![](../../images5/birthdayinterview2015-aadi.jpg)
22 December 2015
Hyderabad
తండ్రి కావడంతో నా తల్లిదండ్రులపై గౌరవం మరింత పెరిగింది - ఆది
ఆది, ఆదాశర్మ హీరో హీరోయిన్స్‌గా వసంత శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాస్ సాయి స్క్రీన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం 'గరం'. 'ప్రేమకావాలి, లవ్‌లీ, గాలిపటం' వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన హీరో ఆది. ఇప్పుడు 'గరం' చిత్రంతో సందడి చేయడానికి రెడీ అయ్యాడు. ఈ చిత్రాన్ని సాయికుమార్ నిర్మిస్తుండటం విశేషం. మదన్ దర్శకుడు. డిసెంబర్ 23న ఆది పుట్టినరోజు సందర్భంగా హీరో ఆదితో ఇంటర్వ్యూ.....
నమ్మకం ఉంది...
- గరం సినిమా మొదలయినప్పుడు నాకు పెళ్ళైంది. ఇప్పుడు పాప కూడా పుట్టింది. నిజం చెప్పాలంటే నేను విషయాన్ని గమనించనే లేదు. ఈ సినిమాకు నిర్మాత నాన్నగారే. ఈ సినిమా నిర్మాతగా నాన్నగారికి మంచి పేరు తెస్తుంది. అంతే కాకుండా మంచి కమర్షియల్ సినిమాగా మంచి పేరు తీసుకొస్తుంది.
నిర్మాతగా మారడం వెనుక....
- సినిమాను ముందుగా రాజ్‌కుమార్ అనే నిర్మాతగారు ప్రారంభించారు. అయితే అనుకోని కారణాలతో సినిమా నుండి ఆయన తప్పుకున్నారు. అయితే సినిమా ప్రీ ప్రొడక్షన్ నుండి నేను బాగా ఇన్‌వాల్వ్ అయ్యాను. ఎప్పుడైతే సినిమా అనుకోని కారణాలతో ఆగిపోతుందని తెలిసిందో, నాన్నగారిని కలిసి, ఆయనకు పరిస్థితిని వివరించాను. దాంతో ఆయన నిర్మాతగా మారి సినిమాను పూర్తి చేశాం. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.
ఆలస్యం కావడానికి కారణమదే....
- సినిమాలో అందరూ పెద్ద నటీనటులే నటించారు. సినిమా మధ్యలో గ్యాప్ రావడంతో యాక్టర్స్ డేట్స్‌లో తేడా వచ్చింది. మళ్ళీ ఆర్టిస్ట్ డేట్స్ దొరికినప్పుడు సినిమాను పూర్తి చేసుకుంటూ వచ్చాం. ఇలా చేయడం వల్లే సినిమా ఆలస్యం అయింది తప్ప మరే కారణమూ లేదు.
అదే సినిమా కథాశం....
- ఈ సినిమాలో వారాల బాబు అనే క్యారెక్టర్ చేశాను. తండ్రితో తిట్లు తినే కుర్రాడు ఏదో సాధించాలని సిటీకి వస్తాడు. అక్కడ ఆ యువకుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనేదే సినిమా. ఈ సినిమాలో ఈస్ట్ గోదావరి స్లాంగ్‌లో మాట్లాడాను.
హీరోయిన్ ఆదాశర్మ గురించి....
- ఆదాశర్మ ముస్లిం యువతిగా నటించింది. సినిమాలో బురఖాలోనే కనపడుతుంది. అలాగే డ్యాన్సుల్లో పోటీ పడి చేసింది.
నిర్మాతగా కొనసాగుతారు...
- ఈ సినిమాతో నాన్నగారు నిర్మాతగా మారారు. భవిష్యత్‌లో కూడా ఆయన నిర్మాతగా మరిన్ని మంచి చిత్రాలు చేయాలని ఆలోచనలో ఉన్నారు. కమర్షియల్ సినిమాలు, ప్రేక్షకులు మెచ్చే చిత్రాలు చేయాలనేది ఆయన ఆలోచన.
సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందనుకుంటున్నాను...
- ఇప్పటి వరకు తెలుగు హీరోలు అందరూ చేసిన ఏడవ సినిమా పెద్ద హిట్స్‌గా నిలిచాయి. గరం సినిమా కూడా నాకు ఏడవ సినిమా. నా విషయంలో కూడా సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని అనుకుంటున్నాను.
తండ్రిగా హ్యపీ...
- తండ్రి అనే అనుభూతి చాలా గొప్పది. ఇప్పుడు ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్నాను. తండ్రి కావడం వల్ల నా తల్లిదండ్రులపై గౌరవం మరింత పెరిగింది.
నెక్ట్స్ ప్రాజెక్ట్..
- ప్రస్తుతం వీరభద్రం చౌదరి దర్శకత్వంలో చుట్టాలబ్బాయి సినిమా చేస్తున్నాను. ఇప్పుడు 40 శాతం పూర్తయింది. సినిమా అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోంది.