pizza

Zee Studios Releasing Naga Shaurya, Raam Desina, Srinivasa Rao Chintalapudi, Sri Vaishnavi Films’ Bad Boy Karthik Worldwide On April 17th
నాగ శౌర్య, రామ్ దేశిన, శ్రీనివాస రావు చింతలపూడి, శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ 'బ్యాడ్ బాయ్ కార్తిక్' జీ స్టూడియోస్ ద్వారా ఏప్రిల్ 17న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

You are at idlebrain.com > news today >

27 March 2026
Hyderabad

Hero Naga Shaurya is gearing up for the release of an out-and-out action entertainer Bad Boy Karthik, being helmed by debutant director Raam Desina (Ramesh) and produced by Srinivasa Rao Chintalapudi under the banner of Sri Vaishnavi Films. The film’s musical promotions have already created a strong buzz, with every released song turning into a chartbuster. The teaser, loaded with high-voltage sequences and mass attitude, further amplified the hype around the film.

The makers have officially announced that Bad Boy Karthik will hit the screens worldwide on April 17th as one of the biggest summer attractions. The poster is dramatic and action-packed. Naga Shaurya appears with one fist raised and a weapon in other hand, set against a fiery backdrop. Behind him looms a grand, multi-armed goddess idol typical of festive processions, surrounded by a large crowd.

Another major development is Zee Studios coming on board to acquire the theatrical and non-theatrical rights of Bad Boy Karthik for fancy price. At a time when securing these rights has become increasingly challenging for films, this early closure reflects the strong confidence in the movie’s content. The association with Zee Studios not only boosts the film’s credibility but also adds significant buzz to its pre-release momentum.

Vidhi is the leading lady opposite Naga Shaurya in the movie, while Sridevi Vijaykumar will be seen as his sister. Samuthirakani and Naresh VK will be seen in prominent roles.

Coming to the technical crew, Rasool Ellore takes care of cinematography of the movie, with music scored by Harris Jayraj, editing handled by Kotagiri Venkateswara Rao, and art direction by Ramanjaneyulu.

The makers are planning to up the game in promotions, as the release date is not far away.

Cast: Naga Shaurya, Vidhi, Samuthirakani, Naresh VK, Saikumar, Mime Gopi, Sridevi Vijaykumar, Vennela Kishore, Brahmaji, Pruthvi, Ajay, Priya, Nellore Sudarshan, Krishnudu, Chamak Chandra, and Shivannarayana

Technical Crew:
Writer, Director: Raam Desina (Ramesh)
Producer: Srinivasa Rao Chintalapudi
Banner: Sri Vaishnavi Films
DOP: Rasool Ellore
Music: Harris Jayraj
Art: Ramanjaneyulu
Editor: Kotagiri Venkateswara Rao
Fights- Supreme Sundar, Prudhvi
Choreographers: Raju Sundaram, Shobi Master, Vijay Polanki, Sirish
Lyricists: Chandrabose, Ramajogayya Sastry, Kasarla Shyam, and Krishna Kanth
Ex-Producer: Shankar

నాగ శౌర్య, రామ్ దేశిన, శ్రీనివాస రావు చింతలపూడి, శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ 'బ్యాడ్ బాయ్ కార్తిక్' జీ స్టూడియోస్ ద్వారా ఏప్రిల్ 17న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

హీరో నాగ శౌర్య అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బ్యాడ్ బాయ్ కార్తిక్'తో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మాణంలో, నూతన దర్శకుడు రామ్ దేశిన (రమేష్) దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ ఇప్పటికే భారీ బజ్‌ను సృష్టించాయి. విడుదలైన ప్రతి పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. హై-వోల్టేజ్ సన్నివేశాలు మాస్ యాటిట్యూడ్‌తో నిండిన ఈ సినిమా టీజర్, చిత్రంపై ఉన్న అంచనాలను మరింత పెంచింది.

వేసవిలో విడుదలయ్యే భారీ చిత్రాలలో ఒకటిగా 'బ్యాడ్ బాయ్ కార్తిక్' ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్ లో ఫైర్ బ్యాక్ డ్రాప్, ఒక చేతిలో ఆయుధం పట్టుకుని, మరో పిడికిలి బిగించి నాగ శౌర్య కనిపించడం, ఆయన వెనుక, పండుగ ఊరేగింపులలో కనిపించే భారీ అమ్మవారి విగ్రహం దర్శనమివ్వడం క్యురియాసిటీని పెంచింది.

'బ్యాడ్ బాయ్ కార్తిక్' సినిమా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులనుజీ స్టూడియోస్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ప్రస్తుతం సినిమాల డీల్స్ కష్టంగా మారిన ఈ సమయంలో ఈ సినిమా కోసం ఇంత త్వరగా డీల్ క్లోజ్ కావడం, సినిమా కంటెంట్‌పై ఉన్న బలమైన నమ్మకాన్ని చూపిస్తోంది. జీ స్టూడియోస్ తో ఈ భాగస్వామ్యం సినిమా క్రెడిబిలిటీని పెంచడమే కాకుండా, రిలీజ్‌కు ముందే మంచి బజ్‌ను కూడా తీసుకువచ్చింది.

ఈ సినిమాలో నాగ శౌర్య సరసన విధి కథానాయికగా నటిస్తుండగా, శ్రీదేవి విజయకుమార్ ఆయన సోదరి పాత్రలో కనిపించనున్నారు. సముద్రఖని, నరేష్ వి.కె. కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, హారిస్ జైరాజ్ సంగీతం సమకూర్చారు. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్, రామంజనేయులు ఆర్ట్ డైరెక్టర్.

నటీనటులు: నాగ శౌర్య, విధి, సముద్రఖని, నరేష్ VK, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పృథ్వీ, అజయ్, ప్రియ, నెల్లూరు సుదర్శన్, కృష్ణుడు, చమక్ చంద్ర, శివన్నారాయణ

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రామ్ దేశిన (రమేష్)
నిర్మాత: శ్రీనివాసరావు చింతలపూడి
బ్యానర్: శ్రీ వైష్ణవి ఫిల్మ్స్
DOP: రసూల్ ఎల్లోర్
సంగీతం: హారిస్ జైరాజ్
ఆర్ట్: రామాంజనేయులు
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఫైట్స్- సుప్రీమ్ సుందర్, పృధ్వి
కొరియోగ్రాఫర్‌లు: రాజు సుందరం, శోబి మాస్టర్, విజయ్ పొలంకి, శిరీష్
సాహిత్యం: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, కృష్ణకాంత్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శంకర్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved