీల్ కుమార్ నామా
ఆర్ట్ డైరెక్టర్: JK మూర్తి
ఎడిటర్ : అభినవ్ కునపరెడ్డి
కాస్ట్యూమ్ డిజైనర్: సుమయ్య తబస్సుమ్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved