The Unique Film Barbarik Will Become a Big Hit. Star director Maruthi at the teaser launch event
కొత్త పాయింట్‌తో రాబోతోన్న ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది.. ‘బార్బరిక్’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో స్టార్ దర్శకుడు మారుతి
The movie Barbarik, produced by Vijaypal Reddy Adidhala under the banner of Vaanara Celluloid and directed by Mohan Srivatsa, features a star cast including Sathyaraj, Satyam Rajesh, Vasishta N Simha, Sanchi Rai, Udaya Bhanu, Kranthi Kiran, VTV Ganesh, Motta Rajendran, and Meghana in pivotal roles. The motion poster has already created excitement for the film, and today, director Maruthi launched the taeser.
The teaser is filled with thrilling dialogues, such as: "There are three ways to destroy yourself... This is not something you or I can do; only a person with a sharp mind can. One person stepped on a snake’s tail, and the snake is about to bite him. What happens to the person who made him step on it?" The teaser highlights important roles played by Sathyaraj, Vasishta, and Satyam Rajesh. The visuals and the characters shown in the teaser are next-level. Following the teaser release, a special event was held.
At the event, director Maruthi mentioned, "I didn’t work directly on Barbarik. I only gave suggestions and advice. It’s a very risky genre, and I told Mohan and Raajiesh the same. They started the film with a lot of confidence. Vijay Sir Garu invested a lot into this film. He has quickly become a big producer. I am also collaborating with Vijay Garu on another project for ZEE Telugu. Mohan has put a lot of energy into this movie, and Barbarik has been made beautifully. Ramesh Reddy’s camera work is extraordinary, and the Infusion Band has provided great music. This film will be very unique, showing how a mythological character would appear to today’s generation. This movie is going to be a big hit. Sathyaraj Sir had done Baahubali, and now he’s in Barbarik as well. He immediately agreed to the role after liking the script. I’ve worked with him in Prathi Roju Pandage, and I hope this movie gets great support from everyone."
Sathyaraj commented, "For the Barbarik team, every day feels like a festival. This is a pure commercial film. From now on, we’re all 'Raja Saabs'. The director Mohan shared the story with me, and I loved it. The story is the hero of this movie. Producers Vijaypal Reddy and Raajiesh have taken great care of the team. Satyam Rajesh will be with me throughout the film. My character is quite different. I’m trying to become an aged action hero, and this movie will help me earn that tag. They asked me to dub for myself in Telugu. I’ve also dubbed in Hindi, Kannada, and Tamil. This movie is going to be a huge success."
Producer Vijaypal Reddy Adidhala shared, "I named the production house 'Vaanara Celluloid' after my parents. I’m working on this project with Maruthi Sir, and I will always be indebted to him. I never thought I would be part of a big movie like Barbarik. For this film, I brought in the Infusion Band. This film is going to be amazing."
Director Mohan Srivatsa expressed, "The Barbarik title and the glimpses we released received an amazing response. Watching Satyam Sundaram, there are two people here on stage who resemble Sundaram. Vijay Sir believed in the content I presented, and gave me the necessary budget. Maruthi Sir has always been a great source of support and inspiration for me. Sathyaraj Sir loved his character so much that he worked on the film even late at night, shooting in the rain. Satyam Rajesh supported me greatly. Vasishta will soon become a star. Sanchi is a very talented girl. Kranthi will also become a great star. Like how Barbarik has the Trishul weapon, I have three weapons: Ramesh as DOP, the Infusion Band’s music, and editor Martand K Venkatesh. With these three weapons, I’m ready to present this film to the audience."
Satyam Rajesh stated, "The movie Barbarik is going to be fantastic. I’ve got a great role in it. The budget they’ve invested in this film is unimaginable. It’s going to be like a mini Baahubali. Vasishta, Kiran, Sanchi Rai, and Yash did an amazing job. Executive Producer Raajiesh has been a great support for everyone. Sathyaraj Sir adapts to any age group he works with. It’s been a joy acting with him."
Heroine Sanchi Rai said, "The Barbarik teaser will be loved by everyone. This is my first Telugu film, and I hope to receive endless love here. I thank the director and producer for this opportunity. This film is going to be a big hit."
Actor Kranthi Kiran commented, "The movie Barbarik will be something new. I play a character named Dev. Maruthi Sir has been the backbone for the new director and producer. This film is content-driven, and it will be loved by everyone. The music by the Infusion Band and the RR are amazing. We’ll be sharing more updates soon."
Aditya Music’s Niranjan added, "The Barbarik teaser has been fantastic. Since Maruthi Sir introduced us, all his audio releases have come through us. The Infusion Band has provided great music, and I wish this film great success."
కొత్త పాయింట్‌తో రాబోతోన్న ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది.. ‘బార్బరిక్’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో స్టార్ దర్శకుడు మారుతి
స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న ‘బార్బరిక్’ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను,సత్యం రాజేష్, క్రాంతి కిరణ్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్‌తో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక తాజాగా ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం నాడు రిలీజ్ చేశారు.
‘స్వీయ నాశనానికి మూడు ద్వారాలున్నాయి.. ఇది నువ్వో నేనో చేసే పని కాదు దిమాక్ ఉన్నోడే చేయాలి.. ఒకడు తాచు పాము తోకని తొక్కాడు.. తొక్కిన వాడ్ని పాము కాటేయబోతోంది.. మరి తొక్కించిన వాడి సంగతేంటి?’.. అంటూ అదిరిపోయే డైలాగ్స్‌తో సాగిన ఈ టీజర్‌లో ఎన్నో హైలెట్స్ ఉన్నాయి. టీజర్‌లో సత్యరాజ్, వశిష్ట, సత్యం రాజేష్ ఇలా చాలా పాత్రలకు ఉన్న ఇంపార్టెన్స్‌ను చూపించారు. ఇక టీజర్ చివర్లో వదిలిన షాట్స్, చూపించిన గెటప్స్ నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయి. టీజర్ రిలీజ్ అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో..
స్టార్ దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘బార్బరిక్ సినిమా కోసం నేనేమీ పని చేయలేదు. ఈ టీంకు సలహాలు, సూచనలు మాత్రమే ఇచ్చాను. ఇది చాలా రిస్కీ జానర్ అని చెప్పాను. మోహన్, రాజేష్ చాలా కాన్ఫిడెన్స్‌తో సినిమాను స్టార్ట్ చేశారు. విజయ్ గారు ఈ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారు. విజయ్ గారు అతి తక్కువ టైంలోనే పెద్ద ప్రొడ్యూసర్ కానున్నారు. విజయ్ గారితో కలిసి జీతెలుగుతో మరో సినిమాను చేయబోతున్నాను. మోహన్ లోపలకి బార్బరికుడు వెళ్లిపోయాడు. మోహన్‌లో చాలా ఎనర్జీ ఉంది. ఈ మూవీని చాలా చక్కగా తీశారు. రమేష్ రెడ్డి గారి కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. ఇంఫ్యూజన్ బ్యాండ్ ఈ చిత్రానికి మంచి సంగీతాన్ని ఇచ్చారు. ఈ మూవీ చాలా కొత్తగా ఉంటుంది. మైథలాజికల్ పాయింట్‌లో ఉన్న పాత్ర ప్రజెంట్ జనరేషన్‌కి వస్తే ఎలా ఉంటుందో చూపించారు. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది. సత్య రాజ్ గారు బాహుబలి చేశారు.. బార్బరిక్ కూడా చేశారు. ఆయనకు కథ నచ్చితే వెంటనే ఓకే చెబుతారు. ఆయనతో నేను ప్రతిరోజూ పండగే వంటి మంచి సినిమాను చేశాను. ఈ మూవీని అందరూ ఎంకరేజ్ చేయాలి’ అని అన్నారు.
సత్య రాజ్ మాట్లాడుతూ.. ‘బార్బరిక్ టీంకు ఇక ప్రతి రోజూ పండుగే. ఇది పక్కా కమర్షియల్ సినిమా. ఇకపై మేం అంతా రాజా సాబ్‌లమే. డైరెక్టర్ మోహన్ నాకు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ సినిమాకు కథే హీరో. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి, రాజేష్ గారు టీంను చక్కగా చూసుకున్నారు. సత్యం రాజేష్ గారు సినిమాలో నాతో పాటే ఉంటారు. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఏజ్డ్ యాక్షన్ హీరో అనే ట్యాగ్ కోసం నేను ప్రయత్నిస్తున్నాను. ఈ మూవీతో నాకు ఆ ట్యాగ్ వస్తుంది. నన్ను తెలుగులో డబ్బింగ్ చెప్పమని అన్నారు. హిందీ, కన్నడ, తమిళంలోనూ డబ్బింగ్ చెప్పాను. ఈ సినిమా పెద్ద హిట్ కాబోతోంది’ అని అన్నారు.
నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల మాట్లాడుతూ.. ‘వానర సెల్యూలాయిడ్ అనేది మా తల్లిదండ్రుల పేరు మీదుగా పెట్టాను. మారుతి గారితో కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఆయనకు ఎప్పుడూ రుణ పడి ఉంటాను. బార్బరిక్ లాంటి పెద్ద సినిమాను చేస్తానని నేను అనుకోలేదు. ఈ మూవీ కోసం ఇంఫ్యూజన్ బాండ్‌ను తీసుకొచ్చాను. సినిమా అద్భుతంగా ఉండబోతోంది’ అని అన్నారు.
దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ.. ‘బార్బరిక్ టైటిల్ గ్లింప్స్‌కు అద్భుతంగా రెస్పాన్స్ వచ్చింది. సత్యం సుందరం సినిమాను చూస్తే.. సుందరం లాంటి ఇద్దరు వ్యక్తులు ఈ స్టేజ్ మీదున్నారు. విజయ్ గారు నేను చెప్పిన కంటెంట్, కథను నమ్మి నాకు కావాల్సినంత బడ్జెట్ ఇచ్చారు. మారుతి గారు నాకు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటూ స్పూర్తినింపుతూనే ఉన్నారు. సత్యరాజ్ ఈ పాత్రను చాలా ప్రేమించారు. అర్దరాత్రి దాటినా షూటింగ్ చేస్తూ ఉండేవారు. వర్షంలోనే రాత్రి పూట షూటింగ్ చేస్తుండేవారు. సత్యం రాజేష్ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. వశిష్ట త్వరలోనే స్టార్ అయిపోతారు. సాంచీ చాలా మంచి అమ్మాయి. క్రాంతి కిరణ్ మంచి స్టార్ అయిపోతాడు. బార్బరికుడికి త్రిబాణాస్త్రం ఉన్నట్టు నాకు మూడు అస్త్రాలున్నాయి. ఒకటి డీఓపీ రమేష్, రెండు ఫ్యూజన్ బాండ్, మూడు ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్. ఈ మూడు అస్త్రాలతో నేను ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాను’ అని అన్నారు.
సత్యం రాజేష్ మాట్లాడుతూ.. ‘బార్బరిక్ చిత్రం చాలా బాగుంటుంది. నాకు మంచి పాత్ర వచ్చింది. దీని మీద ఎంత బడ్జెట్ పెట్టారో కూడా ఊహించలేరు. మినీ బాహుబలిలా ఉంటుంది. వశిష్ట, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, యష్న అద్భుతంగా నటించారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత రాజేష్ అందరికీ సపోర్ట్‌గా నిలిచారు. సత్యరాజ్ గారు ఏ ఏజ్ యాక్టర్‌లతో నటిస్తే ఆ ఏజ్ యాక్టర్‌లా మారిపోతారు. ఆయనతో నటించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
హీరోయిన్ సాంచి రాయ్ మాట్లాడుతూ.. ‘బార్బరిక్ టీజర్ అందరికీ నచ్చుతుంది. ఇది నాకు ఫస్ట్ తెలుగు సినిమా. నాకు ఇక్కడ అనంతమైన ప్రేమ లభిస్తుందని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమా పెద్ద హిట్ కాబోతోంది’ అని అన్నారు.
నటుడు క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. ‘బార్బరిక్ సినిమా చాలా కొత్తగా ఉండబోతోంది. ఇందులో నేను దేవ్ అనే పాత్రను పోషించాను. కొత్త దర్శక, నిర్మాతలకు మారుతి గారు బ్యాక్ బోన్‌లా నిలిచారు. కంటెంట్‌తో వస్తున్న సినిమా ఇది. ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. ఇంఫ్యూజన్ బ్యాండ్ ఇచ్చిన పాటలు, ఆర్ఆర్ అద్భుతంగా ఉంటుంది. మున్ముందు మరిన్ని అప్డేట్లతో రాబోతున్నామ’ని అన్నారు.
ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ మాట్లాడుతూ.. ‘త్రిబాణధారి బార్బరిక్ టీజర్ అద్భుతంగా ఉంది. మారుతి గారు మాకు పరిచయమైన దగ్గర్నుంచి ఆయన సినిమా ఆడియో మా ద్వారానే రిలీజ్ అవుతున్నాయి. ఇంఫ్యూజన్ బ్యాండ్ మంచి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.