pizza

Arjun S/O Vyjayanthi success meet
'అర్జున్ S/O వైజయంతి'కి వచ్చిన ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమాని ఇంత గొప్ప ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు: సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్

You are at idlebrain.com > news today >

18 April 2025
Hyderabad

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. సినిమా చూసిన ప్రేక్షకులకు, మా నందమూరి అభిమానులకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇది ఎక్స్ట్రార్డినరీ ఫీలింగ్. అమ్మ(విజయశాంతి)తో కలిసి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో శ్రీకాంత్ గారు కీలకమైన పాత్ర వేశారు. ఆ పాత్రకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకి సంబంధించి ప్రతి క్రాఫ్ట్ గురించి ఆడియన్స్ పొగుడుతున్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సునీల్ అశోక్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అజినీస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి జీవం పోసింది. క్లైమాక్స్ అద్భుతమైన సీక్వెన్స్. పొద్దున్నే మా అబ్బాయి సినిమా చూసి ఇలాంటి సీక్వెన్స్ ఇండియన్ స్క్రీన్ మీద చూడలేదని చెప్పాడు. ఆ రియాక్షన్ కి నేను షాక్ కి గురయ్యాను. చాలా గర్వంగా ఉంది నాన్న అని చెప్పాడు. మదర్ సన్ మధ్య ఉన్న ఎమోషన్ కి ఆడియన్స్ అద్భుతంగా కనెక్ట్ అవుతున్నారు. డైరెక్టర్ ప్రదీప్ గారు మొత్తం క్రెడిట్ కొట్టేశారు. ఆయన ఈ కథని నా దగ్గరికి తీసుకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సినిమాని చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ థాంక్ యూ'అన్నారు.

యాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ... ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు నుంచే సూపర్ హిట్ అవుతుందని నమ్మకంతో మొదలుపెట్టాం. ఆ నమ్మకమే ఈరోజు నిజమైంది. సినిమాకి అన్ని చోట్ల నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కళ్యాణ్ రామ్ గారితో కలిసి ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రొడ్యూసర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని తీశారు. ఆ రిజల్ట్ ఈరోజు సినిమా హిట్ ద్వారా తెలుస్తుంది. సినిమా ఇంత బాగా రావడానికి రీజన్ కూడా కళ్యాణ్ రామ్ గారు. ఆయన చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు. సినిమాకి చాలా మంచి ఓపెనింగ్స్ రావడం ఆనందంగా ఉంది. ఇందులో తల్లి కొడుకుల సెంటిమెంటు అద్భుతంగా ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది. కొడుకు బాధ్యతని ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు. చాలా సంవత్సరాల తర్వాత విజయశాంతి గారితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. సునీల్, అశోక్ గారికి కంగ్రాజులేషన్స్'అన్నారు.

డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి మాట్లాడుతూ.. ఈ సినిమా మేము ఎవరికీ రీచ్ అవుతుందని అనుకున్నాము. వారికి ఇంత ఇంత మ్యాసీవ్ గా రీచ్ కావడం చాలా ఆనందంగా ఉంది. కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి గారు చాలా అద్భుతంగా పెర్ఫాం చేశారు. మా టీమ్ అందరు కూడా చాలా గొప్పగా వర్క్ చేశారు. ఈ రెస్పాన్స్ కి కారణమైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాకి వస్తున్న రియాక్షన్ చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి'అన్నారు.

నిర్మాత సునీల్ బలుసు మాట్లాడుతూ... ఈ సినిమాని సపోర్ట్ చేసిన అందరికీ థాంక్ యూ. చాలా కాలం తర్వాత థియేటర్స్ అన్ని మళ్లీ ఫుల్ అవుతున్నాయి అని డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కాల్స్ రావడం చాలా ఆనందం ఇచ్చింది. ఈవినింగ్ నుంచి అన్నిచోట్ల షోలు యాడ్ అవుతున్నాయి. ఇది చాలా అరుదుగా జరిగే సినారియో. ఇంత మంచి సినిమాలో పార్ట్ కావడం వెరీ హ్యాపీ. ప్రదీప్ చాలా పెద్ద కమర్షియల్ డైరెక్టర్ అవుతాడు. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ అందర్నీ సర్ప్రైజ్ చేసింది. ఇంత మంచి సినిమా ఇచ్చిన కళ్యాణ్ రామ్ గారికి థాంక్యూ. సినిమాని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు'అన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved