pizza

Natural Star Nani, Stylish Director Sujeeth, Venkat Boyanapalli, Niharika Entertainment, Unanimous Productions Ambitious Film #Nani34 Titled Bloody Romeo, Title Announcement Video Blows Minds
నేచురల్ స్టార్ నాని, స్టైలిష్ డైరెక్టర్ సుజీత్, వెంకట్ బోయనపల్లి, నిహారిక ఎంటర్టైన్మెంట్, యూనానిమస్ ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మక చిత్రం #నాని34 'బ్లడీ రోమియో', మైండ్ బ్లోయింగ్ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్

You are at idlebrain.com > news today >

24 February 2026
Hyderabad

Natural Star Nani, the man currently dominating Telugu cinema with back-to-back blockbusters, has unleashed the first, fiery announcement of his next ambitious venture-#Nani34, officially titled Bloody Romeo. The project, produced by Venkat Boyanapalli’s Niharika Entertainment in collaboration with Unanimous Productions, marks Nani’s first collaboration with stylish filmmaker Sujeeth, who recently delivered a massive hit with OG. To celebrate Nani’s birthday, the makers dropped a stunning comic-noir title glimpse, instantly setting the screen ablaze.

The visual language is drenched in deep purples and blood reds, signaling a film that is as much about aesthetic flair as it is about action. The promo introduces the protagonist in a kitchen, but as Vennela Kishore’s voiceover unfolds, it becomes clear that his "recipes" are metaphors for a violent temperament. By equates ingredients like "a pinch of mercy" and "a yard of chaos" with the act of cooking, the video suggests that the protagonist approaches his criminal life with the precision of a master chef. This juxtaposition reaches its climax when the mundane pressure cooker is revealed to be a ticking grenade, literally blowing the "Gangster's Den" apart.

Nani’s character emerges from the rubble not as a typical brawler, but as a witty and calculated force. The reveal of the card, which transitions from "No. 1 Chef" to "No. 1 Gangster," perfectly encapsulates the film's dual identity. The final shot of Nani coming out of washroom with London on board, lighting a cigar with a burning card further cements the "Romeo" persona- charming, dangerous, and perhaps a bit mad.

The promo concludes with a sophisticated title logo for Bloody Romeo, framed by intricate carvings and silhouettes of the London skyline. This suggests that Sujeeth is taking Nani’s "Natural Star" charisma to an international stage, likely blending the director’s signature large-scale action choreography with a character-driven, darkly comedic narrative. The quirky, yet electrifying score amplifies the visuals even more.

With production slated to begin this summer, the mind-blowing video has already set towering expectations for the film.

The other cast and crew of this dark action comedy will be revealed later.

Cast: Natural Star Nani

Technical Crew:
Writer, Director: Sujeeth
Producer: Venkat Boyanapalli
Banners: Niharika Entertainment, Unanimous Productions

నేచురల్ స్టార్ నాని, స్టైలిష్ డైరెక్టర్ సుజీత్, వెంకట్ బోయనపల్లి, నిహారిక ఎంటర్టైన్మెంట్, యూనానిమస్ ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మక చిత్రం #నాని34 'బ్లడీ రోమియో', మైండ్ బ్లోయింగ్ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్

వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని, తన తదుపరి ప్రతిష్టాత్మక వెంచర్ - #నాని34 టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి 'బ్లడీ రోమియో' అనే టైటిల్ పెట్టారు. యూనానిమస్ ప్రొడక్షన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఇటీవల OG తో భారీ విజయాన్ని అందించిన స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సుజీత్ తో నానికి ఇది ఫస్ట్ కొలాబరేషన్. నాని పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అద్భుతమైన కామిక్-నోయిర్ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

డీప్ పర్పుల్స్‌, బ్లడ్ రెడ్స్‌తో నిండిన ఈ విజువల్ లాంగ్వేజ్‌, ఈ సినిమా యాక్షన్‌తో పాటు స్టైలిష్ ఎస్తెటిక్ ఫ్లేర్‌కి ప్రాధాన్యం ఇస్తుందని ప్రజెంట్ చేస్తోంది. ప్రోమోలో హీరోను కిచెన్‌లో పరిచయం చేస్తారు. వెన్నెల కిషోర్ వాయిస్‌ ఓవర్ కొనసాగుతున్న కొద్దీ, అతని “రెసిపీలు” నిజానికి అతని హింసాత్మక స్వభావానికి ప్రతీకలని రివిల్ అవుతుంది. “చిటికెడు కరుణ”, “పిడికెడు కోపం” లాంటి పదార్థాలను వంటకంగా చూపిస్తూ, తన జీవితాన్ని ఓ మాస్టర్ చెఫ్ లా ప్రజెంట్ చేశారు. సాధారణంగా కనిపించే ప్రెషర్ కుక్కర్ ఒక్కసారిగా టైమ్ బాంబ్‌లా పేలిపోవడం ద్వారా “గ్యాంగ్‌స్టర్’స్ డెన్”ను ధ్వంసం చేయడం ఈ కాన్సెప్ట్‌కి క్లైమాక్స్‌గా నిలిచింది.

నాని పాత్ర ఒక ఫైటర్‌గా కాకుండా, దేనికి లెక్క చేయని పవర్ లా బయటి రావడం అదిరిపోయింది. “No.1 Chef” నుంచి “No.1 Gangster”గా మారే కార్డ్ రివీల్ సినిమా నేచర్ ని అద్భుతంగా చూపిస్తుంది. చివర్లో లండన్ నేపథ్యంతో వాష్‌రూమ్ నుంచి బయటకు వస్తూ, మండుతున్న కార్డ్‌తో సిగార్ వెలిగించే నాని షాట్ అతని “రోమియో”, డేంజర్ పర్సోనా ప్రజెంట్ చేసింది.

ప్రోమో చివర్లో లండన్ స్కైలైన్ సిల్హౌట్స్‌తో 'బ్లడీ రోమియో టైటిల్ లోగో కనిపించింది. ఇది సుజీత్, నాని “నేచురల్ స్టార్” ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నాడని సూచిస్తుంది. దర్శకుడి భారీ యాక్షన్ స్టైల్‌తో పాటు, డార్క్ కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్ డ్రైవన్ కథను మిళితం చేసి అద్భుతంగా చూపించబోతున్నారు.

ఈ వేసవిలో షూటింగ్ ప్రారంభం కానుంది, ఈ మైండ్ బ్లోయింగ్ వీడియో సినిమాపై భారీ అంచనాలను సెట్ చేసింది.

బ్లడీ రోమియో ఇతర తారాగణం, సిబ్బంది వివరాలు మేకర్స్ త్వరలోనే తెలియజేస్తారు.

తారాగణం: నేచురల్ స్టార్ నాని
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: సుజీత్
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
బ్యానర్లు: నిహారిక ఎంటర్టైన్మెంట్, యూనానిమస్ ప్రొడక్షన్స్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved