Megastar Chiranjeevi has penned an emotional note to his son Ram Charan, congratulating him on completing 18 successful years in the film industry. Marking the special occasion, a tribute poster from Peddi makers has been unveiled, celebrating the actor’s cinematic journey.
In his heartfelt message, Chiranjeevi recalled the moment when Ram Charan made his debut with Chirutha (2007), calling it an unforgettable experience as a father. “The moment I first saw you on screen as a hero is something I can never forget,” he wrote.
Expressing pride in Charan’s discipline, hard work, determination, humility, and dedication, the Megastar said these qualities have set him apart in the industry and won him a permanent place in the hearts of millions of fans.
“As a father, I always feel proud of you. With the love of Telugu audiences and the blessings of God, I wish you to reach many more great heights. Vijayostu…!” Chiranjeevi added in his message.
The release of the special tribute poster further added to the celebrations, with fans flooding social media with congratulatory posts, marking 18 glorious years of Ram Charan’s career.
చరణ్.... తండ్రిగా నిన్ను చూసి గర్వపడుతున్నా - చిరంజీవి
తల్లితండ్రులకు తమ కంటే బిడ్డల ఎదుగుదలే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. బిడ్డల ఎదుగుదలలో తమను తాము చూసుకొని పొంగిపోతూ ఉంటారు చాలామంది తల్లితండ్రులు. స్వతహాగా సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి చూడని విజయాలూ లేవు, ఆయన అందుకోని రికార్డులూ లేవు. ఎన్నో ఎత్తుపల్లాలను దాటుకొని మెగాస్టార్ స్థాయికి చేరుకోగలిగారు చిరంజీవి. బహుశా అందుకేనేమో పరిశ్రమలో ఎవరికి ఏ అవసరం ఉన్నా వెంటనే స్పందించి వాళ్లకు అండగా ఉంటారు చిరంజీవి. విషయాల్లోకి వెళ్తే ఈ నెలంతా మెగా కుటుంబంలో సంబరాలు నిండాయి. 'OG' చిత్రం భారీ విజయంతో చిరంజీవి ఇంట సంబరాలు జరిగాయి. దానికి కొనసాగింపుగా తన కుమారుడు రామ్ చరణ్ సినిమా పరిశ్రమలో 18 ఏళ్ల ప్రస్థానాన్ని కూడా ఈనెలలోనే పూర్తి చేసుకోవడం జరిగింది.
రామ్ చరణ్ మొదటి సినిమా 'చిరుత' సెప్టెంబర్ 27, 2007 న విడుదలయింది. కుమారుడిని అభినందిస్తూ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ట్వీట్ పెడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. "18 ఏళ్ల క్రితం 'చిరుత' తో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఇండస్ట్రీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. తండ్రిగా నిన్ను చూసి గర్వపడుతుంటా" అంటూ బిడ్డ పట్ల తన పుత్రోత్సాహం చూపించారు చిరంజీవి.