Arjun Chakravarthy Trailer - The Story of a Sportsman Who Won, Lost and Won again
గెలిచి ఓడి మళ్ళీ గెలిచిన ఓ క్రీడాకారుడి కథతో 'అర్జున్ చక్రవర్తి' ట్రైలర్.
Many Telugu films with kabaddi as the backdrop have won audiences’ hearts and also delivered strong box office collections. Films like Kabaddi Kabaddi, Bheemili Kabaddi Jattu, and Okkadu stand as examples. In recent times, Arjun Chakravarthy is among those films that created buzz right from its teaser release. With today’s trailer launch, expectations have only risen further. The trailer looks highly realistic and engaging.
Arjun Chakravarthy tells the life story of a kabaddi player—how a sportsman who once saw immense success, fame, and recognition, eventually fell into the trap of addictions due to sudden twists in his life. The film explores which direction his life took after that, and whether he ultimately achieved his true goal.
In this film, Vijaya Ramaraju plays the titular role of Arjun Chakravarthy, with Sija Rose as the female lead. Vijaya Ramaraju underwent an intense physical regimen, transforming his look and weight eight different times. The team’s hard work is clearly visible in the trailer. Dayanand Reddy appears in another key role, while Ajay plays the coach. Ajay Ghosh also features in an important character. Through the coach Vijay’s words—“Arjun’s life is not one that melts away in tears”—the director hints at the strength hidden behind Arjun’s past.
The film showcases the struggles, insults, highs, and lows in a sportsman’s journey. Director Vikrant Rudra seems to have poured his heart into telling this story. His line, “A war isn’t one fought with weapons and armies. The real battle is the one fought with empty hands and an empty stomach,” comes across as deeply inspiring.
Arjun Chakravarthy is slated for release on August 29. Produced by Srini Gubbala, the film’s music is composed by Vignesh Bhaskaran.
గెలిచి ఓడి మళ్ళీ గెలిచిన ఓ క్రీడాకారుడి కథతో 'అర్జున్ చక్రవర్తి' ట్రైలర్..
కబడ్డీ నేపథ్యంగా తెలుగు తెరపై వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకుల మన్ననలను పొందాయి. మన్ననలకు తగ్గట్టే కలక్షన్లు కూడా అంతేలా రాబట్టుకోగలిగాయి. దానికి 'కబడ్డీ కబడ్డీ', 'భీమిలి కబడ్డీ జట్టు', 'ఒక్కడు' సినిమాలే ఉదాహరణలు. ఈమధ్య కాలంలో టీజర్ నుండే సినిమాపై బజ్ మొదలైన సినిమాల్లో 'అర్జున్ చక్రవర్తి' ఒకటిగా ఉంటుంది. ఈరోజు వచ్చిన ట్రైలర్ తో ఆ అంచనాలు అమాంతం పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ట్రైలర్ మొత్తం చాలా రియలిస్టిక్ గానూ, ఆసక్తిగానూ కనబడింది. అర్జున్ చక్రవర్తి అనే కబడ్డీ క్రీడాకారుడి జీవిత కథే ఈ సినిమా. తన జీవితంలో ఎన్నో విజయాలు, ఎంతో పేరు ప్రతిష్టలను చూసిన ఒక క్రీడాకారుడి జీవితంలో జరిగిన మలుపుల కారణంగా ఎందుకతను వ్యసనాలకు బానిసగా మారాడో, అతని జీవితం ఎటువైపు సాగిందో, అంతిమంగా అతని లక్ష్యం నెరవేరిందో లేదో అన్న కథాంశమే ఈ 'అర్జున్ చక్రవర్తి' సినిమా.
ఈ సినిమాలో విజయరామరాజు అర్జున్ చక్రవర్తి పాత్రలో కనిపించగా, ఆయన సరసన సిజ్జా రోజ్ కథనాయికగా నటిస్తున్నారు. విజయ రామరాజు కఠినమైన శారీరక శిక్షణకు లోనై, తన లుక్, బరువును ఎనిమిది సార్లు మార్చుకున్నారు. ఈ సినిమాకోసం ఈ చిత్ర టీమ్ పడ్డ కష్టం మొత్తం ట్రైలర్ లో కనిపించింది. మరో కీలకపాత్రలో దయానంద్ రెడ్డి కనిపించగా, కోచ్ పాత్రలో అజయ్ నటించడం జరిగింది. అజయ్ ఘోష్ మరో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. "కన్నీళ్లకు రాలిపోయే జీవితం కాదు అర్జున్ ది" అంటూ 'అర్జున్ చక్రవర్తి' పాత్రలో దాగున్న గతాన్ని, ఆ గతానికి ఉన్న బలాన్ని కోచ్ విజయ్ పాత్రతో చెప్పించాడు దర్శకుడు.
ఒక క్రీడాకారుడి జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, ఎత్తుపల్లాలు అన్నీ చూపించే క్రమంలో ఈ సినిమా కోసం దర్శకుడు విక్రాంత్ రుద్ర తన శక్తినంతా ఒడ్డే చేసినట్టు కనిపిస్తుంది. "చేతిలో ఆయుధంతో, చుట్టూ సైన్యంతో చేసేది యుద్ధం కాదు.. ఖాళీ చేతులతో కాలే కడుపుతో చేసేదే అసలైన యుద్ధం" అన్న డైలాగ్ చాలా స్పూర్తిదాయంగా రాయగలిగాడు దర్శకుడు విక్రాంత్ రుద్ర. ఈ సినిమా ఈనెల 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను శ్రీని గుబ్బాల నిర్మించగా, ఈ సినిమాకు విగ్నేష్ భాస్కరన్ సంగీతాన్ని అందించారు.