pizza

Bad Boy Karthik trailer launch event
'బ్యాడ్ బాయ్ కార్తీక్' ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నాను: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నాగశౌర్య

You are at idlebrain.com > news today >

06 April 2026
Hyderabad

నాగశౌర్య, రామ్ దేశినా, శ్రీనివాస రావు చింతలపూడి, శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ వారి 'బ్యాడ్ బాయ్ కార్తీక్' యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ లాంచ్

హీరో నాగ శౌర్య, రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా 'బ్యాడ్ బాయ్ కార్తీక్' చిత్రంతో మాస్ అవతార్ తో రాబోతున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం, సూపర్ హిట్ పాటలు , శౌర్యను మునుపెన్నడూ ఇంటెన్స్ గా చూపించిన పవర్-ప్యాక్డ్ టీజర్ తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా మేకర్స్ ఈరోజు థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు.

నరేష్ వీకే పాత్ర దేవుడిని ప్రార్థిస్తూ.. ప్రమాదకరమైన వ్యక్తుల అణచివేతలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యాన్ని ప్రజెంట్ చేస్తుంది. ఆ సమయంలో ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’ అనే రగ్గ్డ్, తన రూల్స్ తో జీవించే పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఎంట్రీ అదిరిపోతుంది. విలన్‌పై అతను ఎలా పోరాడుతాడు, అమాయకులని ఎలా కాపాడుతాడు అన్నదే కథలో ప్రధానాంశం.

నాగ శౌర్య ఫుల్ మాస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యాక్షన్ సన్నివేశాలతో పాటు, తనలోని వేరియేషన్స్‌ అద్భుతంగా వున్నాయి. ముఖ్యంగా సాయి కుమార్ తో వచ్చే ఫన్ సీన్స్‌లో అతని కామిక్ టైమింగ్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ చివర్లో శౌర్య లార్డ్ లక్ష్మీ నరసింహ స్వామి ప్రజెన్స్ లో కనిపించడం గూస్‌బంప్స్ ఇచ్చేలా ఉంటుంది.

హీరోయిన్‌గా విధి తన చార్మ్‌తో ఆకట్టుకోగా, విలన్ పాత్రలో సముద్రఖని పవర్ ఫుల్ గా కనిపించారు. ఇక నరేష్ వీకే ఎమోషనల్ పెర్ఫార్మెన్స్‌తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అలాగే మైమ్ గోపీ, శ్రీదేవి విజయకుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ ట్రైలర్‌లో ఆకట్టుకున్నారు.

సినిమా మాస్ యాక్షన్, డ్రామా, రొమాన్స్, కామెడీ అన్నీ కలిపిన పూర్తి ఎంటర్టైనర్‌గా రానుందని ట్రైలర్ ప్రామిస్ చేస్తోంది. దర్శకుడు రమేష్ ఈ సినిమాను కమర్షియల్ ప్యాకేజీగా మలిచాఋ. సినిమాటోగ్రఫీని రసూల్ ఎల్లోర్ అందంగా చూపించగా, హారిస్ జయరాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు మంచి ఎలివేషన్ ఇచ్చింది. ఎడిటింగ్‌లో కొటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లో రామాంజనేయులు చక్కని పనితీరు కనబరిచారు,

మొత్తానికి ట్రైలర్ మంచి ఇంపాక్ట్‌ను క్రియేట్ చేస్తూ, సినిమా పై అంచనాలను పెంచింది. జీ స్టూడియోస్ ఈ సినిమా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులను దక్కించుకోవడం ప్రాజెక్ట్‌పై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నాగశౌర్య మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. మా ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా జరగాలని ఎంతో పట్టుదలతో ముందుకు తీసుకొచ్చారు. ఆయనకి హ్యాట్సాఫ్. ఆయన అనుకున్నదంతా జరగాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి మంచి కలెక్షన్స్, పేరు రావాలని కోరుకుంటున్నాను.ఈ సినిమా ఏప్రిల్ 17న రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్లలో చూసి ఆశీర్వదించాలి. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను. "ఆరెంజ్" సినిమా పాటలు విన్నప్పటి నుంచి హారిస్ జయరాజ్ గారితో వర్క్ చేయాలని అనుకునేవాడిని. ఈ సినిమాతో ఆ అవకాశం వచ్చింది. ఆయన చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే రసూల్ గారితో వర్క్ చేస్తే ఎలా ఉంటుందో అనుకునేవాడిని. ఆయన కెమెరాలో నేను ఎలా కనిపిస్తానో చూడాలని ఉండేది. ఈ సినిమా ద్వారా అది సాధ్యమైంది. నన్ను చాలా బాగా చూపించారు. ప్రభాస్ గారి "ఈశ్వర్" సినిమాలో శ్రీదేవి గారిని చూసాను. అలాంటి అదృష్టం నాకు కూడా ఈ సినిమాతో రావాలని కోరుకుంటున్నాను. శ్రీదేవి గారు ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఫ్యూచర్‌లో ఇంకా మంచి సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో పనిచేసిన వెన్నెల కిషోర్ గారికి, సముద్రఖని గారికి, సాయికుమార్ గారికి, టీమ్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందరూ సినిమా చూసి మీకు నచ్చాలని కోరుకుంటున్నాను.

శ్రీదేవి విజయ్‌కుమార్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. "బ్యాడ్ బాయ్ కార్తీక్" సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదల అవుతుంది. మా ప్రొడ్యూసర్ గారు ఇంకా చాలా మంచి సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాను. నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ థాంక్స్.ఇది ఒక లాంగ్ జర్నీ, చాలా మంచి అనుభవం. ఈ సినిమాలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను. శౌర్య గారితో ఫస్ట్ టైమ్ వర్క్ చేస్తున్నాను. ఆయన చాలా ట్యాలెంటెడ్. మీరు తప్పకుండా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలి.

డీఓపీ రసూల్ మాట్లాడుతూ.. ఈ సినిమా నాకు చాలా విధాలుగా మంచి అనుభవం ఇచ్చింది. చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. సినిమా కూడా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. టీమ్ అందరికీ థ్యాంక్యూ.

ప్రొడ్యూసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది మా ఫస్ట్ సినిమా. శౌర్య గారితో కలిసి ఒక మంచి సినిమా తీశాం. జీ వారికి ఈ సినిమా చూపించగానే, ఓటిటి రైట్స్‌తో పాటు డిస్ట్రిబ్యూషన్ కూడా వారే చేస్తామని చెప్పారు. ఈ సినిమా ఎవరినీ నిరాశపరచదు. కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిక్యూటివ్స్ అందరూ చాలా హ్యాపీ. ఫస్ట్ ప్రొడక్షన్ కాబట్టి కొన్ని విషయాలు తెలిసీ తెలియక జరిగాయి. కానీ శౌర్య గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. మరోసారి ఆయనతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. "ఛలో" తర్వాత అలాంటి మంచి హిట్ మళ్లీ రాబోతుంది. శ్రీదేవి గారు అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. ఈ సినిమా తర్వాత మరింత బిజీ అవుతారు. ఈ సినిమాను ఖచ్చితంగా థియేటర్లలో చూసి ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను.

నటీనటులు: నాగ శౌర్య, విధి, సముద్రఖని, నరేష్ VK, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పృథ్వీ, అజయ్, ప్రియ, నెల్లూరు సుదర్శన్, కృష్ణుడు, చమక్ చంద్ర, శివన్నారాయణ

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రామ్ దేశిన (రమేష్)
నిర్మాత: శ్రీనివాసరావు చింతలపూడి
బ్యానర్: శ్రీ వైష్ణవి ఫిల్మ్స్
DOP: రసూల్ ఎల్లోర్
సంగీతం: హారిస్ జైరాజ్
ఆర్ట్: రామాంజనేయులు
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఫైట్స్- సుప్రీమ్ సుందర్, పృధ్వి
కొరియోగ్రాఫర్‌లు: రాజు సుందరం, శోబి మాస్టర్, విజయ్ పొలంకి, శిరీష్
సాహిత్యం: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, కృష్ణకాంత్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శంకర్

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved