`
pizza

Melodious first single "Dappukotti Cheppukona" sung by Anurag Kulkarni from Bhootaddham Bhaskar Narayana impresses
శివ కందుకూరి "భూతద్ధం భాస్కర్‌ నారాయణ" చిత్రం నుండి "డప్పుకొట్టి చెప్పుకొనా" లిరికల్ సాంగ్ విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

28 February 2023
Hyderabad

Introducing Purushottam Raj as a director, Bhootaddham Bhaskar Narayana is a film produced by Snehal Jangala, Shasidhar Kashi, and Karthik Mudumbai jointly under the banners of Million Dreams Creations and Vijay Saraga Productions without compromising on the production values.

From the first look of the film to the recently released teaser, the producers have inserted the concept of the film and presented it in a unique manner. Every promotional material related to this film impressed the audience. The makers have decided to release the film on March 31, 2023. Kickstarting the promotions, makers released the first single Dappukotti Cheppukona from the film.

It is a soothing number scored by Vijay Bulganin. Bhaskarbatla is the lyricist, and the sensational singer Anurag Kulkarni sung this beautiful melody. The song has an enchanting vibe that will take every listener in trance. It is delight to both eyes and ears with the enchanting tune and magical chemistry of main lead.

Shiva Kandukuri and Rashi Singh both looks great together and this melody explains the beautiful love between them. Only a few songs imprint an emotion in us the first time you hear them and this is one such song. Bhootaddham Bhaskar Narayana, which releases worldwide in theatres on March 31, is expected to keep audiences on the edge of their seats.

Raj Purushottam is directing this film. Bhoothadham Bhaskar Narayana is a thrilling entertainment film. Presently the post-production is going on at a fast pace. Important characters include Arun, Devi Prasad, Varshini, Siva Kumar, Shafi, Shivanarayana, Kalpalatha, Roopa Lakshmi, and Ambati Sreenu.

Actors:
Shiva Kandukuri, Rashi Singh, Arun, Deviprasad, Varshini, Sivakumar, Shafi, Sivannarayana, Kalpalatha, Rupalakshmi, Ambati Srinu, Chaitanya, Venkatesh Kakumanu, Pranavi, Divija, Prabhakar, Kamal, Gururaj and others.

Technicians:
Written-Directed by: Purushottam Raj
Producers: Snehal Jangala, Shasidhar Kashi, Karthik Mudumbai
Music: Sricharan Pakala, Vijay Bulganin
Director of Photography: Gautham G
Editor: Gary BH
Production Designer: Roshan Kumar
Costume Designers: Ashwanth, Pratibha
Stunts: Anjibabu

శివ కందుకూరి "భూతద్ధం భాస్కర్‌ నారాయణ" చిత్రం నుండి "డప్పుకొట్టి చెప్పుకొనా" లిరికల్ సాంగ్ విడుదల

విభిన్నమైన మంచి చిత్రాల్లో న‌టిస్తూ నటుడుగా త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శివ కందుకూరి. ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నాడు. శివ కందుకూరి హీరోగా రాశి సింగ్ హీరోయిన్ గా పురుషోత్తం రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "భూతద్ధం భాస్కర్‌ నారాయణ". ఈ సినిమాను స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ పై నిర్మిస్తున్నారు.

ఇదివరకే రిలీజైన మోషన్ పోస్టర్ తో అంచనాలను పెంచింది ఈ చిత్రం. అలానే ఈ చిత్ర టీజర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ మొదటి నుండి చివరివరకు ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమాలో శివ కందుకూరి డిటెక్టీవ్ గా కనిపించనున్నాడు. మంచి కథతో పాటు అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే బాక్గ్రౌండ్ స్కోర్ తో ఈ టీజర్ ను ప్రెజెంట్ చేసారు మేకర్స్.

తాజాగా ఈ చిత్రం నుండి "డప్పుకొట్టి చెప్పుకొనా" అనే సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందించాడు.భాస్కర భట్ల రచించిన ఈ పాటను, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. అందరికి అర్ధమయ్యే పదాలతో భాస్కర్ భట్ల ఈ పాటను అద్భుతంగా రచించారు.

"అందాల ఓ వెన్నెల నువ్వు నా కళ్ళ ముందుండగా
ఏనాడూ ఏ చీకటి ఇక రాదంట నా వైపుగా"
డప్పుకొట్టి చెప్పుకొనా
ఊరంతా నేను డప్పుకొట్టి చెప్పుకొనా
గుప్పెడంత గుండెలోన ఆనందమంతా డప్పుకొట్టి చెప్పుకొనా"
లాంటి లిరిక్స్ ఖచ్చితంగా యూత్ ను ఆకట్టుకుంటాయి.

ఇదివరకే ఈ చిత్రం గురించి మేకర్స్ ప్రస్తావిస్తూ ప్రతి సన్నివేశం ప్రేక్షకులకి ఎడ్జ్‌ ఆఫ్‌ద సీట్‌గా వుంటుంది. ఈ చిత్రంలో ఏ సన్నివేశాన్ని ప్రేక్షకులు ముందుగా ఊహించడం చాలా కష్టం’ అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా మార్చి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సాంగ్ క్రెడిట్స్:
మ్యూజిక్: విజయ్‌ బుల్గానిన్‌
సాహిత్యం: భాస్కర భట్ల రవికుమార్
గానం: అనురాగ్ కులకర్ణి

నటీనటులు:
శివ కందుకూరి, రాశి సింగ్‌, అరుణ్‌, దేవీప్రసాద్‌, వర్షిణి, శివకుమార్‌, షఫీ, శివన్నారాయణ, కల్పలత, రూపలక్ష్మి, అంబటి శ్రీను, చైతన్య, వెంకటేశ్‌ కాకుమాను, ప్రణవి, దివిజ, ప్రభాకర్‌, కమల్‌, గురురాజ్‌ తదితరులు

రచన-దర్శకత్వం: పురుషోత్తం రాజ్‌
నిర్మాతలు: స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, విజయ్‌ బుల్గానిన్‌
డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ: గౌతమ్‌ జి
ఎడిటర్‌: గ్యారీ బిహెచ్‌
ప్రొడక్షన్‌ డిజైనర్: రోషన్‌ కుమార్‌
కాస్ట్యూమ్‌ డిజైనర్స్‌: అశ్వంత్‌, ప్రతిభ
స్టంట్స్‌: వింగ్ చున్ అంజి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved