3 December 2022
Hyderabad
Speaking on the occasion, Mr. Owen congratulated Sri. Chiranjeevi Garu for winning the prestigious award. He also praised Sri. Chiranjeevi Garu for his social activities that are continually saving thousands of lives. He said that he hopes to work together with Chiranjeevi Garu to enable the Film Industry to have great relations with Britain.
Thanking Mr. Owen, Sri. Chiranjeevi Garu said that it is a great honour to have British High Commission team to visit Chiranjeevi Charitable Trust and said that this will inspire thousands more to follow in their noble steps of donating blood. He explained that he takes more pride in the work done by Chiranjeevi Charitable Trust then of a blockbuster hit film. He said that since its inception 10 lakh units of blood have been donated. He also said that 9060 people eye sight could be restored due to the eye bank. He explained that CCT oxygen banks in 32 districts enabled free availability of oxygen cylinders helping the Telugu states overcome the shortage of oxygen during the peak of the pandemic.
Dr. Madhavi Garu, CEO of Chiranjeevi Charitable Trust thanked the British Deputy High Commissioner Mr. Owen for visiting the facility and donating blood. She said that Chiranjeevi Charitable Trust looks forward to doing more joint activities with British High Commission in the future.
చిరంజీవి 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022' అవార్డును అందుకున్న సందర్భంగా బ్రిటీష్ డిప్యూటీ హైకమీషనర్ Mr. గారెత్ విన్ ఓవెన్ ఈరోజు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌ని సందర్శించి చిరంజీవి గారిని అభినందించారు.
ఈ సందర్భంగా శ్రీ ఓవెన్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన అవార్డు గెలుచుకున్నందుకు చిరంజీవి గారికి నా అభినందనలు మరియు నిత్యం వేలాది మంది ప్రాణాలను కాపాడుతు నిత్యం సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిరంజీవి గారిని ప్రశంసించారు. అంతేకాకుండా బ్రిటన్ ప్రభుత్వంతో తెలుగు సినీ పరిశ్రమ గొప్ప సంబంధాలను నెలకొల్పేందుకు చిరంజీవి గారితో కలిసి పని చేయాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
శ్రీ ఓవెన్‌కి ధన్యవాదాలు తెలుపుతూ చిరంజీవి గారు మాట్లాడుతూ బ్రిటీష్ హైకమిషన్ బృందం చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌ను సందర్శించడం గొప్ప గౌరవమని మరియు వేలాది మంది రక్తదానం చేసే వారికి ఇది స్ఫూర్తినిస్తుందని అన్నారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ప్రారంచినందుకు తాను మరింత గర్వపడుతున్నానని ఆయన అన్నారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు పది లక్షల యూనిట్ల రక్తదానం చేశామన్నారు. అలాగే నేత్ర బ్యాంకు వల్ల 9060 మందికి కంటి చూపు పునరుద్ధరింపబడుతుందన్నారు. 32 జిల్లాల్లోని సీసీటీ ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా ఆక్సిజన్ సిలిండర్‌లను ఉచితంగా అందుబాటులోకి తెచ్చామని, తెలుగు రాష్ట్రాలు కరోనా మహమ్మారి ఉన్న సమయంలో ఆక్సిజన్ కొరతను అధిగమించడంలో సహాయపడింది అని ఆయన వివరించారు.
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ CEO డాక్టర్ మాధవి గారు మాట్లాడుతూ
బ్రిటిష్ డిప్యూటీ హైకమీషనర్ మిస్టర్ ఓవెన్ గారు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ సందర్శించినందుకు ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ భవిష్యత్తులో బ్రిటీష్ హైకమిషన్‌తో కలిసి మరిన్ని ఉమ్మడి కార్యకలాపాలు చేసేందుకు ఎదురుచూస్తోందని ఆమె అన్నారు.