pizza

Megastar Chiranjeevi’s Vintage Mass Look Posters From Meher Ramesh, Anil Sunkara’s Mega Massive Movie Bholaa Shankar
మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్, అనిల్ సుంకర మెగా మాసివ్ మూవీ 'భోళా శంకర్' నుంచి చిరంజీవి వింటేజ్ లుక్ పోస్టర్స్ విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

01 May 2023
Hyderabad

Megastar Chiranjeevi’s Mega Massive Action Entertainer under the direction of stylish maker Meher Ramesh is mounted on a huge canvas with a high budget by Ramabrahmam Sunkara. The makers recently completed a high-octane interval episode in Hyderabad and with that 80% of the shoot has been done.

On the May Day occasion, the makers released three new posters from the movie where Chiranjeevi appears in a vintage mass look. The megastar appears as a Taxi driver in a Grey color uniform in these posters. He is seen enjoying his tea time. Flashing a charming smile, Chiranjeevi looks younger and more dynamic here.

The next schedule of the movie will begin in Kolkatta where the team will shoot important scenes involving Chiranjeevi, Keerthy Suresh, Tamannaah, Vennela Kishore, and others. After that, they will fly to Europe to film a song on Chiranjeevi and Tamannaah there. Mahati Swara Sagar scored a rocking number for the same. Some talkie part, climax shoot, and a huge set song will be canned after they are back from Europe. With that, the entire shoot of the movie will be wrapped up by the end of June. The post-production works are also in full swing for the movie.

This commercial entertainer produced by Anil Sunkara’s AK Entertainments will have emotions and other elements in the right proportions.

Tamannaah is playing the leading lady, while Keerthy Suresh will be seen as Chiranjeevi’s sister. Talented actor Sushanth is essaying a lover boy role.

Dudley cranks the camera, wherein Marthand K Venkatesh takes care of editing and AS Prakash is the production designer. Story supervision is by Satyanand and dialogues are by Thirupathi MamidalaKishore Garikipati is the executive producer.

Bholaa Shankar will release worldwide grandly on August 11th ahead of Independence Day.

Cast: Chiranjeevi, Tamannaah, Keerthy Suresh, Sushanth, Raghu Babu, Murali Sharma, Ravi Shankar, Vennela Kishore, Tulasi, sureka vani,Sri Mukhi, Hyper Adhi,viva Harsha ,
pradeep,Anee,Bithiri Sathi, Satya, Getup Srinu,Venu Tillu ,Thagubotu ramesh ,
Rashmi Gautam, Uttej,
Veer ,Shahwar Ali &Tarun Arora

Technical Crew:
Screenplay, Direction: Meher Ramesh
Producer: Ramabrahmam Sunkara
Banner: AK Entertainments
Ex-Producer: Kishore Garikipati
Music: Mahati Swara Sagar
DOP: Dudley
Editor: Marthand K Venkatesh
Production Designer: AS Prakash
Story Supervision: Satyanand
Dialogues: Thirupathi Mamidala
Fight Masters: Ram-Laxman, Dileep Subbarayan,
Choreography: Sekhar Master
Lyrics: Ramajogayya Sastry, Kasarla Shyam
VFX Supervisor: Yugandhar
Publicity Designers: Anil-Bhanu
Digital Media Head: Viswa CM
Line Production: Meher Movies

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్, అనిల్ సుంకర మెగా మాసివ్ మూవీ 'భోళా శంకర్' నుంచి చిరంజీవి వింటేజ్ లుక్ పోస్టర్స్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “భోళా శంకర్”. రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇటీవల హైదరాబాద్‌లో హై-ఆక్టేన్ ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను పూర్తి చేసారు. దానితో 80% షూటింగ్ పూర్తయింది.

మే డే సందర్భంగా చిరంజీవి వింటేజ్ మాస్ లుక్‌లో కనిపించే మూడు కొత్త పోస్టర్‌లను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లలో మెగాస్టార్ గ్రే కలర్ యూనిఫాంలో టాక్సీ డ్రైవర్‌గా కనిపిస్తున్నారు. ఓ పోస్టర్ లో టీ టైమ్‌ని ఆస్వాదిస్తూ కనిపించారు. ఛార్మింగ్ స్మైల్ తో యంగ్ అండ్ డైనమిక్ గా కనిపిస్తున్నారు మెగాస్టార్.

చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా, వెన్నెల కిషోర్, ఇతరులతో కూడిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోల్‌కత్తాలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత చిరంజీవి, తమన్నాలపై ఓ పాటను చిత్రీకరించేందుకు యూరప్ వెళ్లనున్నారు. మహతి స్వర సాగర్ రాకింగ్ నెంబర్ ని స్కోర్ చేశారు. యూరప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొంత టాకీ పార్ట్, క్లైమాక్స్ షూట్, భారీ సెట్ సాంగ్ చిత్రీకరిస్తాం. దాంతో జూన్ నెలాఖరుకు సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ & యాక్షన్‌ సమపాళ్లలో వుండనున్నాయి.

తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్, చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది. టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ఈ సినిమాలో లవర్ బాయ్ పాత్రలో నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

‘భోళా శంకర్’ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేక వాణి, శ్రీ ముఖి, హైపర్ ఆది, వైవా హర్ష ,ప్రదీప్, అనీ, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, వేణు టిల్లు , తాగుబోతు రమేష్ ,రష్మీ గౌతమ్, ఉత్తేజ్, వీర్, షహ్వర్ అలీ & తరుణ్ అరోరా

సాంకేతిక విభాగం :
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
బ్యానర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ: డడ్లీ
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
కథా పర్యవేక్షణ: సత్యానంద్
డైలాగ్స్: తిరుపతి మామిడాల
ఫైట్ మాస్టర్స్: రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, కాచే కంపాక్డీ
కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ
వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: యుగంధర్
పబ్లిసిటీ డిజైనర్లు: అనిల్-భాను
డిజిటల్ మీడియా హెడ్: విశ్వ సిఎం
లైన్ ప్రొడక్షన్: మెహెర్ మూవీస్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved