pizza

Kartikeya - Neha Shetty’s 'Bedurulanka 2012' releasing in June!!
హీరో కార్తికేయ 'బెదురులంక 2012' జూన్ లో ప్రపంచవ్యాప్త విడుదలకి సిద్ధం!

You are at idlebrain.com > news today >
Follow Us

14 May 2023
Hyderabad

Giving out the release update today, film producer Ravindra Benerjee Muppaneni (Benny) of Loukya Entertainments and Presenter C. Yuvaraju are super confident that it will be an out-n-out hilarious entertainer of the season and sets a benchmark for Godavari based Rural Dramas

With debutant Clax’s new-age content, Melody Brahma Manisharma’s music, Kartikeya & Neha Sshetty's chemistry, Aesthetic camera work at Banks of Godavari and the out-n-out comedy, Bedurulanka 2012 has a lot to watch in theaters worldwide.

Besides the leads, noted actors Ajay Ghosh, Raj Kumar Kasireddy, Goparaju Ramana, 'Auto' Ram Prasad, LB Sriram, Surabhi Prabhavathi, Kittayya, Anithanath, Divya Narni and others are playing crucial roles in the film.

Fights: Anji, Prithvi Raj; Costume Designer: Anusha Punjala; Editing: Viplav Nyshadam; Lyrics: Sirivennela Seetharamashastry, Kittu Vissapragada, Krishna Chaitanya; Production Designer: Sudheer Macharla; Co-producers: Avaneendra Upadrasta & Vikas Gunnala; Executive Producer: Durgarao Gunda; Cinematography: Sai Prakash Ummadisingu, Sunny Kurapati; Music: Mani Sharma; Dance: Brinda Master, Moin Master; Producer: Ravindra Benerjee Muppaneni; Written & Directed by Clax.

ప్రపంచవ్యాప్తంగా జూన్ లో విడుదలవ్వనున్న హీరో కార్తికేయ 'బెదురులంక 2012'

టీజర్ మరియు ఇతర పోస్టర్స్ ద్వారా ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి రేపిన కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి ల చిత్రం 'బెదురులంక 2012' భారీ అంచనాల మధ్య జూన్ లో ప్రపంచవ్యాప్త విడుదలకి సిద్ధంగా ఉంది.

లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా ఈ చిత్రాన్ని నిర్మించిన రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని, చిత్ర సమర్పకులు సి. యువరాజ్ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు.

క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్ర కథ, మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం, కార్తికేయ, నేహా శెట్టి మధ్య కెమిస్ట్రీ, కెమెరా వర్క్, గోదావరి తీర ప్రాంతం, ఆద్యంతం నవ్వించే కామెడీ, ఇలా ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలు ఎన్నో టీజర్ లో ఇదివరకే చూపించేసారు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు చిత్రం పై పూర్తి నమ్మకంతో ప్రపంచవ్యాప్త విడుదల చేస్తున్నాము. ఇది 'ఎంటర్టైనర్ ఆఫ్ థిస్ సీజన్' అవుతుంది. ఇప్పటివరకు గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్ డ్రామాలకు చాలా భిన్నంగా ఉంటుంది. గోదావరి బేస్డ్ రూరల్ డ్రామా అంటే 'బెదురులంక 2012' ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది అన్నారు.

కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి యాక్షన్: అంజి, పృథ్వీ కాస్ట్యూమ్ డిజైనర్: అనూషా పుంజాల, పి.ఆర్.ఓ: పులగం చిన్నారాయణ, ఎడిటింగ్: విప్లవ్ న్యాసదం, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ప్రొడక్షన్ డిజైన్: సుధీర్ మాచర్ల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, కొరియోగ్రాఫర్: బృంద, మోయిన్, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ: సి. యువరాజ్, నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన - దర్శకత్వం: క్లాక్స్.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved