pizza

"Bhaje Vaayu Vegam" proved our confidence - Kartikeya at Thanks Meet
"భజే వాయు వేగం" సినిమా మా అందరి నమ్మకాన్ని నిలబెట్టింది - థ్యాంక్స్ మీట్ లో హీరో కార్తికేయ

You are at idlebrain.com > news today >

6 June 2024
Hyderabad

Presented by the prestigious production company UV Creations, the movie "Bhaje Vaayu Vegam," starring hero Kartikeya Gummakonda, is produced under the banner of UV Concepts. Iswarya Menon acted as the heroine, and Rahul Tyson of Happy Days fame played a pivotal role. Director Prashanth Reddy has created this film with an emotional action thriller story. Ajay Kumar Raju P. acted as co-producer. Recently, the movie "Bhaje Vayu Velya," which had a grand theatrical release worldwide, has been running successfully with super hit talk everywhere. In this context, the film team organized a thank-you meet in Hyderabad.

On this occasion:

Dialogue writer Madhu Srinivas said, "Thanks to the audience for making the movie 'Bhaje Vaayu Vegam' a success. A good film stands for itself. The result of this movie is proof that it will prove itself. Congratulations to the entire team."

Kapil Kumar, who provided the BGM, said, "'Bhaje Vaayu Vegam' has left many good experiences for all our team. I was the last to join this team. We worked on the BGM of this film for six months. Director Prashanth and I discussed and designed the BGM every day. Prashanth was very clear about how the BGM should be for his story. I am happy that the music of 'Bhaje Vaayu Vegam' is getting a good reputation."

Editor Satya G said, "Director Prashanth and I are friends. We have been working together since Run Raja Run in UV. Now I am happy to stand on this platform after making a successful film as an editor, and Prashanth as a director. I am happy that Prashanth got a hit as a director with 'Bhaje Vaayu Vegam.' We are thankful to UV Creations for supporting us all."

Actor Rahul Tyson said, "Thanks to the audience for making the movie 'Bhaje Vaayu Vegam' a success. With this success, I think Kartikeya has taken a hundred steps forward as a hero. He deserves more wins. It is a small success for director Prashanth's talent. He will be known as a great director. I used to send messages to him during the shooting of the film, saying, 'You have a lot of talent. You will grow to be a great director,' because he has mastery in every craft. He made the movie with a lot of conviction. Kartikeya and I acted together in this movie without any differences. That's why we got such natural scenes on screen. Kapil's music, Satya's editing, and Madhu Srinivas' dialogues take the movie to another level. Thanks to UV Creations for giving me a chance in such a good movie. Congratulations to the entire team of 'Bhaje Vaayu Vegam.'"

Director Prashanth Reddy said, "'Bhaje Vaayu Vegam' is a good movie, so the audience made everyone aware of it through word of mouth. Thanks to the audience for supporting our film. I can't forget the contribution of our direction team in shooting the movie. Thank you all. Thanks to UV Vamsi Anna, Pramod Anna, and Vicky Anna. I think I made the most of the opportunity you gave me. Dialogue writer Madhu Srinivas Anna was the first to join this project. He traveled with me from the story discussion to the dialogue corrections made before the film's release. My friend Satya edited several versions of this movie. He edited the movie very quickly. Kapil, who did the BGM, joined our team last and gave his best work. Adding Rahul to our team was a great advantage. After watching the movie, you will understand why the heroine Iswarya was not shown in the trailer. She also understood and supported us. Thanks, Iswarya. Hero Kartikeya trusted me a lot and acted in this movie. He never questioned me, not even for a single day. This movie has more support off-screen than on-screen. Even though there is a good heroic personality like Kartikeya, I have toned down his character as much as the film required. Ravi Shankar and Tanikella Bharani were traveling today and could not come to the success meet. They are well known for their performances. If a new director gets a hero like Kartikeya, the comfort will be different."

Kartikeya said, "'Bhaje Vaayu Vegam' gave me great satisfaction as a hero. At a time when I didn't know what kind of film to make, director Prashanth guided me and gave me the torchlight of success. I received my second success in a year's time. 'Bhaje Vaayu Vegam' brought victory after 'Bedurulanka.' In the past, when they wrote about me, they often mentioned another failure. Now, they're writing about another hit. Seeing that makes me happy. After the release of 'Bhaje Vaayu Vegam,' when our director Prashanth talked about the increase in collections and shows, I used to relax. I didn't care about any of that. The satisfaction of doing a good movie brought me happiness more than anything else. The audience has justified our faith in 'Bhaje Vaayu Vegam' being a good movie. Henceforth, I will take care to maintain the trust you have placed in the films I make. My friends and family say that after 'RX 100,' I have made another good movie. Ever since 'Bhaje Vaayu Vegam' was accepted, the movie has been improving at every stage, and our confidence has been increasing. It is seen as a popular film in theaters today. Thanks to Iswarya, Rahul, Director Prashanth, UV Banner, and all our movie team members who acted with me."

"భజే వాయు వేగం" సినిమా మా అందరి నమ్మకాన్ని నిలబెట్టింది - థ్యాంక్స్ మీట్ లో హీరో కార్తికేయ

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన సినిమా "భజే వాయు వేగం". ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. రీసెంట్ గా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన "భజే వాయు వేగం" సినిమా అన్ని చోట్ల నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్ లో థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా

డైలాగ్ రైటర్ మధు శ్రీనివాస్ మాట్లాడుతూ - "భజే వాయు వేగం" సినిమాకు మంచి సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. మంచి సినిమా తనను తానే నిలబెట్టుకుంటుంది. తనను తానే ప్రూవ్ చేసుకుంటుంది అనేందుకు ఈ సినిమా ఫలితమే నిదర్శనం. టీమ్ అందరికీ కంగ్రాట్స్. అన్నారు.

బీజీఎం అందించిన కపిల్ కుమార్ మాట్లాడుతూ - "భజే వాయు వేగం" సినిమా మా టీమ్ అందరికీ ఎన్నో మంచి ఎక్సీపిరియన్స్ లు మిగిల్చింది. ఈ టీమ్ లో చివరగా జాయిన్ అయ్యింది నేనే. ఆరు నెలల పాటు ఈ సినిమా బీజీఎం కోసం వర్క్ చేశాం. దర్శకుడు ప్రశాంత్ నేను రోజూ బీజీఎం ఎలా ఉండాలో డిస్కస్ చేసుకుని డిజైన్ చేశాం. ప్రశాంత్ తన కథకు బీజీఎం ఎలా ఉండాలో చాలా క్లియర్ గా చెప్పేవాడు. "భజే వాయు వేగం" సినిమాకు మ్యూజిక్ కు మంచి పేరు రావడం హ్యాపీగా ఉంది. అన్నారు.

ఎడిటర్ సత్య జి మాట్లాడుతూ - నేను, డైరెక్టర్ ప్రశాంత్ ఫ్రెండ్స్. యూవీలో రన్ రాజా రన్ నుంచి వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఎడిటర్ గా, ప్రశాంత్ డైరెక్టర్ గా సక్సెస్ ఫుల్ సినిమా చేసి ఈ వేదిక మీద నిలబడి మాట్లాడుతుండటం సంతోషంగా ఉంది. "భజే వాయు వేగం"తో డైరెక్టర్ గా ప్రశాంత్ కు హిట్ రావడం నాకు ఆనందాన్నిచ్చింది. మా అందరికీ సపోర్ట్ ఇచ్చిన యూవీ సంస్థకు థ్యాంక్స్ చెబుతున్నాం. అన్నారు.

యాక్టర్ రాహుల్ టైసన్ మాట్లాడుతూ - "భజే వాయు వేగం" సినిమాకు విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ సక్సెస్ తో కార్తికేయ హీరోగా వంద అడుగులు ముందుకు వేశాడని భావిస్తున్నా. అతనికి మరిన్ని విజయాలు రావాలి. దర్శకుడు ప్రశాంత్ ప్రతిభకు దక్కిన చిన్న విజయమిది. ఆయన ఇంకా పెద్ద దర్శకుడిగా పేరు తెచ్చుకుంటారు. సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఆయనకు మెసేజ్ లు పంపించేవాడిని. నీలో చాలా టాలెంట్ ఉంది. దర్శకుడిగా ఎదుగుతావు అని. ఎందుకంటే ప్రతి క్రాఫ్ట్ లో అతనికి పట్టు ఉంది. చాలా కన్విక్షన్ తో మూవీ తెరకెక్కించాడు. ఈ సినిమాలో కార్తికేయ నేను ఎలాంటి బేషజాలు లేకుండా కలిసి నటించాం. అందుకే స్క్రీన్ మీద మీకు అంత సహజంగా సీన్స్ వచ్చాయి. కపిల్ మ్యూజిక్, సత్య ఎడిటింగ్, మధు శ్రీనివాస్ డైలాగ్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. నాకు ఇలాంటి మంచి మూవీలో అవకాశం ఇచ్చిన యూవీ సంస్థకు థ్యాంక్స్. "భజే వాయు వేగం" సినిమా టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.

దర్శకుడు ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ - "భజే వాయు వేగం" మంచి సినిమా కాబట్టే ప్రేక్షకులు తమ మౌత్ టాక్ తో అందరికీ తెలిసేలా చేశారు. మా సినిమాకు ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్ కు థ్యాంక్స్. మూవీ షూటింగ్ లో మా డైరెక్షన్ టీమ్ ఇచ్చిన సహకారం మర్చిపోలేను. మీ అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. యూవీ వంశీ అన్న ప్రమోద్ అన్న విక్కీ అన్నకు థ్యాంక్స్. మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాననే భావిస్తున్నా. ఈ ప్రాజెక్ట్ లో ఫస్ట్ జాయిన్ అయ్యింది డైలాగ్ రైటర్ మధు శ్రీనివాస్ అన్న. స్టోరీ డిస్కషన్ నుంచి సినిమా రిలీజ్ ముందు ప్రింట్స్ పంపించే టైమ్ లో చేసిన డైలాగ్ కరెక్షన్స్ వరకు నాతో ట్రావెల్ అయ్యారు. నా ఫ్రెండ్ సత్య. ఈ సినిమాకు కొన్ని వెర్షన్స్ ఎడిట్ చేయించా. ఎంతో పేసీగా సినిమాను ఎడిట్ చేశాడు. బీజీఎఎం చేసిన కపిల్ మా టీమ్ లో చివరగా జాయిన్ అయ్యి బెస్ట్ వర్క్ ఇచ్చాడు. రాహుల్ మా టీమ్ లో యాడ్ అవడం ఎంతో అడ్వాంటేజ్ అయ్యింది. హీరోయిన్ ఐశ్వర్యను ట్రైలర్ లో ఎందుకు చూపించలేదో మీకు సినిమా చూశాక అర్థమై ఉంటుంది. ఆమె కూడా అర్థం చేసుకుని మాకెంతో సపోర్ట్ చేసింది. ఐశ్వర్యకు థ్యాంక్స్. హీరో కార్తికేయ నన్ను ఎంతో నమ్మి ఈ సినిమాలో నటించాడు. ఒక్క రోజు కూడా నన్ను క్వశ్చన్ చేయలేదు. ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ తన సపోర్ట్ ఈ మూవీకి ఎంతో ఉంది. కార్తికేయ లాంటి మంచి హీరోయిక్ పర్సనాలిటీ ఉన్నా ఆయన టోన్ డౌన్ చేసి సినిమాకు ఎంత కావాలో అంతే చూపించాను. రవిశంకర్, భరణి గారు ఇవాళ ట్రావెలింగ్ లో ఉండి సక్సెస్ మీట్ కు రాలేకపోయారు. వాళ్ల పర్ ఫార్మెన్స్ లకు మంచి పేరొచ్చింది. కార్తికేయ లాంటి హీరో కొత్త దర్శకుడికి దొరికితే ఆ కంఫర్ట్ వేరేలా ఉంటుంది. అన్నారు.

హీరో కార్తికేయ మాట్లాడుతూ - "భజే వాయు వేగం" సినిమా నాకు హీరోగా ఎంతో సంతృప్తినిచ్చింది. ఎలాంటి సినిమా చేయాలి అని అర్థం కాని టైమ్ లో డైరెక్టర్ ప్రశాంత్ నాకు దారి చూపించడం తో పాటు విజయం అనే టార్చిలైట్ ఇచ్చాడు. ఏడాది టైమ్ లో రెండో సక్సెస్ అందుకున్నా. బెదురులంక తర్వాత "భజే వాయు వేగం" విజయాన్ని ఇచ్చింది. గతంలో నా గురించి రాసేప్పుడు మరో అపజయం అందుకున్నాడు అని రాసేవారు. ఇప్పుడు అనదర్ హిట్ అని రాస్తున్నారు. అవి చూస్తుంటే హ్యాపీగా ఉంది. "భజే వాయు వేగం" రిలీజ్ అయ్యాక మా డైరెక్టర్ ప్రశాంత్ కలెక్షన్స్, షోస్ పెరగడం గురించి మాట్లాడుతుంటే నేను రిలాక్స్ అవుతూ ఉండేవాడిని. అవేమీ నేను పట్టించుకోలేదు. ఒక మంచి మూవీ చేశాం అనే సంతృప్తి నాకు మిగతా అన్నింటికన్నా హ్యాపీనెస్ ఇచ్చింది. ఒక మంచి సినిమా అవుతుందని మేము "భజే వాయు వేగం" మీద పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. ఇకపై నేను చేసే సినిమాలు మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటా. ఆర్ఎక్స్ 100 తర్వాత మళ్లీ మరో మంచి సినిమా చేశావంటూ నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ చెబుతున్నారు. "భజే వాయు వేగం" సినిమా ఒప్పుకున్నప్పటి నుంచి ప్రతి స్టేజ్ లో మూవీ బెటర్ అవుతూ, మా నమ్మకం పెరుగుతూ వచ్చింది. అది ఇవాళ థియేటర్స్ లో ఆదరణ రూపంలో కనిపిస్తోంది. నాతో కలిసి నటించిన ఐశ్వర్య, రాహుల్, డైరెక్టర్ ప్రశాంత్, యూవీ బ్యానర్, మా మూవీ టీమ్ మెంబర్స్ అందిరికీ థ్యాంక్స్. అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved