pizza

The Year Of The Mega Duo, Father-Son Chiranjeevi-Ram Charan Script History
2026 మెగా ద్వయం సంచలనం.. సరికొత్త చరిత్ర సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్

You are at idlebrain.com > news today >

13 June 2026
Hyderabad

Indian cinema has seen legendary families, successful generations, and multiple stars emerging from the same household. But 2026 has produced something truly exceptional- a father and son standing as the two biggest box-office winners of the year.

Megastar Chiranjeevi first set the tone with Mana Shankara Vara Prasad Garu, a film that breached the 300 crore mark worldwide and established itself as the highest-grossing South Indian film of the year. Months later, his son Mega Power Star Ram Charan raised the bar even higher.

His latest blockbuster Peddi has overtaken the final worldwide collections of Mana Shankara Vara Prasad Garu, emerging as the new South Indian box-office champion of 2026. The Buchi Babu Sana directorial is heading towards 400 Cr mark.

The significance of this achievement goes beyond numbers. Never before has Indian cinema witnessed a father-son pair occupying the top two positions among the year's biggest grossers. It is a rare moment where two generations of the same family have dominated the industry simultaneously.

What makes this feat even more special is the timing of their success. Both films arrived when the industry needed major commercial victories, injecting fresh momentum into the theatrical business. Peddi, in particular, has provided much-needed relief to distributors and exhibitors after a largely underwhelming summer season.

Together, Chiranjeevi and Ram Charan have transformed 2026 into a historic year for the Mega family, scripting a box-office chapter that could stand unmatched for years to come.

2026 మెగా ద్వయం సంచలనం.. సరికొత్త చరిత్ర సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్

భారతీయ సినీ పరిశ్రమలో ఎన్నో లెజెండరీ ఫ్యామిలీస్, సక్సెస్ ఫుల్ జనరేషన్స్, ఒకే ఫ్యామిలీ నుంచి స్టార్ హీరోలు వచ్చారు. అయితే 2026లో మాత్రం భారతీయ సినిమా చరిత్రలోనే అరుదైన ఘట్టం నమోదైంది. తండ్రి, కుమారుడు కలిసి ఈ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండు చిత్రాలతో బాక్సాఫీస్‌ వద్ద అదరగొట్టారు.

మొదట మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 2026లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సౌత్ ఇండియన్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’తో ఆ రికార్డును అధిగమించారు.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’, ప్రపంచవ్యాప్తంగా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్ర ఫైనల్ కలెక్షన్లను దాటి, 2026లో సౌత్ ఇండియా బాక్సాఫీస్ చాంపియన్‌గా అవతరించింది. ప్రస్తుతం ఈ చిత్రం 400 కోట్ల మార్క్ వైపు దూసుకుపోతోంది.

ఈ ఘనత కేవలం కలెక్షన్ల పరంగా మాత్రమే కాదు, భారతీయ సినిమా చరిత్రలో ఒకే ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-2 చిత్రాల స్థానాలను తండ్రి, కుమారుడు నమోదు చేయడం ఇదే తొలిసారి. ఒకే కుటుంబానికి చెందిన రెండు జనరేషన్స్ ఒకేసారి బాక్సాఫీస్‌ను ఏలడం అరుదైన రికార్డు.

ఇంకా ప్రత్యేకత ఏమిటంటే, ఈ రెండు చిత్రాలు కూడా థియేట్రికల్ బిజినెస్ కి అత్యవసరమైన సమయంలో వచ్చాయి. ముఖ్యంగా ‘పెద్ది’ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు భారీ ఊరటను ఇచ్చింది.

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి 2026ను మెగా కుటుంబానికి చారిత్రాత్మక సంవత్సరంగా మార్చారు. బాక్సాఫీస్ చరిత్రలో ఎన్నో సంవత్సరాలు గుర్తుండిపోయే అరుదైన అధ్యాయాన్ని సృష్టించారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved