Actor Vijay Antony, who rose to fame among Telugu audiences with Bichagadu, has earned a solid reputation for delivering content-driven films with a minimum guarantee. Even his recent release Margazhi performed well at the box office. Now, he returns as both actor and producer with his 25th film, Bhadrakaali - a film that seems to promise an intense and gripping narrative.
The trailer builds intrigue from start to finish and hints at a politically charged storyline. The plot appears to revolve around themes like corruption, economic exploitation, institutional apathy, poverty, and politics. Vijay Antony delivers some powerful lines, like: “Here, nobody cares if you’re hungry. You have to snatch what you need. Should the one who did wrong be afraid? Or the one who lost everything?”
These dialogues suggest that he might be playing a character that takes from the powerful to help the powerless - but his exact role is deliberately kept under wraps. Another striking line - “In a democracy, those at the top should fear those at the bottom”- captures the film’s bold tone and theme of social justice.
Directed by Arun Prabhu, who made a mark with the acclaimed Aruvi, the film stars Truphti Ravindra alongside Vijay Antony. Adding another layer of involvement, Vijay Antony has also composed the film’s music. The film is produced by Ram Anjaneyulu Javvaji.
Bhadrakaali is being released in Telugu by Asian Suresh Entertainment and Sravanthi Ram Creations, and is all set to hit screens on September 19.
నష్టపోయినోడు కాదు.. తప్పు చేసినోడే భయపడాలి... సంధించిన అస్త్రంలా 'భద్రకాళి' ట్రైలర్
'బిచ్చగాడు' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోనీ. ఈయన సినిమాలంటేనే ప్రేక్షకుల్లో మినిమం గ్యారంటీ ఉంది. అంతలా మంచి మార్కులే సంపాదించుకున్నారాయన. ఇటీవల విడుదలైన 'మార్గన్' కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే సాధించింది. ఆయన సంస్థ నుండి ఆయనే హీరోగా మరో ఆసక్తికర కథాంశంతో ఆయన 25 వ సినిమా 'భద్రకాళి' రాబోతుంది. ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఉత్సుకతను సృష్టిస్తూ కొనసాగింది.
ట్రైలర్ చూస్తుంటే రాజకీయ నేపథ్యంగా జరిగే కథలాగే కనిపిస్తుంది. అవినీతి, ఆర్థిక దోపిడీ, వ్యవస్థల నిర్లక్ష్యం, పేదరికం, రాజకీయం లాంటి అనేక అంశాల చుట్టూ కథ తిరుగుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. "ఇక్కడ ఆకలి ఆకలి అంటే ఎవ్వరూ పెట్టరు, లాక్కోవాలి. తప్పు చేసినోడు భయపడాలా నష్టపోయిన వాడు భయపడాలా" అంటూ విజయ్ ఆంటోనీ చెప్పిన డైలాగ్స్ వింటుంటే బహుశా ఇందులో అతనిది 'పెద్దోళ్ళను కొట్టి పేదోళ్లకు పెట్టు' అని ప్రయాణించే పాత్ర మాదిరే కనిపిస్తుంది. కానీ అతని పాత్ర ఏంటో అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంచారు ట్రైలర్ లో. 'ప్రజాస్వామ్య దేశంలో పైనున్న వాడే క్రిందున్న వాడిని చూసి భయపడాలి' లాంటి ఆకట్టుకునే డైలాగులు ఉన్నాయి ట్రైలర్ లో. ఈ సినిమాను నిర్మాత రామాంజనేయులు జవ్వాజీ నిర్మించగా, 'అరువి' సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న దర్శకుడు అరుణ్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ ఆంటోనీ సరసన తృప్తి రవీంద్ర హీరోయిన్ గా కనిపించబోతున్నారు. విజయ్ ఆంటోనీయే ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా ఈ సినిమాను 'ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్' మరియు 'స్రవంతి రామ్ క్రియేషన్స్' సంయుక్తంగా తెలుగులో విడుదలచేయబోతున్నారు. ఈ సినిమా నెల 19 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
The #Bhadrakaali trailer sets the tone for a neo-political thriller centered around the theme of fighting corruption. Interestingly, Vijay Antony’s character makes his entry only in the second half of the trailer, adding to the intrigue.