Chennai Love Story audio rights have fetched a record price, with T-Series South Music acquiring them at a premium rate
మిడ్ రేంజ్ చిత్రాల్లో ఆడియో రైట్స్ కు హయ్యెస్ట్ ప్రైస్ దక్కించుకున్న "చెన్నై లవ్ స్టోరీ", ఈ చిత్ర ఆడియో హక్కులను ఫ్యాన్సీ రేట్ కు సొంతం చేసుకున్న టీ సిరీస్ సౌత్ మ్యూజిక్ లేబుల్
Starring Kiran Abbavaram and Sri Gouri Priya, and produced by the makers behind cult classics like Colour Photo and Baby, the film is directed by Ravi Namburi and presented by Amrutha Productions and Mass Movie Makers under the banner of SKN and Sai Rajesh. With Sai Rajesh providing the story, Chennai Love Story has already created a buzz with its initial glimpses. The news of the audio rights being sold at a high price has further added to the excitement.
The melodious music is composed by Brahma Mani Sharma, and the audio rights have been acquired by T-Series South Music at a premium - an unprecedented rate for a mid-range film. Given that Baby was not only a cult blockbuster at the box office but also won two National Awards, and Colour Photo won a National Award as well, the combination of Kiran Abbavaram and Sai Rajesh has garnered strong trade interest. Kiran Abbavaram’s recent film K-Ramp was also a major commercial success, further elevating the anticipation for Chennai Love Story.
The film is currently in its final stages of shooting, and the first single is set to be released this week. Music lovers can look forward to enjoying chartbuster songs composed by Brahma Mani Sharma very soon.
Cast: Kiran Abbavaram, Sri Gouri Priya, and others
Technical Team:
Costume Designer: Devi Parchuri
Art: Bhaskar Mudavat
Editor: Santosh Naidu
DOP: Vishwas Daniel
Lyrics: Ananth Sriram
Music Director: Manisharma
Executive Producer: Vishal Datla
Line Producer: Shyam Prasad Make
Marketing: House Full
Co-producer: Dheeraj Mogilineni
Story: Sai Rajesh
Producers: SKN, Sai Rajesh
Screenplay & Direction: Ravi Namburii
మిడ్ రేంజ్ చిత్రాల్లో ఆడియో రైట్స్ కు హయ్యెస్ట్ ప్రైస్ దక్కించుకున్న "చెన్నై లవ్ స్టోరీ", ఈ చిత్ర ఆడియో హక్కులను ఫ్యాన్సీ రేట్ కు సొంతం చేసుకున్న టీ సిరీస్ సౌత్ మ్యూజిక్ లేబుల్
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా "కలర్ ఫొటో", "బేబి" వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న "చెన్నై లవ్ స్టోరీ" సినిమాకు బిజినెస్ పరంగా మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన "చెన్నై లవ్ స్టోరీ" సినిమా గ్లింప్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడవడం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న "చెన్నై లవ్ స్టోరీ" సినిమా ఆడియో హక్కులను టీ సిరీస్ సౌత్ మ్యూజిక్ లేబుల్ సొంతం చేసుకుంది. మిడ్ రేంజ్ చిత్రాల్లో మరే సినిమాకు లేనంత ఫ్యాన్సీ రేట్ కు టీ సిరీస్ సౌత్ ఈ చిత్ర ఆడియో రైట్స్ దక్కించుకుంది.
బేబి సినిమా బాక్సాఫీస్ వద్ద కల్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో పాటు రెండు నేషనల్ అవార్డ్స్ దక్కించుకుంది, అలాగే కలర్ ఫొటో మూవీ నేషనల్ అవార్డ్ గెల్చుకుంది. మరోవైపు హీరో కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ మూవీ బిగ్ కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ కాంబోలో వస్తున్న చిత్రంగా "చెన్నై లవ్ స్టోరీ" ట్రేడ్ వర్గాలను ఆకర్షిస్తోంది. ఈ సినిమాకు బిజినెస్ క్రేజ్ కూడా బాగా ఏర్పడుతోంది.
ప్రస్తుతం "చెన్నై లవ్ స్టోరీ" మూవీ చిత్రీకరణ తుది దశలో ఉంది. ఈ వారంలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు మెలొడీ బ్రహ్మ మణిశర్మ కంపోజ్ చేసిన ఛాట్ బస్టర్ సాంగ్స్ ను మ్యూజిక్ లవర్స్ త్వరలోనే ఎంజాయ్ చేయబోతున్నారు.
నటీనటులు - కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, తదితరులు
టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్ డిజైనర్ - దేవి పర్చూరి
ఆర్ట్ - భాస్కర్ ముదావత్
ఎడిటర్ - సంతోష్ నాయుడు
డీవోపీ - విశ్వాస్ డేనియల్
లిరిక్స్ - అనంత్ శ్రీరామ్
మ్యూజిక్ డైరెక్టర్ - మణిశర్మ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - విశాల దాట్ల
లైన్ ప్రొడ్యూసర్ -శ్యామ్ ప్రసాద్ మేక
మార్కెటింగ్ - హౌస్ ఫుల్
కో ప్రొడ్యూసర్ - ధీరజ్ మొగిలినేని
స్టోరీ - సాయి రాజేశ్
నిర్మాతలు - ఎస్ కేఎన్, సాయి రాజేశ్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - రవి నంబూరి