8 February 2024
Hyderabad
Joining the long slate of Telugu comedy actors who have turned male leads, talented actor Vennela Kishore is debuting as the main protagonist with spy comedy, Chari 111.
The makers of Chari 111 have dropped the much anticipated update on the film as they announced that the spy comedy is set for its theatrical release on March 1st. The makers unveiled an intriguing poster of the film to publicize the release date and it has the March 1 release plan imprinted on it.
Chari 111 has Vennela Kishore and Tollywood debutante Samyuktha Viswanathan in the lead roles and it is directed by TG Keerthi Kumar who had earlier directed Sumanth Akkineni's Malli Modalaindi. Aditi Soni under Barkat Studios banner is producing the film and the music is by Simon K King. The trailer for the film will be out early next week.
With the film headed for its theatrical release in a few more weeks, the makers are planning to unveil the trailer for the film. The trailer is likely to be out early next week. More promotional material will follow after the arrival of the trailer.
Starring: Vennela Kishore, Murali Sharma, Samyuktha Viswanathan, Satya, Thagubothu Ramesh, Brammaji, Rahul Ravindran, Pavani Reddy, Chaitanya
Crew
Banner: Barkat Studios
Producer: Aditi Soni
Written & Directed by TG Keerthi Kumar
Music: Simon K King
Director of Photography: Kashish Grover
Editor: Richard A Kevin
Production Design: Akshata B Hosur
Lyrics: Ramajogayya Sastry
Stunts: Karunakar
Costumes: Aditi Soni
Styling: Mouna Gummadi
Executive Producer: Balu Komiri
Sound Design: Jai Ganesh
Sound Mixing: Kannan Ganpath
VFX Company: Giraffe
VFX Supervisor: Deva Satya
Publicity Designs: Akshay
మార్చి 1న 'వెన్నెల' కిశోర్ హీరోగా నటించిన 'చారి 111' విడుదల
'వెన్నెల' కిశోర్ హీరోగా నటిస్తున్న సినిమా 'చారి 111'. టీజీ కీర్తి కుమార్ దర్శకుడు. సుమంత్ హీరోగా 'మళ్ళీ మొదలైంది' వంటి ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ తీసిన తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. ఇందులో సంయుక్తా విశ్వనాథన్ కథానాయిక. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మార్చి 1న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు.
'చారి 111' రిలీజ్ డేట్ పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా, ప్రేక్షకుల్లో క్యూసియాసిటీ కలిగించే విధంగా డిజైన్ చేశారు. థియేటర్లలోకి గూఢచారిగా ప్రేక్షకుల్ని నవ్వించడానికి 'వెన్నెల' కిశోర్ వస్తున్నట్లు ఉంది. ఈ జనరేషన్ కమెడియన్లలో తనకంటూ సపరేట్ కామెడీ స్టైల్ క్రియేట్ చేసుకున్న ఆయన... ఈ సినిమాలో ఏ విధంగా నవ్విస్తారో థియేటర్లలో చూడాలి.
'చారి 111' ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కన్‌ఫ్యూజ్ అయ్యే గూఢచారిగా 'చారి' పాత్రలో వెన్నెల కిశోర్ కనిపిస్తారని దర్శక నిర్మాతలు తెలిపారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే యాక్షన్ సినిమా తీశామని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు.
చిత్ర దర్శకుడు టీజీ కీర్తి కుమార్ మాట్లాడుతూ ''ఇదొక స్పై యాక్షన్ కామెడీ సినిమా. సిల్లీ మిస్టేక్స్ చేసే ఒక స్పై పెద్ద కేసును ఎలా సాల్వ్ చేశాడనేది సినిమా. వెన్నెల కిశోర్, సంయుక్తా విశ్వనాథన్ స్పై రోల్స్ చేశారు. వాళ్లకు బాస్ రోల్ మురళీ శర్మ చేశారు. కథలో ఆయనది కీలక పాత్ర'' అని చెప్పారు.
చిత్ర నిర్మాత అదితి సోనీ మాట్లాడుతూ ''స్పై జానర్ సినిమాల్లో 'చారి 111' కొత్తగా ఉంటుంది. 'వెన్నెల' కిశోర్ గారి నటన, టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం సినిమాకు హైలైట్ అవుతాయి. మార్చి 1న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అతి త్వరలో ట్రైలర్, పాటలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా 'చారి 111' పాటలు విడుదల కానున్నాయి.
'వెన్నెల' కిశోర్, సంయుక్తా విశ్వనాథన్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్, పావని రెడ్డి, 'తాగుబోతు' రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఎడిటింగ్ : రిచర్డ్ కెవిన్ ఎ, స్టంట్స్ : కరుణాకర్, ప్రొడక్షన్ డిజైన్ : అక్షత బి హొసూరు, పీఆర్వో : పులగం చిన్నారాయణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బాలు కొమిరి, సాహిత్యం : సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి, సినిమాటోగ్రఫీ : కషిష్ గ్రోవర్, సంగీతం : సైమన్ కె కింగ్, నిర్మాణ సంస్థ : బర్కత్ స్టూడియోస్, నిర్మాత : అదితి సోనీ, రచన, దర్శకత్వం : టీజీ కీర్తీ కుమార్.