pizza

Lyca Productions "Bharateeyudu2" (Indian2) trailer to be launched extravagantly on 25th June
జూన్ 25న యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ భారీ పాన్ ఇండియా చిత్రం ‘భారతీయుడు 2’ ట్రైలర్ విడుదల

You are at idlebrain.com > news today >

23 June 2024
Hyderabad

Universal Hero Kamal Haasan is back in a role that redefined action cinema with Bharateeyudu 2 (Indian 2), the highly anticipated sequel to the iconic 1996 blockbuster,Bharateeyudu (Indian). Directed by the visionary Shankar S, known for his epic cinematic vision, this film is set to captivate audiences worldwide.

Bharateeyudu 2 (Indian 2), a pan-India production, promises a cinematic experience like no other. With a star-studded cast including S.J. Suryah, Kajal Aggarwal, Priya Bhavani Shankar, Rakul Preet Singh, Siddharth, Nedumudi Venu, Kalidas Jayaram, Gulshan Grover, Samuthirakani, Bobby Simha, Brahmanandam, Zakir Hussain, Piyush Mishra, Guru Somasundaram, Delhi Ganesh, Shivaji Guruvayoor, Deepa Shankar, Anant Mahadevan, George Maryan, Vinod Sagar, Akhilendra Mishra, and Benedict Garrett, the film is set to be a visual feast. The film pays tribute to the legacy of late actors Vivek, G Marimuthu, and Manobala, preserving their contributions to the project.

Bharateeyudu 2 (Indian 2) is a testament to the power of collaboration, marking the first union of Shankar and musical maestro Anirudh Ravichander. The film's soundtrack has already garnered immense praise, with two songs captivating audiences. The wait for the film's grand theatrical release on July 12, 2024, is reaching its climax with the highly anticipated trailer unveiling. Lyca Productions has confirmed that the trailer, clocking in at 2 minutes and 36 seconds, will be launched on June 25, 2024, with a special event in Mumbai. The makers confirmed the film's trailer release with a brand new poster which showed Senapathy (Old Kamal Haasan) carrying a bag signifying that he is set to unleash the powerful and impactful trailer on the stipulated date.

Bharateeyudu 2 (Indian 2) is a cinematic masterpiece in the making, with Lyca Productions and Red Giant Movies backing the project. Ravi Varma's cinematography and A. Sreekar Prasad's editing promise a visually stunning experience. The film has been produced on a grand scale, ensuring a visually stunning and impactful experience. The Telugu theatrical rights have been acquired by Asian Suresh Entertainment LLP and Ceded by Sri Lakshmi Movies, ensuring a wide release in the Telugu states of Telangana and Andhra Pradesh spectacularly.

Get ready to witness the return of Veerasekaran Senapathy, the vigilante hero of Bharateeyudu ( Indian), in a sequel that promises to surpass its predecessor in every way. Bharateeyudu 2 (Indian 2 in Tamil and Hindustani 2 in Hindi) is a cinematic event that will redefine the boundaries of action cinema.

Cast: Kamal Haasan,. S. J. Suryah, Priya Bhavani Shankar, Kajal Aggarwal, Siddharth, Rakul Preet Singh, Nedumudi Venu, Vivek, Kalidas Jayaram, Gulshan Grover, Samuthirakani, Bobby Simha, Brahmanandam, Vennela Kishore,Zakir Hussain, Piyush Mishra, Guru Somasundaram, Delhi Ganesh, Jayaprakash, Manobala, and Ashwini Thangaraj

Director: S.Shankar
Story: Shankar
Screenplay: Shankar,B.Jeyamohan,Kabilan Vairamuthu,Lakshmi Saravana Kumar
Music:Anirudh Ravichander
Editing:A.Sreekar Prasad
Cinematography:Ravi Varman
Art: Muthuraj
Stunt Choreography; Anal Arasu
Produced by: Subaskaran
Head of lyca productions G.K.M.Tamilkumaran
Banners: Lyca Productions, Red Giant Movies

జూన్ 25న యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ భారీ పాన్ ఇండియా చిత్రం ‘భారతీయుడు 2’ ట్రైలర్ విడుదల

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ ప్రమోషనల్ ప్లానింగ్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ క్ర‌మంలో జూన్ 25న ‘భారతీయుడు 2’ ట్రైల‌ర్‌ను తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ‘భార‌తీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి.

‘భారతీయుడు 2’ ట్రైలర్ అనౌన్స్‌మెంట్ డేట్‌ను తెలియ‌జేస్తూ మేక‌ర్స్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. అందులో ముస‌లి పాత్ర‌లోని క‌మ‌ల్ హాస‌న్ ట్రాలీ బ్యాగ్‌తో మెట్లు ఎక్కుతున్నారు. అంటే పోస్ట‌ర్‌తో ట్రైల‌ర్ వచ్చేస్తుంద‌నే విష‌యాన్ని సింబాలిక్‌గా చ‌క్క‌గా చెప్పిన‌ట్లుంది పోస్ట‌ర్ చూస్తుంటే.

అవినీతికి వ్య‌తిరేకంగా పోరాటం చేసిన సేనాప‌తిగా ‘భార‌తీయుడు’ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ మెప్పించారు. ఇప్పుడు దీనికి కొన‌సాగింపుగా ‘భారతీయుడు 2’ రానుంది. మూవీపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. సేనాపతిగా మరోసారి కమల్ హాసన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయబోతున్నారోనంటూ అభిమానులు, సినీ ప్రేమికులు, ట్రేడ్ వర్గాలు స‌హా అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

‘భార‌తీయుడు 2’ సినిమాపై ఉన్న అంచ‌నాల‌కు అనుగుణంగానే ప్ర‌మోష‌న‌ల్ ప్లానింగ్‌తో టీమ్ కంటెంట్‌ను ప్రేక్ష‌కులకు అందిస్తోంది. క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ర‌వివ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.శ్రీక‌ర ప్ర‌సాద్ ఎడిట‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా టి.ముత్తురాజ్ గా వ‌ర్క్ చేస్తున్నారు. బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ‌కుమార్‌ల‌తో క‌లిసి డైరెక్ట‌ర్ శంక‌ర్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ క‌ల‌యిక ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంద‌న‌టంలో సందేహం లేదు.

లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్ మూవీస్ రూపొందిస్తోన్న భారీ బ‌డ్జెట్‌తో ‘భార‌తీయుడు 2’లో క్రియేటివ్ బ్రిలియ‌న్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇది సినిమా ప్ర‌పంచంలో ఓ స‌రికొత్త మైలురాయిని క్రియేట్ చేయ‌టానికి సిద్ధంగా ఉంది. సినిమా చూసే ప్రేక్ష‌కుల్లో గొప్ప ఆలోచ‌న రేకెత్తించేలా సినిమాలు చేస్తూ త‌న అభిరుచి చాటుకుంటున్న లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్ జూలై 12న‌ ఇండియన్ 2 పేరుతో త‌మిళంలో, భార‌తీయుడు 2 పేరుతో తెలుగు, హిందుస్థానీ పేరుతో హిందీలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

సోనీ మ్యూజిక్ ద్వారా ‘భారతీయుడు 2’ పాటలు మార్కెట్లో సంద‌డి చేస్తున్నాయి.

న‌టీన‌టులు:
క‌మ‌ల్ హాస‌న్‌, ఎస్‌.జె.సూర్య‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్‌, కాళిదాస్ జ‌య‌రాం, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని, బాబీ సింహ‌, బ్ర‌హ్మానందం, జాకీర్ హుస్సేన్‌, పియుష్ మిశ్రా, గురు సోమ‌సుంద‌రం, డిల్లీ గ‌ణేష్, జ‌య‌ప్రకాష్‌, మ‌నోబాల‌, అశ్వినీ తంగ‌రాజ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.శంక‌ర్‌, స్క్రీన్ ప్లే: ఎస్‌.శంక‌ర్‌, బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ కుమార్‌, మ్యూజిక్ : అనిరుద్ ర‌విచంద్ర‌న్‌, ఎడిటింగ్: ఎ.శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ: ర‌వివ‌ర్మ‌న్‌, ఆర్ట్‌: ముత్తురాజ్‌, స్టంట్స్‌: అన‌ల్ అర‌సు, అన్బ‌రివు, రంజాన్ బుల‌ట్‌, పీట‌ర్ హెయిన్స్‌, స్టంట్ సిల్వ‌, డైలాగ్ రైట‌ర్‌: హ‌నుమాన్ చౌద‌రి, వి.ఎఫ్‌.ఎక్స్ సూప‌ర్ వైజ‌ర్‌: వి.శ్రీనివాస్ మోహ‌న్‌, కొరియోగ్ర‌ఫీ: బాస్కో సీజ‌ర్‌, బాబా భాస్క‌ర్‌, పాట‌లు: శ్రీమ‌ణి, సౌండ్ డిజైన‌ర్‌: కునాల్ రాజ‌న్‌, మేక‌ప్ : లెగ‌సీ ఎఫెక్ట్‌-వాన్స్ హర్ట్‌వెల్‌- ప‌ట్ట‌ణం ర‌షీద్‌, కాస్టూమ్ డిజైన్‌: రాకీ-గ‌విన్ మ్యూగైల్‌- అమృతా రామ్‌-ఎస్‌బి స‌తీష‌న్‌-ప‌ల్లవి సింగ్-వి.సాయి, ప‌బ్లిసిటీ డిజైన‌ర్: క‌బిల‌న్ చెల్ల‌య్య ,పి.ఆర్‌.ఒ (తెలుగు): నాయుడు సురేంద్ర కుమార్‌, ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సుంద‌ర్ రాజ్‌, హెడ్ ఆఫ్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌: జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్‌, రెడ్ జైంట్ మూవీస్‌: సెన్‌బ‌గ మూర్తి, నిర్మాత‌: సుభాస్క‌ర‌న్‌.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved