Chennai Love Story records theatrical and non-theatrical business worth over ₹35 crore
35 కోట్ల రూపాయలకు పైగా జరిగిన చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్
Kiran Abbavaram's upcoming film Chennai Love Story is making a strong impact with its impressive pre-release business. Scheduled for a grand theatrical release on July 24th, the film has reportedly secured over ₹35 crore through its theatrical and non-theatrical rights. Compared to the business generated by Kiran Abbavaram's previous films, Chennai Love Story has significantly elevated his market value in trade circles.
From the time of its announcement, Chennai Love Story has attracted the attention of both audiences and the trade. The association with the makers of the cult blockbuster Baby has played a key role in boosting the film's business prospects. Producers SKN and Sai Rajesh have mounted the film on a grand scale with high production values and have left no stone unturned in promoting it extensively, creating considerable excitement among moviegoers.
Music director Mani Sharma's soundtrack has emerged as a major highlight, with all four songs released so far becoming chartbusters and receiving an overwhelming response. The teaser has also generated strong curiosity about the film. Promotional events held across various cities have helped the film reach audiences in different regions. The team has been actively promoting the film through television appearances, OTT platform shows, and a series of media interviews.
The film's aggressive promotional campaign, the credibility of its makers, and Kiran Abbavaram's recent box office successes with Ka and K Ramp have collectively created strong demand for the film in the pre-release market. Riding on this positive momentum, the team is hopeful that Chennai Love Story will emerge as a classic blockbuster.
Chennai Love Story is produced by SKN and Sai Rajesh under the Amrutha Productions and Mass Movie Makers banners. The story is written by Sai Rajesh, while Ravi Namburii is directing the film.
Cast
Kiran Abbavaram, Sri Gouri Priya, and others.
Technical Crew
Costume Designer: Devi Parchuri
Production Designer: Bhaskar Mudavath
Editor: Santosh Naidu
Director of Photography: Vishwas Daniel
Lyrics: Anantha Sriram
Music Director: Mani Sharma
Executive Producer: Vishala Datla
Line Producer: Shyam Prasad Meka
PRO: Suresh (SK Media), Vamsi Kaka
Marketing: House Full
Co-Producer: Dheeraj Mogilineni
Story: Sai Rajesh
Producers: SKN, Sai Rajesh
Screenplay & Direction: Ravi Namburii
35 కోట్ల రూపాయలకు పైగా జరిగిన చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "చెన్నై లవ్ స్టోరీ" ప్రీ రిలీజ్ బిజినెస్ లో సత్తా చాటుతోంది. ఈ నెల 24న గ్రాండ్ రిలీజ్ కు వస్తున్న ఈ సినిమాకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ 35 కోట్ల రూపాయలకు పైగా జరగడం విశేషం. హీరో కిరణ్ అబ్బవరం గత చిత్రాలతో చూస్తే ట్రేడ్ పరంగా ఆయన రేంజ్ ను "చెన్నై లవ్ స్టోరీ" సినిమా మరింత పెంచినట్లు క్లియర్ గా తెలుస్తోంది. "చెన్నై లవ్ స్టోరీ" సినిమా అనౌన్స్ మెంట్ నుంచే ఇటు ప్రేక్షకులను, అటు ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. కల్ట్ బ్లాక్ బస్టర్ "బేబి" మేకర్స్ అనే బ్రాండ్ ఈ సినిమా బిజినెస్ పై బాగా ప్రభావం చూపించింది. నిర్మాతలు ఎస్ కేఎన్, సాయి రాజేష్ "చెన్నై లవ్ స్టోరీ" సినిమాను కాంప్రమైజ్ కాకుండా హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించడం, స్ట్రాంగ్ ప్రమోషన్ చేస్తుండటంతో సినిమాపై అందరిలో ఆసక్తి ఏర్పడింది.
మెలొడీ బ్రహ్మ మణిశర్మ అందించిన పాటలు ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన నాలుగు పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ సినిమా టీజర్...మూవీ చూడాలనే క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. వివిధ నగరాల్లో నిర్వహించిన ఈవెంట్స్ వల్ల స్థానికంగా అన్ని ఏరియాల ఆడియెన్స్ కు సినిమా బాగా రీచ్ అయ్యింది. మూవీ టీమ్ టీవీ, ఓటీటీ షోస్ కు వెళ్తున్నారు, విరివిగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఇలా ఇంటెన్స్ ప్రమోషనల్ కంటెంట్, మేకర్స్ క్రెడబిలిటీ, హీరో కిరణ్ అబ్బవరం గత రెండు చిత్రాలు క, కె ర్యాంప్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడం...వంటి ఫ్యాక్టర్స్ అన్నీ "చెన్నై లవ్ స్టోరీ" సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మీద మంచి క్రేజ్ ఏర్పడేలా చేశాయి. ఇదే పాజిటివ్ స్పిరిట్ తో క్లాసిక్ బ్లాక్ బస్టర్ అందుకోవాలని "చెన్నై లవ్ స్టోరీ" టీమ్ ఆశిస్తోంది. "చెన్నై లవ్ స్టోరీ" చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు.
నటీనటులు - కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, తదితరులు
టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్ డిజైనర్ - దేవి పర్చూరి
ఆర్ట్ - భాస్కర్ ముదావత్
ఎడిటర్ - సంతోష్ నాయుడు
డీవోపీ - విశ్వాస్ డేనియల్
లిరిక్స్ - అనంత్ శ్రీరామ్
మ్యూజిక్ డైరెక్టర్ - మణిశర్మ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - విశాల దాట్ల
లైన్ ప్రొడ్యూసర్ -శ్యామ్ ప్రసాద్ మేక
పీఆర్ఓ - సురేష్ (ఎస్ కె మీడియా), వంశీ కాకా
మార్కెటింగ్ - హౌస్ ఫుల్
కో ప్రొడ్యూసర్ - ధీరజ్ మొగిలినేని
స్టోరీ - సాయి రాజేష్
నిర్మాతలు - ఎస్ కేఎన్, సాయి రాజేష్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - రవి నంబూరి