pizza

Arjun Chakravarthy trailer launch
‘అర్జున్ చక్రవర్తి' విజువల్, ఎమోషనల్ గా గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ విక్రాంత్ రుద్ర

You are at idlebrain.com > news today >

21 August 2025
Hyderabad

విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి'. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఇటివలే రీలీజైన్ టీజర్, సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఆద్యంతం ఆకట్టుకున్న ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ విక్రాంత్ రుద్ర మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. అర్జున్ చక్రవర్తి కేవలం సినిమా మాత్రమే కాదు నా తొమ్మిది సంవత్సరాల కల. మా టీమ్ అంతా ఆరేళ్లపాటు హార్డ్ వర్క్ చేశారు. మా నిర్మాతగా ఇచ్చిన సపోర్ట్ ని మర్చిపోలేను. ఆయన నాపై పూర్తి విశ్వాసం ఉంచారు. ఒక డెబ్యు డైరెక్టర్ కి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంతకంటే ఎక్కువ ఇచ్చారు. ఒక దైవంలాగా వచ్చారు. హీరో విజయ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసాడు. చాలా రిస్కులు తీసుకున్నాడు. అర్జున్ చక్రవర్తిగా కనిపించడానికి 100% ఎఫర్ట్ పెట్టాడు. మైనస్ డిగ్రీల్లో షర్టు లేకుండా నటించాడు. ఈ సినిమాలో పనిచేసిన అందరూ కూడా చాలా డెడికేషన్ తో చేశారు. ఇందులో హీరో గారి క్యారెక్టర్ తో పాటు దయా క్యారెక్టర్ కూడా ఫిజికల్ గా ట్రాన్స్ఫర్మేషన్ వుంది. డిఓపి జగదీష్ అద్భుతమైన విజువల్స్ అందించారు. మా మ్యూజిక్ బ్రిలియంట్ ఔట్పుట్ ఇచ్చారు. సిజ దేవిక పాత్రలో ఒదిగిపోయింది. అజయ్ గారు మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది.

హీరో విజయరామరాజు మాట్లాడుతూ... అందరికి నమస్కారం. మా ట్రైలర్ ని లాంచ్ చేసిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఇప్పుడు వరకు మేము రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీడియా మిత్రులు చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు. విజువల్స్ చూస్తుంటే చాలా బిగ్ మూవీ లా కనిపిస్తుందని ఆడియన్స్ చెప్తున్నారు. ప్రతి ఒక్కరు అదిరిపోయిందని చెప్పారు. మా డైరెక్టర్ గారు సినిమా నెక్స్ట్ లెవెల్ లో తీశారు. మా నిర్మాత మమ్మల్ని ఎంతగానో బిలివ్ చేశారు. ఆయన లేకపోతే ఇంత మంచి సినిమా లేదు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా తీశారు. ఆయన నమ్మకమే మాకు బలాన్ని ఇచ్చింది. సినిమా కూడా చాలా మంచి సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నాం. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. సిక్స్ ప్యాక్ లో షూట్ చేసినప్పుడు రెండు రోజులు పాటు ఏమీ తినలేదు. ఈ సినిమానే మమ్మల్ని ముందుకు తీసుకెళ్లింది. నా కెరియర్ లో బెస్ట్ మూవీ చేశానని ఫీల్ అవుతున్నాను. 29న ఆడియన్స్ అదే ఫీల్ అవుతారు. అజయ్ గారు ఇందులో చాలా మంచి పాత్ర చేశారు. ఆయనే సినిమాని ఇండస్ట్రీ జనాల్లోకి తీసుకువెళ్లారు. దయ గారు చాలా పాజిటివ్ పర్సన్. ఇందులో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. హీరోయిన్ సిజ కి తెలుగులో చాలా మంచి అవకాశాలు వస్తాయి. అందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.

హీరోయిన్ సిజ రోజ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మాకు ఇది చాలా ఎమోషనల్ మూమెంట్. ఈ సినిమా కోసం చాలా ఏళ్ళు కష్టపడ్డాం. ఈ సినిమాల్లో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఇంత అద్భుతమైన సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ. మీరు సాంగ్స్ కి ఇచ్చిన రెస్పాన్స్ నాకు ఎంతో ఆనందం ఇచ్చింది. ఇది వెరీ బ్యూటిఫుల్ సినిమా. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఆగస్టు 29 థియేటర్స్ లో కలుద్దాం.

యాక్టర్ అజయ్ మాట్లాడుతూ... అందరికి నమస్కారం. ఈ సినిమాలో నేను కోచ్ క్యారెక్టర్ చేశాను. ఇది ఒక అద్భుతమైన సినిమా. ఇలాంటి సినిమాల్లో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. దర్శక నిర్మాతలు హీరో చాలా కష్టపడ్డారు. ఈ సినిమా కోసం నేను చేయగలిగింది చేశాను, విజయ్ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసాడు. బరువు తగ్గాడు, బరువు పెరిగాడు. ప్రాణం పెట్టి పనిచేసాడు. ఈ సినిమా చాలా అద్భుతమైన క్వాలిటీతో ప్రేక్షకుల్ని అలరించబోతోంది. ఈ సినిమా క్రెడిట్ డైరెక్టర్ కి దక్కుతుంది. దాదాపు ఆరేళ్లపాటు ఈ సినిమాని ఎంతో పాషన్ తో తీశాడు. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను.

నిర్మాత శ్రీని గుబ్బల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. గత నెల రోజులుగా మీడియా మా సినిమాకు చాలా సపోర్ట్ చేసింది. ఆగస్టు 29న ప్రో కబడ్డీ స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 29 నేషనల్ స్పోర్ట్స్ డే. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో ఆగస్టు 29 అర్జున్ చక్రవర్తి రిలీజ్ అవుతుంది. ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్ లో 94 మిలియన్స్ రీచ్ అయింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. కచ్చితంగా ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది.

యాక్టర్ దయానంద రెడ్డి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. పుష్ప కంటే ముందు ఈ సినిమా సైన్ చేశాను. ఇందులో రంగయ్య అనే క్యారెక్టర్ చేశాను. కథలో చాలా కీలకమైన పాత్ర. అర్జున్ చక్రవర్తి క్యారెక్టర్ కి ఒక లక్ష్యాన్ని నిర్దేశించే క్యారెక్టర్. ఇప్పటివరకు నేను చేసిన క్యారెక్టర్ అన్నిట్లో ఇది బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది. డైరెక్టర్ అద్భుతంగా తీశారు. నిర్మాత శ్రీని గారు ఎక్కడ రాజీ పడకుండా సినిమా నిర్మించారు. ఆగస్టు 29 సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తుంది. తప్పకుండా మీ అందరిని అలరిస్తుంది. మూవీ యూనిట్ అంతా పాల్గొన్నా ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

నటీనటులు: విజయ రామరాజు, సిజా రోజ్, హర్ష్ రోషన్, అజయ్, అజయ్ ఘోష్, దయానంద్ రెడ్డి, దుర్గేష్
సిబ్బంది వివరాలు:
రచన & దర్శకత్వం: విక్రాంత్ రుద్ర
నిర్మాత: శ్రీని గుబ్బల
సహ నిర్మాత: ఈడే కృష్ణ చైతన్య
సంగీతం: విఘ్నేష్ బాస్కరన్
సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకాటి
ఎడిటర్: ప్రదీప్ నందన్
ప్రొడక్షన్ డిజైనర్: సుమిత్ పటేల్
ఆడియోగ్రఫీ: అరవింద్ మీనన్
సాహిత్యం: కృష్ణకాంత్
డైలాగ్స్ రైటర్: రవీంద్ర పుల్లె
కాస్ట్యూమ్ డిజైనర్: పూజిత తాడికొండ
సౌండ్ డిజైన్: విఘ్నేష్ బాస్కరన్, నిర్మల్ శ్రీనివాసన్
కలర్స్: విష్ణు వర్ధన్ (శ్రీ సారథి స్టూడియో)
పబ్లిసిటీ డిజైన్: స్కేల్ & టిల్ట్ స్టూడియోస్
VFX: Madhousevfx


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved