03 January 2025
Hyderabad
Bellamkonda Sai Sreenivas’ Adventurous Character Poster From Ludheer Byreddy, Mahesh Chandu, Shiven Ramakrishna, Moonshine Pictures Pan India Film #BSS12 Unveiled On His Birthday
Action-Hulk Bellamkonda Sai Sreenivas' prestigious project, #BSS12, directed by debutant Ludheer Byreddy and produced by Mahesh Chandu under the Moonshine Pictures banner, has completed 35% of the shoot. #BSS12 presented by Shiven Ramakrishna marks the highest budgeted film to date for Bellamkonda Sai Sreenivas.
The makers on the special occasion of Bellamkonda Sai Sreenivas’ birthday unveiled his character poster, presenting him in an adventurous avatar. Riding a bike with both legs perched on the seat, he exudes a sense of audacity and fearlessness. The backdrop intensifies the moment- a vast valley stretches out in front of him, while a hill behind him blazes fiercely, taking the shape of Lord Vishnu's Namalu. This powerful scene heightens the sense of danger, adventure, and spiritual energy. Movie buffs can expect an unforgettable cinematic journey as Bellamkonda takes on a role full of daring feats and intense action.
This occult thriller, set around a 400-year-old dasavatara temple, features Samyuktha in the female lead role. The film boasts a team of seasoned professionals handling various aspects of production. Shivendra is the cinematographer, Leon James composes the music, Karthika Srinivas R is the editor, and Srinagendra Tangala is the art director.
Cast: Bellamkonda Sai Sreenivas, Samyuktha
Technical Crew:
Writer, Director: Ludheer Byreddy
Producer: Mahesh Chandu
Banner: Moonshine Pictures
Presents: Shiven Ramakrishna
DOP: Shivendra
Music: Leon James
Editor: Karthika Srinivas R
Art: Srinagendra Tangala
Publicity Designer: Ananth Kancherla
.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా లూధీర్ బైరెడ్డి, మహేష్ చందు, శివన్ రామకృష్ణ, మూన్‌షైన్ పిక్చర్స్ పాన్ ఇండియా ఫిల్మ్ #BSS12 నుంచి అడ్వంచర్ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్
యాక్షన్-హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #BSS12 35% షూటింగ్ పూర్తి చేసుకుంది. డెబ్యుటెంట్ లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. శివన్ రామకృష్ణ సమర్పిస్తున్న #BSS12 బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ లో హయ్యస్ట్ బడ్జెట్ మూవీ.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అతని క్యారెక్టర్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు, అతన్ని అడ్వంచర్ అవతార్‌లో ప్రెజెంట్ చేశారు. రెండు కాళ్లను సీటుపై పెట్టుకుని బైక్‌ను నడుపుతూ ధైర్యంగా దూసుకెలుతున్న లుక్ అదిరిపోయింది. బ్యాక్ గ్రౌండ్ మూమెంట్ ఇంటెన్సిటీ పెంచింది. ఒక విశాలమైన లోయ, అతని వెనుక ఒక కొండపై విష్ణువు నామాలు కనిపించడం అద్భుతంగా వుంది. ఈ పవర్ ఫుల్ విజువల్ డేంజర్, అడ్వంచర్, డివైన్ ఎనర్జీని ప్రజెంట్ చేస్తోంది. బెల్లంకొండ అడ్వంచర్ స్టంట్స్ ఇంటెన్స్ యాక్షన్‌లతో కూడిన పాత్రను పోషిస్తున్నందున ప్రేక్షకులు మరపురాని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని ఆశించవచ్చు.
ఈ ఒకల్ట్ థ్రిల్లర్ 400 ఏళ్ల నాటి దశావతార ఆలయం నేపధ్యంలో వుంటుంది, ఇందులో సంయుక్త ఫీమేల్ లీడ్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. శివేంద్ర సినిమాటోగ్రాఫర్, లియోన్ జేమ్స్ సంగీతం, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్.
నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సంయుక్త
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: లుధీర్ బైరెడ్డి
నిర్మాత: మహేష్ చందు
బ్యానర్: మూన్‌షైన్ పిక్చర్స్
సమర్పణ: శివన్ రామకృష్ణ
డీవోపీ: శివేంద్ర
సంగీతం: లియోన్ జేమ్స్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల
పబ్లిసిటీ డిజైనర్: అనంత్ కంచెర్ల
|