pizza

“No film like Arjun Chakravarthy has ever come in the kabaddi backdrop. This film will surely connect with everyone” – Producer Srini Gubbala
కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో ‘అర్జున్ చక్రవర్తి' లాంటి సినిమా ఇప్పటివరకూ రాలేదు. సినిమా ఖచ్చితంగా అందరికీ కనెక్ట్ అవుతుంది: నిర్మాత శ్రీని గుబ్బల

You are at idlebrain.com > news today >

19 August 2025
Hyderabad

Arjun Chakravarthy is a sports drama starring Vijay Ram Raju in the title role, directed by Vikranth Rudra and produced by Srini Gubbala. The film has already won 46 international film awards. The recently released teaser and songs received tremendous response. The film is set for release on August 29. On this occasion, producer Srini Gubbala shared details with the media.

About his background
“I am from Tanuku, West Godavari. My father, Gubbala Ramarao, is a social worker. I moved to the U.S. about 18 years ago. I have always been interested in creativity. Even in software, I worked on creative aspects. Over time, my passion for creativity led me into films.”

How the project started
“I was introduced to director Vikranth through my cousin. I really liked the story he narrated. After about six months of discussions, we decided to start the project. We gave full creative freedom to the director.”

Why choose a sports drama for your first film?
“When you create something new, the joy is different. While there have been kabaddi-themed films before, none have treated the subject with such seriousness. This film is a benchmark attempt in that regard. We took it up as a challenge.”

Story of Arjun Chakravarthy
“The story is about Nagulayya, a kabaddi player from Nalgonda, also known as Arjun. He was an exceptional player. About 60% of the film is based on true events from his life, while 40% is fictionalized. The film also has strong commercial elements.”

Why did the film take so long to make?
“The story demanded it. The hero had four to five physical transformations. All major characters also had transformations, each taking about nine months. That’s why it took time.”

Why not make it with a star hero?
“This story required the hero to undergo many transformations and dedicate a lot of time. Not everyone can spare that much. Also, we wanted to present the film authentically and take it to an international stage. It was well-received at film festivals and got great appreciation.”

Industry response so far
“The response has been very good, even from the North. Director Hanu Raghavapudi launched the teaser and said he was very impressed.”

On director Vikranth
“Vikranth is a great person and a passionate filmmaker. He handled the film brilliantly.”

Lessons from production
“The final budget always exceeds what you plan. But we never compromised on quality. We made the film without cutting corners.”

Music & DOP
“Vignesh Baskaran, who worked as sound engineer for Vikram Vedha, composed the music. It is excellent, and the already released songs received a great response. The re-recording is outstanding as well. Our DOP and director did immense groundwork and delivered fantastic visuals.”

On winning 46 international awards
“OTT platforms are reaching out to us because of it. But my focus is on promotions. Since I trust the content, I believe business will happen at the right time. Our target audience is clear—we’re preparing to release in Indian metros, as well as the U.S., U.K., Europe, and South Africa. I’m confident that within three days of release, it will also spread to rural audiences.”

About the heroine’s role
“Yes, she has great scope. Out of the 46 awards, she also won Best Actress. We haven’t revealed much of her portion, but her character is present from beginning to end.”

Casting kabaddi players
“The hero trained for six months. We also cast players from state and district-level kabaddi to maintain authenticity.”

His feeling after the first production
“The output has come out brilliantly. The film will definitely reach its target audience.”

Upcoming projects
“I want to make films in sports or tribal backdrops. But whatever I do, it will always be with proper commercial sensibilities.”

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో ‘అర్జున్ చక్రవర్తి' లాంటి సినిమా ఇప్పటివరకూ రాలేదు. సినిమా ఖచ్చితంగా అందరికీ కనెక్ట్ అవుతుంది: నిర్మాత శ్రీని గుబ్బల

విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి'. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఇటివలే రీలీజైన్ టీజర్, సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీని గుబ్బల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

మీ నేపధ్యం గురించి ?
-మాది వెస్ట్ గోదావరి తణుకు. మా నాన్నగారు గుబ్బల రామారావు సోషల్ వర్కర్. నేను యుఎస్ వెళ్లి 18 ఏళ్ళు అవుతుంది. నాకు మొదటి నుంచి క్రియేటివిటీ పై ఆసక్తి ఉంది. మేం సాఫ్ట్వేర్ లో కూడా క్రియేటివ్ వర్క్ చేస్తుంటాం. క్రియేటివిటీ మీద ఇష్టం డెవలప్ అవుతూ అలా సినిమాల్లోకి రావడం జరిగింది.

ఈ ప్రాజెక్టు ఎలా స్టార్ట్ అయింది?
-మా కజిన్ ద్వారా డైరెక్టర్ విక్రాంత్ పరిచయమయ్యారు. ఆయన చెప్పిన కథ చాలా నచ్చింది. ఒక ఆరు నెలలు ట్రావెల్ అయిన తర్వాత ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలనుకుని నిర్ణయించుకున్నాం. డైరెక్టర్ కి క్రియేటివ్ సైడ్ పూర్తిగా ఫ్రీహ్యాండ్ ఇచ్చాం.

మీ తొలి సినిమాని స్పోర్ట్స్ డ్రామాగా తీసుకోవడానికి కారణం ?
-క్రియేటివ్ గా ఏదైనా కొత్తగా చేస్తున్నప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటివరకు కొన్ని కథలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో చూపిస్తున్నంత సీరియస్ గా ఇప్పటివరకు సినిమా రాలేదు. కచ్చితంగా ఒక బెంచ్ మార్క్ మూవీ అవుతుందని చాలెంజ్ గా తీసుకుని సినిమా చేశాం.

అర్జున్ చక్రవర్తి కథ గురించి చెప్పండి?
-నల్గొండలో కబడ్డీ ప్లేయర్ నాగులయ్య. అతనిని అర్జున్ అని కూడా పిలుస్తారు. ఆయన అద్భుతమైన ప్లేయర్. ఆయన జీవితంలో ట్రూ ఈవెంట్స్ 60 % , 40% ఫిక్షన్ తో ఈ కథని చేయడం జరిగింది. సినిమా మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉంటుంది.

ఈ సినిమాని చేయడానికి ఎక్కువ కాలం పట్టిందని విన్నాం?
ఈ కథ అలాంటిది.హీరోకి నాలుగైదు ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. అన్ని మెయిన్ క్యారెక్టర్స్ కి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్యారెక్టర్ కి ట్రాన్స్ఫర్మేషన్ 9 నెలలు పట్టేది.

ఇలాంటి కథని ఒక స్టార్ హీరో తో తీసుకెళ్లే ఆలోచన చేయలేదా?
-ఈ సినిమా కథపరంగా హీరో క్యారెక్టర్ కి చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. దానికోసం చాలా సమయాన్ని కేటాయించాలి. అంతా సమయం కేటాయించే వీలు అందరికీ ఉండదు. అలాగే సినిమాని అథెంటిక్ గా తీసి ఇంటర్నేషనల్ గా తీసుకెళ్లాలని మేము భావించాం. ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శిస్తున్నప్పుడు అందరూ చాలా అభినందించారు.

ఈ సినిమాకి ఇండస్ట్రీ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉంది?
చాలా బాగుందండి. నార్త్ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది.

-హను రాఘవపూడి గారు టీజర్ ఆన్ చేసి చాలా ఇంప్రెస్ అయ్యారు. చాలా బాగుందని చెప్పారు.

డైరెక్టర్ విక్రాంత్ గురించి?
విక్రాంత్ చాలా గ్రేట్ పర్సన్. సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. చాలా పాషన్ వున్న మేకర్.

ప్రొడక్షన్లో ఏ విషయాలు నేర్చుకున్నారు?
-మనం అనుకున్న బడ్జెట్ కి ఫైనల్ గా వచ్చే బడ్జెట్ కి ఖచ్చితంగా తేడా ఉంటుంది. బడ్జెట్ పెరుగుతుంది. అయితే క్వాలిటీలో రాజీ పడకుండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మించడం జరిగింది.

మ్యూజిక్ అండ్ డీవోపీ గురించి ?
విక్రమ్ వేద కి సౌండ్ ఇంజనీర్ గా చేసిన విఘ్నేష్ బాస్కరన్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చారు. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఉంది .ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలు కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రీ రికార్డింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

-మా డీవోపీ, డైరెక్టర్ గారు చాలా గ్రౌండ్ వర్క్ చేసి అద్భుతమైన ఔట్పుట్ ఇచ్చారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది

46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి కదా అవి బిజినెస్ కి హెల్ప్ అవుతున్నాయా?
-ఓటీటీ వారు బిజినెస్ కి రీచ్ అవుట్ అవుతున్నారు. అయితే నా ఫోకస్ ప్రమోషన్స్ మీద ఉంది. కంటెంట్ ని నమ్ముకున్నాను కాబట్టి ఎప్పుడైనా సరే బిజినెస్ చేసుకోగలరని నమ్మకం ఉంది.

ఈ సినిమాకి టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనే క్లారిటీతోనే ఉన్నాను. ఇండియాలోనే మెట్రో ఆడియన్స్ తో పాటు యూఎస్ యూకే యూరప్ సౌత్ ఆఫ్రికా అన్ని చోట్ల ఈ సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాం. సినిమా రిలీజ్ అయిన మూడు రోజులు తర్వాత కచ్చితంగా మారుమూల గ్రామాల్లో కూడా వెళుతుందనే నమ్మకం ఉంది.

ఈ సినిమాలో హీరోయిన్ కి స్కోప్ ఉందా?
ఉందండి. 46 అవార్డులో ఉత్తమ నటిగా ఆమెకి కూడా అవార్డు వచ్చింది. అయితే ఆమె పోర్షన్ ఎక్కువ రివిల్ చేయలేదు. ఆ క్యారెక్టర్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది.

ఈ సినిమా కోసం కబడ్డీ ప్లేయర్స్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు?
హీరో ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకున్నారు. అలాగే స్టేట్ లెవెల్ డిస్టిక్ లెవెల్ లో ఆడిన వారిని తీసుకున్నాం.

నిర్మాతగా ఫస్ట్ సినిమా ఇది అవుట్ పుట్ చూసిన తర్వాత ఎలా అనిపించింది?
-సినిమా అవుట్ ఫుట్ అద్భుతంగా వచ్చింది. టార్గెట్ ఆడియన్స్ కి సినిమా ఖచ్చితంగా రీచ్ అవుతుంది.

మీ అప్ కమింగ్ మూవీస్ ఎలా ఉండబోతున్నాయి?
-ఏదైనా స్పోర్ట్స్ లేదా ట్రైబల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయాలని ఉంది. ఏం చేసినా పక్క కమర్షియల్ సెన్సిబిలిటీతోనే చేస్తాం.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved