`
pizza

Romantic Melody "Vennello Aadapilla" from Kartikeya's 'Bedurulanka 2012' out now!!
కవ్వించే కన్నెపిల్ల... కోపంలో అగ్గిపుల్ల... 'బెదురులంక 2012'లో రొమాంటిక్ 'వెన్నెల్లో ఆడపిల్ల'

You are at idlebrain.com > news today >
Follow Us

7 March 2023
Hyderabad

First Single from Young Hero Kartikeya's exciting next 'Bedurulanka 2012' streamed today & within no time it turned out as an instant favourite Melody for many.

Composed by Melody Brahma Manisharma, "Vennello Aadapilla" has that breezy freshness to hear on loop in the hot summer.

Starring Neha Sshetty captivatingly, the beautiful lyrical video has eye-candy romance between the leads in aesthetic locations of Godavari. Legendary Choreographer Brinda Master choreographed it gracefully.

Written by Kittu Vissapragada, Harika Narayanan & JV Sudhanshu's vocals added ease into the song like a cool breeze.

Producer Benny Muppaneni says "Manisharma garu gave beautiful song. This song comes up at an important point of the love story. Besides Melody Brahma's magic, it's Kartikeya & Neha Sshetty's chemistry and camera work that made it look captivating. 'Vennello Aadapilla' received instant fantastic response. We shot it on the banks of Godavari in the middle of night at the 8 Acres aqua Pond. The chemistry and humor between the leads will play the major part of many engaging elements in the film. It will be an out-n-out hilarious entertainer of the season and a completely different film than many other movies made with Godavari backdrop. I'm confident that Bedurulanka 2012 will set a benchmark for Godavari based Rural Dramas. We've received great response for the teaser and other glimpses of the film from everywhere. We're at the final stage of Post Production and planning to announce the release date soon. We're glad to get good offers from distribution circle as we know it deserves all the craze"

Ravindra Benerjee (Benny) is producing this project as Production No: 3 under
Loukya Entertainments banner and C. Yuvaraju is presenting it.

Ajay Ghosh, Raj Kumar Kasireddy, Goparaju Ramana, 'Auto' Ram Prasad, LB Sriram, Surabhi Prabhavathi, Kittayya, Anithanath, Divya Narni and others are playing crucial roles in the film.

Fights: Anji, Prithvi Raj; Costume Designer: Anusha Punjala; Editing: Viplav Nyshadam; Lyrics: Sirivennela Seetharamashastry, Kittu Vissapragada, Krishna Chaitanya; Production Designer: Sudheer Macharla; Co-producers: Avaneendra Upadrasta & Vikas Gunnala; Executive Producer: Durgarao Gunda; Cinematography: Sai Prakash Ummadisingu, Sunny Kurapati; Music: Mani Sharma; Dance: Brinda Master, Moin Master; Producer: Ravindra Benerjee Muppaneni; Written & Directed by Clax.

కవ్వించే కన్నెపిల్ల... కోపంలో అగ్గిపుల్ల... 'బెదురులంక 2012'లో రొమాంటిక్ 'వెన్నెల్లో ఆడపిల్ల'

- - - - - - - - - - - - - - - - - - - - - -
కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటించిన సినిమా 'బెదురులంక 2012'. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో కార్తికేయ సరసన 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటించారు.

'వెన్నెల్లో ఆడపిల్ల...
కవ్వించే కన్నెపిల్ల...
కోపంలో చూస్తే ఎల్లా...
క్షణంలో అగ్గిపుల్ల...'
అంటూ సాగే గీతాన్ని ఈరోజు విడుదల చేశారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీ అందించిన ఈ 'వెన్నెల్లో ఆడపిల్ల...' పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. హారిక నారాయణ్, జెవి సుధాంశు ఆలపించారు. లెజెండరీ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారు.

'వెన్నెల్లో ఆడపిల్ల...' లిరికల్ వీడియోలో కార్తికేయ, నేహా శెట్టిల కెమిస్ట్రీ అందంగా ఉంది. ప్రేమికుల మధ్య రొమాంటిక్ మూమెంట్స్, ఫీలింగ్స్ చక్కగా ఆవిష్కరించారు.

చిత్ర నిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ "మణిశర్మ గారు అద్భుతమైన బాణీ అందించారు. ప్రేమ కథలోని కీలకమైన సందర్భంలో వస్తుందీ పాట. మణిశర్మ గారి బాణీకి తోడు కార్తికేయ, నేహా శెట్టి మధ్య కెమిస్ట్రీ, కెమెరా వర్క్ పాటలో హైలైట్ అవుతాయి. 'వెన్నెల్లో ఆడపిల్ల...' పాట విడుదలైన కొన్ని క్షణాల్లోనే ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. గోదావరి తీర ప్రాంతంలోని ఓ గ్రామంలో ఈ పాటను చిత్రీకరించాం. ఎనిమిది ఎకరాల రొయ్యల చెరువు మధ్య రాత్రి వేళల్లో తీసిన పాట ఇది. సినిమాలో హీరో హీరోయిన్ల జోడి చాలా ఫ్రెష్ గా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ సినిమాకి హైలైట్. అలాగే, కామెడీ కూడా! ఇది హిలేరియస్ ఎంటర్టైనర్. ఎంటర్టైనర్ ఆఫ్ థిస్ సీజన్ అని గర్వంగా చెబుతాం. ఇప్పటివరకు గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్ డ్రామాలకు చాలా భిన్నంగా ఉంటుంది. గోదావరి బేస్డ్ రూరల్ డ్రామా అంటే 'బెదురులంక 2012' ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు వినోదాత్మకంగా, వైవిధ్యంగా ఉన్నాయి అని ప్రేక్షకులు చెబుతున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం. డిస్ట్రిబ్యూషన్ సర్కిల్స్ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. బిజినెస్ క్రేజీగా జరుగుతోంది" అని చెప్పారు.

కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి యాక్షన్: అంజి, పృథ్వీ కాస్ట్యూమ్ డిజైనర్: అనూషా పుంజాల, పి.ఆర్.ఓ: పులగం చిన్నారాయణ, ఎడిటింగ్: విప్లవ్ న్యాసదం, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ప్రొడక్షన్ డిజైన్: సుధీర్ మాచర్ల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, కొరియోగ్రాఫర్: బృంద, మోయిన్, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ: సి. యువరాజ్, నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన - దర్శకత్వం: క్లాక్స్.

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved