pizza

Victory Venkatesh Launched First Single Habibi Jilebi From Roshan Kanakala, Maanasa Choudhary’s Bubblegumవ
ిక్టరీ వెంకటేష్ లాంచ్ చేసిన రోషన్ కనకాల, మానస చౌదరి ‘బబుల్‌గమ్’ ఫస్ట్ సింగిల్ హబీబీ జిలేబి సాంగ్

You are at idlebrain.com > news today >
Follow Us

3 November 2023
Hyderabad

Roshan Kanakala’s debut film Bubblegum under the direction of Ravikanth Perepu is getting ready for its theatrical release. The musical journey of the movie begins with Victory Venkatesh launching the first single Habibi Jilebi. The star extended best wishes to the team.

Sricharan Pakala who is a specialist in scoring melody numbers has rendered a mass and youth-appealing peppy track, giving scope to the lead pair to exhibit their dancing prowess. Roshan Kanakala utilized the opportunity to the optimum and enacted superb dance moves.

Renowned Rahul Sipligunj pumped in extra energy with his high-pitch vocals, while lyrics were penned by the happening lyricist Kasarla Shyam. This peppy track is a musical and visual treat for Telugu cinema lovers.

"Bubblegum" is set to captivate audiences with a heartwarming GenZ love story. As the film unfolds, it promises to take you on a romantic journey like no other. With a talented cast and a stellar technical crew, "Bubblegum" is poised to be a must-watch in the world of Telugu cinema.

Suresh Ragutu who has previously worked for Garuda Vega, Thellavarithe Guruvaram and Aakashavaani is the Director of Photography.

Maheshwari Movies in association with People Media Factory is producing the film which is slated for release on December 29th.

Cast: Roshan Kanakala, Maanasa Choudhary, Harsha Chemudu, Kiran G, Anannyaa Akulaa, Harshvardhan, Anu Hasan, Chaitu Jonnalagadda, Bindu Chandramouli and others.

Technical Crew:
Written & Directed: Ravikanth Perepu
Story: Ravikanth Perepu, Vishnu Kondur & Seri-Ganni
Banners: Maheshwari Movies, People Media Factory
Music: Sricharan Pakala
Director of Photography: Suresh Ragutu
Production Design: Shivam Rao
Screenplay Consultant: Vamsi Krishna
Creative Producer: Divya Vijay

విక్టరీ వెంకటేష్ లాంచ్ చేసిన రోషన్ కనకాల, మానస చౌదరి ‘బబుల్‌గమ్’ ఫస్ట్ సింగిల్ హబీబీ జిలేబి సాంగ్

రోషన్ కనకాల తొలి చిత్రం ‘బబుల్‌గమ్‌’ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో విడుదలకు సిద్ధమవుతోంది. అగ్రహీరో విక్టరీ వెంకటేష్ ‘బబుల్‌గమ్’ ఫస్ట్ సింగిల్ హబీబీ జిలేబీ సాంగ్ ని లాంచ్ చేయడంతో సినిమా మ్యూజికల్ జర్నీ మొదలైయింది. ఈ సందర్భంగా వెంకటేష్ చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలియజేశారు.

శ్రీచరణ్ పాకాల మాస్, యూత్-ఆకట్టుకునే పెప్పీ ట్రాక్‌ గా కంపోజ్ చేసిన ఈ పాట లీడ్ పెయిర్ డ్యాన్స్ పెర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఇచ్చింది. రోషన్ కనకాల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్ తో ఆకట్టుకున్నారు.

పాపులర్ సింగల్ రాహుల్ సిప్లిగంజ్ తన హై-పిచ్ వోకల్స్ తో అదనపు ఎనర్జీని నింపారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ ఆకట్టుకున్నాయి. ఈ పెప్పీ ట్రాక్ తెలుగు సినిమా ప్రేమికులకు మ్యూజిక్, విజువల్ ట్రీట్.

మనసుని హత్తుకునే జెన్జీ ప్రేమకథతో ప్రేక్షకులను కట్టిపడేసేలా "బబుల్‌గమ్" రూపొందించారు. సరికొత్త రొమాంటిక్ జర్నీతో ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకోనుంది. ప్రతిభావంతులైన తారాగణం, అద్భుతమైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్న "బబుల్‌గమ్" తప్పకుండా చూడదగ్గ చిత్రంగా ఉండబోతుంది.

గరుడవేగ, తెల్లవారితే గురువరం, ఆకాశవాణి చిత్రాలకు పనిచేసిన సురేష్ రగుతు ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది.

తారాగణం: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి తదితరులు.

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: రవికాంత్ పేరేపు
కథ: రవికాంత్ పేరెపు, విష్ణు కొండూరు, సెరి-గన్ని
బ్యానర్లు: మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: శ్రీచరణ్ పాకాల
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సురేష్ రగుతు
ఆర్ట్ డైరెక్టర్: విఠల్ కొసనం
ప్రొడక్షన్ డిజైన్: శివమ్ రావు
స్క్రీన్ ప్లే కన్సల్టెంట్: వంశీ కృష్ణ
క్రియేటివ్ ప్రొడ్యూసర్: దివ్య విజయ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మధులిక సంచన లంక
పబ్లిసిటీ డిజైన్: అనంత్ కంచెర్ల


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved