4 September 2024
Hyderabad
Rebel star Prabhas once again showed his good heart. Darling is always at the forefront to help people in crisis. Now, he came forward to stand by the people of both Telugu states who are suffering due to heavy rains and floods. Prabhas announced a donation of Rs 2 crore for the relief of flood victims in Andhra Pradesh and Telangana.
Prabhas donated one crore rupees to Andhra Pradesh and one crore rupees to Telangana to the Chief Minister's Relief Fund to aid the flood relief efforts. Prabhas responds to the natural calamities not only in the Telugu states but also in the country and gives huge donations as his responsibility. Recently, Prabhas announced a donation of 2 crore rupees to help the victims of landslides in Wayanad, Kerala.
Prabhas is currently doing a huge Pan India movie under the direction of Hanu Raghavapudi along with the movie "The Raja Saab". There are some other crazy projects in Prabhas' line-up.
వరద బాధితుల సహాయార్థం ఏపీ, తెలంగాణకు 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించిన రెబెల్ స్టార్ ప్రభాస్
రెబెల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం ప్రభాస్ 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కు కోటి రూపాయలు, తెలంగాణకు కోటి రూపాయల చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రభాస్ డొనేషన్ ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాలకే కాదు దేశంలో ఏర్పడే ప్రకృతి విపత్తుల పట్ల స్పందిస్తూ తన వంతు బాధ్యతగా భారీ విరాళాలు ఇస్తుంటారు ప్రభాస్. ఇటీవల కేరళ వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో బాధితులను ఆదుకునేందుకు ప్రభాస్ 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. ప్రభాస్ ప్రస్తుతం "ది రాజా సాబ్" మూవీతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రభాస్ లైనప్ లో ఉన్నాయి.
|