06 August 2016
Hyderabad
"Bichchagadu" set box-office on fire in Andhra Pradesh and Telangana and is still running successfully at many centers. Vijay Antony who played the title role "Bichchagadu" will be entertaining us with a new avatar in his latest film. He is currently acting in Tamil film "Saithan" that is directed by Pradeep Kumar. All leading producers have tried their best to bag the rights of "Saithan" for AP and Telangana but producer S Venugopal of 'Win Win Win Creations' grabbed the deal.
In Telugu, it is titled as "Betaludu". Vijay Antony has Arundhati Nayar as heroine.
"Shooting part has been completed. Post-production work is now being completed with good pace. We are planning to release the first teaser this month. We also announce the date for audio launch event shortly. Our Win Win Win Creations banner is bringing this film to Telugu audiences in September. It will be simultaneous release in Telugu and Tamil," S Venugopal, producer of the movie, said.
Actor Vijay Anthony: "As an actor, my aim is to do the varied characters. I am playing an software engineer in the film and the role is completely different to what I have done so far. It is psychological thriller." He further adds, "I have also composed the songs. Telugu people have expectations on my new movies after the success of 'Bichchagadu' and this would definitely reach their expectations."
Cast: Vijay Antony, Arundhati Nair ; Music by: Vijay Antony ; Cinematography: Pradeep Kalipurayath ; Edited by: Veera Senthil Art: Shakti Venkt Raj, Directed by: Pradeep Krishnamoorthy
presents: m.sivakumar
producers : k.rohit, s.venugopal
director : pradeepkumar
Banner: Manas Rishi Enterprises and Win Win Win Creations
మొన్న 'డా:సలీం' గా పలకరించి, నిన్న 'బిచ్చగాడు' గా రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను అలరించిన హీరో 'విజయ్ ఆంటోని'. ఆయన నటించిన 'బిచ్చగాడు' ఘన విజయం ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో 'విజయ్ ఆంటోని' కధానాయకునిగా తమిళంలో రూపొందుతున్న 'సైతాన్' చిత్రం పై అటు తమిళనాట,ఇటు తెలుగునాట సినీ, ప్రేక్షక వర్గాలలో ఆసక్తి మరింత పెరుగుతోంది. ఇప్పుడీ చిత్రం తెలుగు ప్రేక్షకులను 'బేతాళుడు' గా పలకరించబోతోంది.
'బేతాళుడు' చిత్రం తెలుగు నాట ప్రదర్శన హక్కులను 'విన్.విన్.విన్. క్రియేషన్స్' సంస్థ నిర్మాత ఎస్.వేణుగోపాల్ ('క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ 'సందీప్ కిషన్, రెజీనా' జంటగా రూపొందిస్తున్న'నక్షత్రం' చిత్ర నిర్మాతలలో ఈయన ఒకరు) చేజిక్కించుకున్న విషయం పాఠకులకు విదితమే. ఆయన మాట్లాడుతూ...
'బేతాళుడు' చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే 'బేతాళుడు' తొలి ప్రచార దృశ్యాలను, చిత్రం ఆడియోను విడుదల చేయనున్నాము. సెప్టెంబర్ నెలలో తెలుగు,తమిళంలో చిత్రం ఒకే మారు విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి అని తెలిపారు. 'మానస్ రిషి ఎంటర్ ప్రైజస్' సంస్థ తో కలసి ఈ 'బేతాళుడు' చిత్రాన్నితెలుగునాట తమ 'విన్.విన్.విన్. క్రియేషన్స్' సంస్థ విడుదల చేయనుందని నిర్మాత ఎస్.వేణుగోపాల్ తెలిపారు.
'బేతాళుడు' : 'సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్'
చిత్ర కథానాయకుడు 'విజయ్ ఆంటోని' మాట్లాడుతూ..' నటునిగా వైవిధ్యమైన పాత్రల పోషణ లక్ష్యం గా ఉన్న నాకు కొనసాగింపు ఈ 'సైతాన్'. 'సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్' ఈ చిత్రం. తెలుగునాట 'బేతాళుడు' పేరుతొ విడుదల అవుతోంది చిత్రం.సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఈ చిత్రంలో నా పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నమైనదిగా ఉండటంతో పాటు, వైవిధ్యాన్ని సంతరించుకుని ఉంటుంది. నా సరసన 'అరుంధతి నాయర్' నాయికగా నటిస్తున్నారు. చిత్ర దర్శకుడు 'ప్రదీప్ కుమార్' ఈ చిత్రం ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అలరించేలా తీర్చిదిద్దుతున్నారని నమ్ముతున్నాను. 'ప్రదీప్ కలపురయల్' సినిమాటోగ్రఫీ ఓ ఎస్సెట్ ఈ చిత్రానికి. 'సైతాన్' కు సంగీతం నేనే. పాటలు,నేపధ్య సంగీతం ప్రేక్షకులను అలరిస్తాయని ఆశిస్తున్నాను. 'బిచ్చగాడు' విజయం తరువాత విడుదల అవుతున్న 'సైతాన్' చిత్రం పై సహజంగా అంచనాలు అధికంగానే ఉంటాయి. వాటికి తగిన స్థాయిలోనే ఈ చిత్రం ఉంటుందని తెలిపారు చిత్ర కథానాయకుడు 'విజయ్ ఆంటోని'. తెలుగునాట నటునిగా తనకు ఈ చిత్రం మరింత ఉన్నత స్థాయికి తీసుకు వెళుతుందని ఆశిస్తున్నాను అన్నారు
'విజయ్ ఆంటోని,,అరుంధతినాయర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోని, సినిమాటోగ్రఫీ: ప్రదీప్ కలిపురయత్,ఎడిటర్; వీర సెంథిల్, ఫైట్స్: శరవణన్, ఆర్ట్: శక్తి వెంకట్ రాజ్.
నిర్మాతలు: కె.రోహిత్,ఎస్.వేణుగోపాల్
సమర్పణ: ఎం.శివకుమార్
దర్శకత్వం: ప్రదీప్ కుమార్
బ్యానర్: మానస్ రిషి ఎంటర్ ప్రైజస్, విన్.విన్.విన్. క్రియేషన్స్