`
pizza

Butta Bomma, produced by Sithara Entertainments and Fortune Four Cinemas, to release worldwide on January 26,2023
26, జనవరి 2023 "బుట్ట బొమ్మ" విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

17 December 2022
Hyderabad

Anikha Surendran, Surya Vashistta and Arjun Das starrer Butta Bomma release date announced

Sithara Entertainments, the leading production house that has backed several quality films in recent years, joins hands with Fortune Four Cinemas for a rural drama titled Butta Bomma. Anikha Surendran, Surya Vashistta and Arjun Das play the lead roles in the film directed by debutant Shourie Chandrasekhar Ramesh. The makers of Butta Bomma announced the film’s release date today. Butta Bomma will hit screens across the globe on January 26, 2023.

An intense poster featuring Anikha Surendran, Surya Vashistta and Arjun Das was unveiled to confirm the release date. The partially black-and-white poster indicates a girl whose life revolves around two men. The teaser of the feel-good saga, launched recently, opened to good responses from viewers and trade circles alike. There’s good buzz that Butta Bomma will be another strong content-oriented tale coming from two prestigious banners.

The teaser indicated that the tale is about Satya, an innocent rural girl who’s the apple of everyone’s eyes and later falls in love with an auto driver. However, the arrival of the antagonist invites tension and drama into her life. Where is the tale headed? Gopi Sundar scores the music for the film. Navya Swami, Narra Srinu, Pammi Sai, Karthik Prasad, Vasu Inturi, Mirchi Kiran, Kancharapalem Kishore and Madhumani essay supporting roles.

The film has cinematography by Vamsi Patchipulusu and is produced by S Naga Vamsi and Sai Soujanya. Ganesh Kumar Ravuri, the writer who shot to fame with Varudu Kavalenu, pens the dialogues.

Crew:
Cinematography: Vamsi Patchipulusu
Music: Gopi Sundar
Dialogues: Ganesh Kumar Ravuri
Lyrics: Shreemani, S Bharadwaja Pathrudu
Editor: Navin Nooli
Production designer: Vivek Annamalai
Production controller: C H Ramakrishna Reddy
PRO: Lakshmi Venugopal
Producers: S Naga Vamsi and Sai Soujanya
Director: Shourie Chandrasekhar Ramesh

26, జనవరి 2023 "బుట్ట బొమ్మ" విడుదల

*అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట ల తో 'సితార ఎంటర్ టైన్ మెంట్స్' , ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‘..."బుట్ట బొమ్మ"

* "బుట్ట బొమ్మ" గా అనిక సురేంద్రన్
* అర్జున్ దాస్, సూర్య వశిష్ట లు కథా నాయకులు
*శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు గా పరిచయం

వరుస చిత్రాల నిర్మాణం లోనే కాక, వైవిధ్యమైన చిత్రాల నిర్మాణ సంస్థ గా టాలీవుడ్ లో ప్రఖ్యాతి గాంచిన 'సితార ఎంటర్ టైన్ మెంట్స్' ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలసి నిర్మిస్తున్న మరో చిత్రం "బుట్ట బొమ్మ"

అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట లు నాయిక, నాయకులుగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి
నాగ‌వంశీ ఎస్‌. - సాయి సౌజ‌న్య‌ నిర్మాతలు. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు గా పరిచయం అవుతున్నారు.

నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న "బుట్ట బొమ్మ" విడుదల తేదీ ప్రచార చిత్రం ను ఈ రోజు అధికారికంగా సామాజిక మాధ్యమం వేదికగా విడుదల చేసింది చిత్ర బృందం.

విడుదలైన ప్రచార చిత్రం ను పరికిస్తే... ఆకట్టుకోవడంతో పాటు, ఆసక్తిని రేకెత్తిస్తుంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ మాట్లాడుతూ...‘బుట్ట బొమ్మ‘ గా అనిక సురేంద్రన్, అలాగే అర్జున్ దాస్, సూర్య వశిష్ట ల పాత్రలు గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథ లో సహజంగా సాగుతూ ఆకట్టుకుంటాయి. గుర్తుండి పోతాయి.‘ప్రేమ' లోని పలు సున్నితమైన పార్శ్వాలను స్పృశిస్తూ చిత్ర కథ, కథనాలు ఉంటాయి అని తెలిపారు.

చిత్రం లోని ప్రధాన పాత్రల తీరు తెన్నులు, అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట ల అభినయం కథానుగుణంగా ఆకట్టుకుంటుంది. అలాగే పాత్రోచితంగా సాగే సంభాషణలు చిత్రం పై మరింత ఆసక్తిని కలిగిస్తాయి. వీటితో పాటు వంశీ పచ్చి పులుసు ఛాయాగ్రహణం, గోపిసుందర్ సంగీతం చిత్రాన్ని మరో మెట్టెక్కిస్తాయి అని నమ్మకంగా చెప్పొచ్చు.
సంభాషణల రచయిత గా ‘ వరుడు కావలెను‘ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న గణేష్ కుమార్ రావూరి ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నారు. సంభాషణల్లో తనదైన బాణీ పలికించటానికి ఆయన పడే తపన ఈ చిత్రంలో స్పష్టమవుతుంది.

చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరి 26 న విడుదల అవుతున్న ఈ చిత్రం సినీ అభిమాన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది, అలరిస్తుందని తెలిపారు నిర్మాతలు.

అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట నాయిక, నాయకులుగానటిస్తున్న ఈ చిత్రంలో
నవ్య స్వామి, నర్రాశ్రీను, పమ్మి సాయి, కార్తీక్ ప్రసాద్, వాసు ఇంటూరి,ప్రేమ్ సాగర్, మిర్చి కిరణ్, కంచెర్ల పాలెం కిషోర్, మధుమణి తదితరులు ఇతర ప్రధాన పాత్రధారులు.

సాంకేతిక నిపుణులు:
ఛాయాగ్రహణం: వంశీ పచ్చి పులుసు
సంగీతం: గోపిసుందర్
మాటలు: గణేష్ కుమార్ రావూరి
పాటలు: శ్రీమణి, ఎస్. భరద్వాజ్ పాత్రుడు
ఎడిటర్: నవీన్ నూలి
పోరాటాలు : డ్రాగన్ ప్రకాష్
ప్రొడక్షన్ డిజైనర్: వివేక్ అన్నామలై
ప్రొడక్షన్ కంట్రోలర్: సి హెచ్. రామకృష్ణా రెడ్డి
పి.ఆర్.ఓ: లక్ష్మీవేణుగోపాల్
నిర్మాత‌లు: నాగ‌వంశీ ఎస్‌. - సాయి సౌజ‌న్య‌
దర్శకత్వం: శౌరి చంద్రశేఖర్ రమేష్

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved