pizza

Everyone will come for Brahmanandam garu, but they will leave talking about Raja Goutham," says producer Rahul Yadav Nakka about Brahma Anandam
బ్రహ్మానందం కోసం వస్తారు.. రాజా గౌతమ్‌ను ఇంటికి తీసుకెళ్తారు.. మీడియాతో ‘బ్రహ్మా ఆనందం’ నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా

You are at idlebrain.com > news today >

08 February 2025
Hyderabad

After the hat-trick hits like Malli Raava, Agent Sai Srinivasa Athreya, and Masooda, the film Brahma Anandam is set to release on February 14, under the banner of Swadharm Entertainment. The film stars Padma Shri awardee Brahmanandam and his son Raja Goutham in lead roles, with Priya Vadlamani and Aishwarya Holakkal playing key roles. Produced by Smt. Savitri and Sri Umesh Kumar, the film is directed by debutant Rvs Nikhil. The successful producer Rahul Yadav Nakka has produced the film on a grand scale. As part of the promotions, producer Rahul Yadav Nakka interacted with media about the film.

“We struggled to find a perfect title for the film. Finally, we decided on ‘Brahma Anandam.’ The co-directors in our team helped design the title. I’ve produced every film of mine on my own, and this film is no different. I haven’t collaborated with anyone on this.”

“I really liked the grandfather-grandson relationship in the story. It promises great entertainment with good emotion. My own grandfather also wanted to see me succeed, but he passed away just before I could return. I chose this story as a tribute to him.”

“The director came to me with the title ‘Brahma Anandam.’ I told him that if Brahmanandam garu didn’t act in the film, we couldn’t proceed. He agreed. After hearing the story, Brahmanandam garu liked it a lot. He will be portraying a role and enacting emotions never seen before.”

“Currently, Brahmanandam garu is being very selective about the roles he takes up. After watching Rangamarthanda, the audience’s perception of Brahmanandam garu changed. People often think comedians only make people laugh, but Brahmanandam garu is a fantastic actor. He loved the story and immediately agreed to join.”

“We approached several actors for the hero role, but Brahmanandam garu recommended Vennela Kishore’s name. We sent him the script, and after reading it, Vennela Kishore garu suggested that the character of Giri, a friend, would suit him better than the hero role. That’s when Raja Goutham’s name came up. Initially, I had doubts, but after meeting him, my opinion changed.”

“When you make a film with proper calculations, profits are assured. You need to know your target audience. If you make a film with a limited budget and within a short time frame, profits are guaranteed. I’m not aiming for massive profits. As long as the money invested is returned, that’s enough. I don’t need to make one hundred crore rupees. Even twenty crores is enough.”

“As for Brahma Anandam, I won’t talk about hits and flops. Everyone will come for Brahmanandam, but they will leave talking about Raja Goutham. They’ll talk about his performance and acting. I’m sure of it.”

“The film portrays a beautiful relationship between a grandfather and his grandson. In it, the grandfather realizes the mistakes he has made, and the grandson also learns from his own mistakes. It’s an entertaining story with a meaningful message that will appeal to everyone.”

“As a producer, it’s my responsibility to read the script and understand the story. It’s also my duty to ensure that the right technicians are on board to create a quality film.”

“I’m also working on a film titled Vibe with Raja Goutham. This film is being directed by the same director as Agent Sai Srinivasa Athreya. After Braha Anandam releases, the audience will truly understand Raja Goutham’s potential. Though there will be several changes during story discussions, we’ll ensure the essence of the story remains intact.”

“Brahma Anandam has been wonderfully directed by Rvs Nikhil. He has managed the large cast extremely well. Nikhil has done an excellent job working with legendary actors. Some may find it routine, but the scenes between Brahmanandam garu, Vennela Kishore, and Raja Goutham will surely resonate with everyone.”

బ్రహ్మానందం కోసం వస్తారు.. రాజా గౌతమ్‌ను ఇంటికి తీసుకెళ్తారు.. మీడియాతో ‘బ్రహ్మా ఆనందం’ నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా

మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హ్యాట్రిక్ హిట్ల తరువాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ‘బ్రహ్మా ఆనందం’ అనే చిత్రం ఫిబ్రవరి 14న రాబోతోంది. ఈ చిత్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీమతి సావిత్రి,శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో రూపొందించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు Rvs నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు. విజయవంతమైన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మీడియాతో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఆయన ఏం చెప్పారంటే?

* ‘బ్రహ్మానందం’ టైటిల్ మాకు దొరకలేదు. ‘బ్రహ్మా ఆనందం’ అని చివరకు మార్చాను. మా టీంలోని కో డైరెక్టర్ వీరు ఆ టైటిల్‌ను డిజైన్ చేశారు. నా ప్రతీ సినిమాను సొంతంగానే నిర్మించాను. ఈ మూవీని కూడా నా బ్యానర్ మీదే సొంతంగానే తీశాను. ఎలాంటి కొలాబరేషన్ పెట్టుకోలేదు.

* తాత, మనవడు రిలేషన్, కథ నాకు బాగా నచ్చింది. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మా తాత కూడా నన్ను సక్సెస్ ఫుల్‌గా చూడాలని అనుకున్నారు. కానీ మళ్లీ రావా టైంలోనే ఆయన స్వర్గస్తులయ్యారు. మా తాత గారికి నివాళిలా ఈ సినిమా ఉంటుందని కథకు ఓకే చెప్పా.

* బ్రహ్మానందం అనే టైటిల్‌తోనే దర్శకుడు అప్రోచ్ అయ్యారు. బ్రహ్మానందం గారు నటించకపోతే ఈ సినిమా తీయలేం. అదే విషయాన్ని ఆయనకు కూడా చెప్పాం. కథ విన్న తరువాత బ్రహ్మానందం గారికి కూడా చాలా నచ్చింది. ఇంత వరకు ఆయన్ను చూడనటువంటి పాత్రల్లో, ఎమోషన్స్‌లో చూస్తారు.

* ప్రస్తుతం బ్రహ్మానందం గారు ఎక్కువగా సినిమాల్ని చేయడం లేదు. చాలా సెలెక్టివ్‌గా పాత్రల్ని ఎంచుకుంటున్నారు. రంగమార్తాండ చూశాక ఆడియెన్స్‌ బ్రహ్మానందం గారిని చూసే కోణం మారిపోయింది. కమెడియన్ అంటే కేవలం నవ్విస్తారనే ముద్ర వేస్తాం. కానీ బ్రహ్మానందం గారు అద్భుతమైన నటులు. ఈ కథ నచ్చి బ్రహ్మానందం గారు వెంటనే ఓకే చెప్పారు.

* హీరో పాత్ర కోసం చాలా మందిని ట్రై చేశాం. వెన్నెల కిషోర్ గారి పేరుని బ్రహ్మానందం గారు రికమండ్ చేశారు. ఆయనకు కూడా స్క్రిప్ట్ పంపాం. ఆయన స్క్రిప్ట్ చదువుకున్నారు. హీరో బ్రహ్మా కారెక్టర్ కాకుండా.. ఫ్రెండ్ కారెక్టర్ గిరి బాగుంటుంది చేస్తానని వెన్నెల కిషోర్ గారు అన్నారు. ఆ తరువాత రాజా గౌతమ్ గారి పేరు చర్చల్లోకి వచ్చింది. కానీ అతను చేస్తే బాగుంటుందా?అని నాలో అనుమానం కలిగింది. కానీ రాజాని కలిసిన తరువాత అభిప్రాయం మారింది. అతని షేక్ హ్యాండ్ ఇచ్చిన విధానం నాకు చాలా నచ్చింది.

* సినిమాని కొన్ని లెక్కలతో తీస్తే కచ్చితంగా లాభాలు వస్తాయి. మనం ఎవరిని టార్గెట్ చేస్తున్నామో తెలుసుకోవాలి. లిమిటెడ్‌ బడ్జెట్‌తో, తక్కువ రోజుల్లో సినిమా చేస్తే కచ్చితంగా లాభాలు వస్తాయి. నాకు పెద్ద లాభాలు రావాలని కూడా ఉండదు. పెట్టిన డబ్బులు వస్తే చాలు అనుకుంటా. కోటి మంది ఆడియెన్స్ ఉన్నారనుకుంటే.. వంద రూపాయలు సగటు అనుకుంటే.. వంద కోట్ల కలెక్షన్స్ వస్తాయి.. కానీ నాకు ఆ వంద కోట్లు అవసరం లేదు. నాకు ఓ ఇరవై కోట్లు వచ్చినా చాలు.

* బ్రహ్మా ఆనందం సినిమా విషయానికి వస్తే నేను హిట్లు, ఫ్లాపు గురించి చెప్పను. ఈ మూవీకి అందరూ బ్రహ్మానందం కోసం వస్తారు. కానీ ఇంటికి వెళ్లేటప్పుడు మాత్రం రాజా గౌతమ్‌ను తీసుకెళ్తారు. అతని పర్ఫామెన్స్, యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటారు. అందరూ అతనిపై ప్రశంసలు కురిపిస్తారు. ఇది మాత్రం కచ్చితంగా చెప్పగలను.

* తాత, మనవళ్ల కథ ఇది. ఇందులో తాత తాను చేసిన తప్పుల్ని రియలైజ్ అవుతాడు. మనవడు కూడా తన తప్పుల్ని తెలుసుకుంటాడు. ఓ అందమైన కథ. వినోదాత్మకంగా ఉంటుంది. మంచి సందేశం కూడా ఉంటుంది. అందరినీ ఎంటర్టైన్ చేసేలా ఉంటుంది.

* స్క్రిప్ట్ చదవడం, కథ తెలుసుకోవడం అనేది నిర్మాత ప్రథమ బాధ్యత. సినిమాకు ఏ టెక్నిషియన్ ఉంటే బాగుందో చర్చించడం, మంచి సినిమాను జాగ్రత్తగా తీయడం అనేది నిర్మాత బాధ్యత.

* రాజా గౌతమ్‌తోనే మళ్లీ వైబ్ అనే ఓ సినిమాను చేస్తున్నాను. ఈ చిత్రాన్ని ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దర్శకుడు తెరెకెక్కిస్తున్నారు. బ్రహ్మానందం సినిమా తరువాత ఆడియెన్స్‌కు రాజా గౌతమ్ ఏంటో అర్థం అవుతుంది. కథా చర్చలు జరిగే టైంలో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. కానీ ఆ కథలోని సోల్ మిస్ కాకుండా చూసుకుంటాం.

* బ్రహ్మా ఆనందం సినిమాను Rvs నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు. భారీ తారాగణంను చక్కగా హ్యాండిల్ చేశారు. లెజెండరీ యాక్టర్లతో నిఖిల్ అద్భుతంగా చేయించుకున్నాడు. రొటీన్ అని కొంత మంది అనుకోవచ్చు. కానీ బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ గారు, రాజా గౌతమ్ పాత్రల మధ్య సీన్లకు అందరూ కనెక్ట్ అవుతారు.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved