pizza
Asian Group & Shekhar kammula new movie announcement
శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌కుడిగా నిర్మాణ రంగంలో అడుగుపెడుతున్న ఏసియ‌న్ గ్రూప్
You are at idlebrain.com > news today >
Follow Us

17 September 2018
Hyderabad

యాభై సంవ‌త్స‌రాలుగా 600ల సినిమాల‌కు ఫైనాన్స్ అందించి ప్ర‌స్తుతం డిస్ట్రిబ్యూష‌న్‌, ఎగ్జిబిష‌న్ రంగాల‌లో అగ్ర‌గామి సంస్థ‌గా ఎదిగిన ఏషియ‌న్ గ్రూప్ ఇప్పుడు సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెడుతోంది. ప్రెస్టీజియ‌స్ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలోరూపొందే ఈ ల‌వ్ స్టోరి కి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి అయ్యాయి. మ‌ల్టీప్లెక్స్ రంగంలో ఒక రివ‌ల్యూష‌న్‌ సృష్టించిన ఏషియ‌న్ గ్రూప్ తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌ధాన భాగంగా ఎదిగింది. సినిమాను ప్రేక్ష‌కుల‌కు చేరువ‌చేసే డిస్ట్రిబ్యూష‌న్‌, ఎగ్జిబిష‌న్ రంగాల‌లో అగ్ర‌గామిగా ఎదిగిన ఏషియ‌న్ గ్రూప్ ఇప్పుడు నిర్మాణ రంగంలో ఒక సుధీర్గ ప్ర‌యాణాన్ని మొద‌లు పెట్టింది. ఆ ప్ర‌యాణంలో తొలి అడుగు శేఖ‌ర్ కమ్ముల‌తో క‌ల‌సి వేస్తుంది. నిర్మాతలు గా నారాయణ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు(FDC Chairman) వ్యవహారించ నున్నారు.

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఫిదా త‌ర్వాత శేఖర్ క‌మ్మ‌ల చేయ‌బోయే ప్రాజెక్ట్ మీద ఇండ్ర‌స్టీలోనూ, ప్రేక్ష‌కులోనూ ఆస‌క్తి నెల‌కొంది. కంటెంట్ ని త‌ప్ప క్రేజ్ ని న‌మ్ముకొని శేఖ‌ర్ కమ్ముల నుండి రాబోతున్న ఈ ల‌వ్ స్టోరీ కి సంబంధించిన మిగ‌తా వివ‌రాలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నుంది నిర్మాణ సంస్థ‌. amigos creations స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మించ‌బోయే ఈ ప్రేమ క‌థ‌కు

నిర్మాత‌లు ః నారాయ‌ణ దాస్ నారంగ్ , పి. రామ్మోహ‌న్(FDC Chairman). కో ప్రొడ్యూస‌ర్-విజ‌య్ భాస్క‌ర్‌.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved