pizza

Bachhala Malli pre release event
బచ్చల మల్లి చాలా నిజాయితీగా చేసిన సినిమా. ప్రేక్షకులు మంచి విజయాన్ని అందిస్తారనే నమ్మకం వుంది. ఈ క్రిస్మస్ మనదే: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో అల్లరి నరేష్

You are at idlebrain.com > news today >

18 December 2024
Hyderabad

బచ్చల మల్లి చాలా నిజాయితీగా చేసిన సినిమా. ప్రేక్షకులు మంచి విజయాన్ని అందిస్తారనే నమ్మకం వుంది. ఈ క్రిస్మస్ మనదే: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో అల్లరి నరేష్

- బచ్చలమల్లి ట్రైలర్‌ చూడగానే నచ్చేసింది. సినిమా పెద్ద హిట్‌ అవుతుందనే నమ్మకం వుంది: హీరో కిరణ్ అబ్బవరం

- బచ్చలమల్లి లోని ప్రతి కంటెంట్ చాలా ప్రామిసింగ్ గా వుంది. సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది: హీరోయిన్ సంయుక్త

హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలై టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ సంయుక్త ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. దర్శకులు మారుతి, త్రినాథ్ రావు నక్కిన, వశిష్ట, విజయ్ కనకమేడల, యదు వంశీ, కార్తిక్ వర్మ దండు, బలగం వేణు అతిధులు పాల్గొన్న ఈ ప్రీరిలీజ్ చాలా గ్రాండ్ గా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది ఒక సక్సెస్ మీట్ లా అనిపిస్తుంది. ఈవెంట్ కి వచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా అంటే పాషన్ తో ఇక్కడికి వచ్చారు. డీవోపీ రిచర్డ్ ఈ సినిమాతో హైదరాబాదులో సెటిల్ అయిపోతారు. చాలా అద్భుతమైన కెమెరామెన్. ఈ సినిమాకి ఆయన లాంటి కెమెరామెన్ రావడం మా అదృష్టం. ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన విశాల్ చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా ఆల్బమ్ నా కెరియర్ లో గుర్తుండిపోతుంది. బిజీఎం కూడా వండర్ఫుల్ గా ఇచ్చారు. మా చోట ప్రసాద్ గారికి, బ్రహ్మ గారికి, డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్స్ అందరికీ పేరుపేరునా థాంక్యూ. సుబ్బు కథ చెప్పగానే నాకు చాలా నచ్చింది. నాకోసం తను వెయిట్ చేశాడు. అయితే ఈ వెయిటింగ్ పిరియడ్ ని కూడా చాలా అద్భుతంగా వాడుకున్నాడు. సినిమా కోసమే అహర్నిశలు కష్టపడ్డాడు. ఈ వేడుకకు వచ్చిన సంయుక్త, కిరణ్ కి థాంక్యూ. క సినిమా నాకు చాలా నచ్చింది. సంయుక్త గారికి ఆల్ ద వెరీ బెస్ట్. అమృత చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. హనుమాన్ సక్సెస్ తో ఇయర్ ని స్టార్ట్ చేశారు. బచ్చల మల్లి సక్సెస్ తో ఎండ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ థాంక్యూ. నిర్మాత రాజేష్ గారితో జర్నీ కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇది నాకు హోం బ్యానర్. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మించారు. అడిగిన ప్రతిదీ ఇచ్చారు. ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్ కావాలని కోరుకుంటున్నాను. సుబ్బు ఏదైతే చెప్పాడో అది తీశాడు. అందరం చాలా సిన్సియర్ గా చేశాం. 24 క్రాఫ్ట్స్ కష్టపడి ఇష్టపడి చేశారు. డిసెంబర్ 20న మీ ముందుకు వస్తుంది. ఈ సినిమాని హిట్ చేస్తారా, బ్లాక్ బస్టర్ చేస్తారా, కల్ట్ చేస్తారా అనేది ఆడియన్స్ చేతిలో ఉంది. ఒక్కటి మాత్రం చెబుతున్నాను. ఈ క్రిస్మస్ మనదే' అన్నారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ఇంతమంది ఒకే వేదికపై కలవడం ఆనందంగా ఉంది. రాజేష్ గారు సినిమాపై ప్యాషన్‌ ఉన్న వ్యక్తి. ఆయనతో ట్రావెల్ అవుతున్నప్పుడు సినిమా పట్ల ఆయనకున్న ఇష్టం అర్ధమైయింది. ఈ చిత్రం మంచి విజయం అందుకుంటుందనే నమ్మకం నాకుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కంగ్రాట్స్. ‘ఎస్‌ఆర్‌ కల్యాణమండపం’ సినిమా కోసం అమృత అయ్యర్‌ను సంప్రదించాం. కానీ ఆమె నుంచి రిప్లై రాలేదు.(నవ్వుతూ) నేను తొలిసారి కలిసిన హీరో అల్లరి నరేశ్‌. కాలేజీ రోజుల్లో విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఆయన సినిమా షూటింగ్ జరిగింది. ఎస్ఆర్ కళ్యాణ మండపం కు నరేష్ అన్న సపోర్ట్ చేశారు. ఆయన అంటే చాలా ఇష్టం. ఈ వేడుకలో ఆయన పక్కన కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నో డిఫరెంట్ రోల్స్‌ ప్లే చేసిన నరేశ్‌ అన్నకు స్టార్‌ ట్యాగ్‌ ఎందుకు రాలేదని సుబ్బు అన్నని అడిగా. ఆయన చేసిన రోల్స్ చాలా గొప్పవి. ఓ నటుడు అన్ని వేరియేషన్స్‌ చూపించడం కష్టం. ఆయనకు ఇష్టమోలేదో తెలియదుగానీ స్టార్‌ ట్యాగ్‌ ఇవ్వాలని ఓ ఫ్యాన్ గా కోరుకుంటున్నా. ‘బచ్చలమల్లి’ ట్రైలర్‌ చూడగానే నచ్చేసింది. ఈ మూవీ పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను’’అన్నారు.

హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఒక మంచి మూవీ ని సపోర్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్ నాకు చాలా నచ్చింది. నేను ప్రతి సినిమాని ఫాలో అవుతాను . ఈ సినిమాలో ప్రతి కంటెంట్ చాలా ప్రామిస్ గా ఉంది. సినిమా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందని నాకు అనిపిస్తుంది. రాజేష్ గారు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తున్నారు. ఈ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడినా చాలా ఎక్సైటెడ్ గా చెప్తుండేవారు. ఆయన కోరుకున్నట్లుగా ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాతో నరేష్ గారు బిగ్ బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుంటున్నాను. అమృత హనుమాన్ తో మంచి విజయాన్ని అందుకుంది.బచ్చల మల్లితో అది కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. మనం సినిమాని ఒక ప్యాషన్ తో తీస్తే ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు. మంచి కంటెంట్ ఉంటే ఆడియన్స్ ఆదరిస్తారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అన్నారు

డైరెక్టర్ సుబ్బు మంగాదేవి మాట్లాడుతూ...ఈ రోజు నేనిక్కడ ఉండటానికి కారణమైన సాయి దుర్గాతేజ్‌కి ఎప్పుడూ కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉంటా. నా జీవితంలో మరో ముఖ్యమైన వ్యక్తి మారుతి గారు. అమ్మలేని బాధలో ఉన్న నన్ను దాన్నుంచి బయటకు తీసుకొచ్చింది ఆయనే. లవ్ యు సార్. ఈ కథ చెప్పిన తర్వాత నేను ఏదైతే అనుకుంటున్నా అలానే తీస్తా అని చెప్పారు. ఆయన ఆరోజు ఏదైతే చెప్పారో అదే మాట మీద నిలబడ్డారు. అలాంటి ప్రొడ్యూసర్ ఈ సినిమాకి దొరకడం నా అదృష్టం. సినిమాని ప్రేమించే ప్రొడ్యూసర్లు దొరకడం దర్శకులకు అదృష్టం. ఈవెంట్ కి అతిథిగా వచ్చిన సంయుక్త గారికి థాంక్యూ సో మచ్. కావేరి పాత్రకు అమృత ఇయర్ న్యాయం చేశారు. చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఆమె తప్ప ఆ క్యారెక్టర్ కి మరొక న్యాయం చేయలేరు. రాజావారు దగ్గర్నుంచి కిరణ్ కష్టాన్ని నేను చూశాను. ఆ కష్టం 'క' సినిమాతో పే అఫ్ అయింది. ఆయన ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. బచ్చలమల్లి క్యారెక్టర్ ని కేవలం నరేష్ గారు మాత్రమే చేయగలరు. అది డిసెంబర్ 20న విట్నెస్ చేయబోతున్నాం. ఒక మంచి సక్సెస్ కోసమే మా ఇద్దరం కలిసామని అనిపించింది. డిసెంబర్ 20 తేదీన ఆ సక్సెస్ ని మనం చూడబోతున్నాం' అన్నారు

హీరోయిన్ అమృత అయ్యర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. టీజర్ ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ మా టీమ్ అందరికీ చాలా స్పెషల్. ఇందులో చేస్తున్న కావేరి క్యారెక్టర్ చాలా స్పెషల్, వెరీ క్యూట్ క్యారెక్టర్. మీరందరూ ఈ క్యారెక్టర్ని చాలా ప్రేమిస్తారు. ఈ సినిమా కథ విన్నప్పుడు చాలా ఎమోషనల్ గా అనిపించింది. డైరెక్టర్ గారు నాపై నమ్మకంతో ఈ క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సందర్భంగా సుబ్బు గారికి ధన్యవాదాలు. నిర్మాత రాజేష్ గారు మంచి కంటెంట్ వున్న సినిమాలు నిర్మిస్తుంటారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆయనకి థాంక్యూ. ఈ సినిమా జర్నీ చాలా అద్భుతంగా జరిగింది. నరేష్ గారు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన అద్భుతమైన యాక్టర్. అన్ని రకాల వేరియేషన్స్ ని చాలా అలవోకగా చేయగలరు. ఆయనతో వర్క్ చేయడం చాలా గర్వంగా ఉంది. ఈ సినిమాల్లో పనిచేస్తున్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. డిసెంబర్ 20న తప్పకుండా ఈ సినిమాని మీరు చూసి గొప్పగా ఆదరించాలని కోరుకుంటున్నాను' అన్నారు

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. చాలా టాలెంట్ ఉన్న డైరెక్టర్ సుబ్బు. సోలో బ్రతుకే సో బెటరు కథని తను చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది. ఆ సినిమా నుంచి మా ఇద్దరికీ ఒక జర్నీ స్టార్ట్ అయింది. ఈ కథ కూడా నాకు చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఎంత అద్భుతంగా చెప్పాడో అంత అద్భుతంగా స్క్రీన్ మీదకు తీసుకొచ్చాడు. నా ఫస్ట్ సినిమా జర్నీ అల్లరి నరేష్ గారితోనే స్టార్ట్ అయింది. ఆయన ప్రాణం సినిమా డిస్ట్రిబ్యూషన్ లో నేను కలిశాను. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోయినప్పటికీ ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే కసిని పెంచింది. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. రాజేష్ గారికి సినిమా అంటే చాలా ఫ్యాషన్. చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతారని మనస్పూర్తిగా నమ్ముతున్నాను. ఆయనకి ఆడియన్ గా మంచి జడ్జిమెంట్ ఉంది. ఆ జడ్జ్మెంట్ తోనే ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా ష్యూర్ షాట్ గా హిట్ అయి టీమ్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఒక ప్రేక్షకుడిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను’ అన్నారు

నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ.. ఈవెంట్ కి వచ్చిన కిరణ్ గారికి, సంయుక్త గారికి, మా దర్శకులకి ధన్యవాదాలు. బచ్చలమల్లి నేను చాలా ప్రేమించి చేసిన కథ. ఈ సినిమా రిలీజ్ కోసం నేను ఒక ప్రేక్షకుడిలా ఎదురుచూస్తున్నాను. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మగారు, ఎడిటర్ చోటాకే ప్రసాద్, ప్రోమో ఎడిటర్ రవి.. ఈ ముగ్గురు లేకుండా హాస్య మూవీస్ లేదు. అందరం ఒక టీం గా పనిచేస్తున్నాను. రిచర్డ్ ఎం నాథన్ డిఓపి అయితే బాగుంటుందని అనుకున్నాం. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. విశాల్ చంద్రశేఖర్ గారు ద బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ఆర్ఆర్ అదరగొట్టారు. పృద్వి డిఫరెంట్ గా ఫైట్స్ కంపోజ్ చేశాడు. హీరోయిన్ అమృత చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. కావేరి క్యారెక్టర్ కి న్యాయం చేసింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆమెకు చాలా పెద్ద పేరు వస్తుంది. సుబ్బు చెప్పిన కథకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను. నరేష్ గారికి కూడా సింగిల్ సిట్టింగ్ లో ఈ కథ నచ్చింది. నా బ్యానర్ లో చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ తను. తనతో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని ఉంది. ఇట్లు మారేడుమిల్లి సినిమాతో నరేష్ గారితో మా జర్నీ స్టార్ట్ అయింది. నన్ను నమ్మి డేట్లు ఇచ్చారు. అది ఎప్పుడు మర్చిపోలేను. నన్ను ఒక బ్రదర్ లా చూసుకున్నారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇందులో మొత్తం మూడు గెటప్స్ లో కనిపిస్తారు. నరేష్ గారు లేకపోతే బచ్చల మల్లి లేదు. ఆయన సినిమా చేసిన సినిమాలన్నీ ఒకెత్తు బచ్చల మల్లి మరో ఎత్తు. డిసెంబర్ 19 నైట్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాను. ధియేటర్ మోత మొగోపోతుంది. నరేష్ గారి పేరు మోత మోగిపోద్ది’ అన్నారు

డైరెక్టర్ త్రినాథ్ నక్కిన మాట్లాడుతూ .. అందరికి నమస్కారం . ఈ వేడుకలో ఇంతమంది డైరెక్టర్స్ ని చూడ్డం చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన యాక్టర్ నరేష్ గారు. అల్లరి అనేట్యాగ్ ని ఆయన సంపాదించుకున్నారు. ఫ్యూచర్లో తప్పకుండా ఆయనతో సినిమా చేయాలని ఉంది, రాజేష్ చాలా ఫ్యాషన్ నిర్మాత. తను లైఫ్ లాంగ్ ఇలానే అద్భుతమైన సినిమాలు చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం డైరెక్టర్ సుబ్బు ఎంత కష్టపడ్డాడో నేను ప్రత్యక్షంగా చూశాను. ఆయన పని చేసే విధానం నాకు చాలా నచ్చింది. ట్రైలర్ అదిరిపోయింది. సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను' అన్నారు

డైరెక్టర్ యదువంశీ మాట్లాడుతూ... ఈ ఈవెంట్ కి రావడం గర్వంగా ఉంది. నరేష్ గారి సినిమాల్ని చూస్తూ పెరిగాం. డైరెక్టర్ సుబ్బు గారు చాలా ఎమోషనల్ గా ఈ సినిమాను తీశారు. ఈ సినిమా వాళ్ళ అమ్మగారికి క్షమాపణ అని చెప్పారు. అంతకంటే పెద్ద కారణం అవసరం లేదు థియేటర్లో చూడడానికి. నరేష్ గారు ఎప్పుడో కంటెంట్ ఓరియంట్ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. గమ్యం, శంభో శివ శంభో, ప్రాణం, నేను.. ఇలా ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశారు, రాజేష్ గారు ఈమధ్య కంటెంట్ ఉన్న సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారు. ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ కొడుతుందని నమ్ముతున్నాను' అన్నారు

డైరెక్టర్ కార్తీక్ దండు మాట్లాడుతూ.. సుబ్బు నేను 2018 లో జర్నీ స్టార్ట్ చేసాం. ఇద్దరం ఒకే బ్యానర్ లో పని చేసాం. సుబ్బు స్ట్రెంత్ ఎమోషన్. ఈసారి దాన్ని చాలా గట్టిగా పట్టుకున్నారు. అది ట్రైలర్ లోకనిపిస్తుంది. నరేష్ గారి వర్క్ కి నేను ఫ్యాన్ ని. బచ్చలమల్లితో ఆయన నట విశ్వరూపం చూపిస్తున్నారని అనుకుంటున్నాను. రాజేష్ గారు నాకు చాలా సపోర్ట్ చేసిన నిర్మాత. నేను ఆయనకు కొన్ని కథలు చెప్పాను. కానీ అవి కుదరలేదు. త్వరలోనే ఆయనతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాన' అన్నారు

బలగం డైరెక్టర్ వేణు మాట్లాడుతూ.. డైరెక్టర్ సుబ్బు ప్రతి విషయంలో క్లారిటీ ఉంటుంది. బలగం సినిమా టైంలో కథ చెప్పినప్పుడు చాలా ఎంకరేజ్ చేశాడు. చాల డెప్త్ వున్న డైరెక్టర్. ఈ సినిమా ట్రైలర్ టీజర్ లో అది కనిపించింది. కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. నరేష్ అన్నతో నాకు చాలా జర్నీ ఉంది. దాదాపు పది సినిమాలు యాక్టర్ గా చేశాను. నరేష్ అన్నకి ఎప్పుడూ కూడా ఒక మంచి ఎమోషన్ ఇంటెన్సీ పర్ఫార్మెన్స్ చేయాలని ఉండేది. అది నాందితో ప్రూవ్ అయింది. బచ్చలమల్లితో అది నెక్స్ట్ వెళుతుంది. సినిమా చాలా పెద్ద హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను' అన్నారు

డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ.. గాలి శీను క్యారెక్టర్ ఎంత పెద్ద హిట్ అయిందో బచ్చల మల్లి అంత పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. సుబ్బు బింబిసార సమయంలో నాకు రైటింగ్ లో హెల్ప్ చేశాడు. తనలో పట్టుదల మొండితనం ఉన్నాయి. అది ఈ స్క్రిప్ట్ లో చూపించాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను.'అన్నారు

డైరెక్టర్ విజయ్ కనకమేడల మాట్లాడుతూ.. నేను డైరెక్టర్ గా ఉన్నానంటే కారణం నరేష్ గారు. లైఫ్ టైం ఆయనకి థాంక్స్ చెప్తూనే ఉంటాను. డైరెక్టర్ సుబ్బు నరేష్ గారు ఈ కథకి నరేష్ గారు యాప్ట్ ని నమ్మి ఆయన కోసం వెయిట్ చేసి ఈ సినిమాని చేశారు. డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ కొడతారు. నాంది చూసినప్పుడు నేను ఎలా ఫీలయ్యానో బచ్చల మల్లి ట్రైలర్ చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. నరేష్ గారు ఎమోషనల్ గా అద్భుతంగా పెర్ఫామ్ చేసి ఉంటారని భావిస్తున్నాను.రాజేష్ చాలా మంచి ప్రొడ్యూసర్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. త్వరలో నరేష్ గారితో మరో మంచి కథ చేయాలని కోరుకుంటున్నాను' అన్నారు. సినిమా టీం అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved