Nani launched Bhairavam song
నేచురల్ స్టార్ నాని లాంచ్ చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్, విజయ్ కనకమేడల, కెకె రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ 'భైరవం' బ్యూటిఫుల్ రస్టిక్ మెలోడీ ఓ వెన్నెల
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ 'భైరవం' ఫస్ట్ లుక్ పోస్టర్లు క్యూరియాసిటీని పెంచాయి. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై కథానాయికలుగా నటిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతిలాల్ గదా సమర్పిస్తున్నారు. చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. నేచురల్ స్టార్ నాని ఫస్ట్ సింగిల్ ఓ వెన్నెల సాంగ్ లాంచ్ చేశారు.
శ్రీచరణ్ పాకాల వైబ్రెంట్ఎనర్జిటిక్ మెలోడీని కంపోజ్ చేశారు. రస్టిక్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేసిన ఈ సాంగ్ విజువల్స్ కంపోజిషన్ గ్రౌండెడ్ ఫీల్ ని అందిస్తున్నాయి.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రగ్గడ్ రస్టిక్ అవతార్‌లో కనిపించారు. లుంగీ ధరించి ఎనర్జిటిక్ మాస్ డ్యాన్స్ మూమెంట్స్ తో అలరించారు. వెన్నెల పాత్రలో అదితి పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది.
అనురాగ్ కులకర్ణి, యామిని ఘంటసాల కంప్లీట్ ఎనర్జీతో పాడారు. తిరుపతి జవాను రాసిన లిరిక్స్ బెల్లంకొండ పాత్రలోని ఎమోషన్స్ ని, అతను వెన్నెల పట్ల తనకున్న ప్రేమను అందంగా చూపించాయి.ఈ బ్యూటీఫుల్ మెలోడీకి ఇన్స్టంట్ రెస్పాన్స్ వస్తోంది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ హరి కె వేదాంతం, సంగీతం శ్రీ చరణ్ పాకాల. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాశారు.