pizza

Sling Sparks Panic, Megastar Chiranjeevi Says No Cause For Concern
చేతికి పట్టీతో కనిపించడంతో కలవరం… ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసిన మెగాస్టార్ చిరంజీవి

You are at idlebrain.com > news today >

16 February 2026
Hyderabad

Concern rippled across fan circles when megastar Chiranjeevi was recently seen with his arm secured in a sling. Within hours, speculation snowballed online, with admirers fearing a serious injury and wondering whether it might affect his upcoming commitments. Instead of letting rumours spiral, the star chose to address the matter himself, taking to X with a clear and reassuring message.

In his note, Chiranjeevi explained that there was no alarming health issue- only a minor shoulder keyhole procedure. He emphasized that the surgery was precautionary and routine, and that recovery had progressed comfortably. The actor also expressed heartfelt appreciation to Dr. Nithin, acknowledging the surgeon’s skill and care in ensuring a smooth experience.

“Several well-wishers have enquired about my health after noticing the arm sling. It was just a minor shoulder keyhole surgery. I am recovering well and already getting back to my routine. My heartfelt thanks to Dr. Nithin, one of the finest arthroscopy surgeons, for his care and expertise in making the procedure smooth and comfortable. Grateful for all your love, concern and blessings ❤️” reads Chiranjeevi’s statement.

On the work front, Chiranjeevi who attained regional industry hit with Mana Shankara Vara Prasad Garu, will next be seen in Vishwambhara. He is all set to join hands with director Bobby for second movie in their collaboration.

చేతికి పట్టీతో కనిపించడంతో కలవరం… ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసిన మెగాస్టార్ చిరంజీవి

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేతికి పట్టీతో కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు చక్కర్లు కొట్టగా, ఆయనకు ఏమైనా గాయమైయిందా? రాబోయే ప్రాజెక్టులపై ప్రభావం ఉంటుందా? అనే చర్చలు మొదలయ్యాయి. అయితే రూమర్స్ కి తావులేకుండా చిరంజీవి స్వయంగా ఎక్స్‌ (X) వేదికగా స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు.

ఎలాంటి పెద్ద ఆరోగ్య సమస్య లేదని, కేవలం చిన్నపాటి షోల్డర్ కీహోల్ సర్జరీ మాత్రమే జరిగిందని స్పష్టం చేశారు మెగాస్టార్. ఇది ముందస్తు జాగ్రత్తగా చేసిన సాధారణ ప్రక్రియ అని, ప్రస్తుతం తాను సాఫీగా కోలుకుంటున్నానని, సర్జరీను విజయవంతంగా నిర్వహించిన ప్రముఖ ఆర్థ్రోస్కోపీ నిపుణుడు డా. నితిన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

“చేతికి పట్టీ ఉండటం గమనించి అభిమానులు, శ్రేయోభిలాషులు నా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఇది కేవలం చిన్నపాటి షోల్డర్ కీహోల్ సర్జరీ. ప్రస్తుతం నేను కోలుకున్నాను, నా దినచర్య సజావుగా సాగుతోంది. ఈ సర్జరీని ఎంతో నైపుణ్యంతో, సాఫీగా నిర్వహించిన అత్యుత్తమ ఆర్థోస్కోపీ సర్జన్‌ డాక్టర్‌ నితిన్‌ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు ❤️. ❤️” అని మెగాస్టార్ తన పోస్ట్ లో తెలిపారు.

రీజినల్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన మన శంకర వర ప్రసాద్ గారు తర్వాత చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. అలాగే దర్శకుడు బాబీతో మరోసారి చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved