Ś
pizza

#NagaShaurya’s next #BadBoyKarthik shoot wrapped
నాగశౌర్య, రామ్ దేశినా, శ్రీనివాసరావు చింతలపూడి, శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ ప్రొడక్షన్ నంబర్ 1'బ్యాడ్ బాయ్ కార్తీక్' షూటింగ్ పూర్తి

You are at idlebrain.com > news today >

12 May 2025
Hyderabad

హీరో నాగశౌర్య అప్ కమింగ్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ బ్యాడ్ బాయ్ కార్తీక్. ఈ మూవీకి రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. నాగ శౌర్య క్యారెక్టర్ ఇంటెన్స్ నేచర్ ని ప్రజెంట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది

ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. సైమల్టేనియస్ గా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు.

ఈ చిత్రంలో నాగశౌర్య జోడిగా విధి హీరోయిన్ గా నటిస్తోంది. సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ డీవోపీగా పని చేస్తున్నారు. సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ తెలుగు సినిమాకు కమ్ బ్యాక్ ఇస్తూ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్ కాగ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్.

నటీనటులు: నాగ శౌర్య, విధి, సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పృథ్వీ, అజయ్, ప్రియ, నెల్లూరు సుదర్శన్, కృష్ణుడు, చమక్ చంద్ర, శివన్నారాయణ

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: రామ్ దేశిన (రమేష్)
నిర్మాత: శ్రీనివాసరావు చింతలపూడి
బ్యానర్: శ్రీ వైష్ణవి ఫిల్మ్స్
డీవోపీ: రసూల్ ఎల్లోర్
సంగీతం: హారిస్ జైరాజ్
ఆర్ట్: రామాంజనేయులు
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఫైట్స్- సుప్రీమ్ సుందర్, పృధ్వి
కొరియోగ్రాఫర్స్: రాజు సుందరం, శోబి మాస్టర్, విజయ్ పొలంకి, శిరీష్
లిరిక్స్: చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, కృష్ణకాంత్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: శంకర్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved