pizza

Megastar Chiranjeevi Lauds "Committee Kurrollu" for its Natural Performances and Storytelling
‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాను నేచుర‌ల్‌గా తెర‌కెక్కించ‌టానికి ఎంటైర్ టీమ్ ప‌డ్డ క‌ష్టం తెర‌పై క‌నిపించింది: మెగాస్టార్ చిరంజీవి

You are at idlebrain.com > news today >

19 August 2024
Hyderabad

Megastar Chiranjeevi has showered praise on the recently released film "Committee Kurrollu," produced by Niharika Konidela under the banners of Pink Elephant Pictures LLP and Sriradha Damodar Studios. The film, directed by Yadu Vamsi, features a fresh ensemble cast of 11 heroes and 4 heroines, alongside senior actors.

Following the film's successful release on August 9th, "Committee Kurrollu" has garnered widespread acclaim, receiving praise from audiences, critics, and celebrities alike. Superstar Mahesh, global star Ram Charan, directors S.S. Rajamouli, Sukumar, Krish, and music composer Devi Sri Prasad have already congratulated the team on their achievement.

Chiranjeevi, after watching the film, met with the entire "Committee Kurrollu" team, including producer Niharika Konidela, director Yaduvamshi, and the cast. He expressed his admiration for their work, stating that the film's natural performances and heartfelt emotional scenes made him forget that he was watching newcomers.

"The way the actors transformed themselves according to the story is truly commendable," said Chiranjeevi. "It's evident that the entire team poured their heart and soul into creating a genuine and relatable film. Special kudos to director Yaduvamshi for making this film on a reasonable budget and showcasing his remarkable talent through meticulous planning and well-executed scenes."

Chiranjeevi's endorsement further solidifies "Committee Kurrollu" as a standout film in the recent releases, attracting significant audience interest and box-office success. The film's success is a testament to the hard work and dedication of the entire team, proving that fresh faces and stories can captivate audiences and leave a lasting impact.

‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాను నేచుర‌ల్‌గా తెర‌కెక్కించ‌టానికి ఎంటైర్ టీమ్ ప‌డ్డ క‌ష్టం తెర‌పై క‌నిపించింది: మెగాస్టార్ చిరంజీవి

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను పరిచయం చేస్తూ ఈ చిత్రానికి య‌దు వంశీ దర్శకత్వం వహించారు.ఆగస్ట్ 9న ఈ చిత్రం విడుదల అవ్వగా. డిఫరెంట్ కంటెంట్‌తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని వసూళ్లను రాబడుతోంది. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శ‌సంలను అందుకున్న ఈ సినిమాకు సెల‌బ్రిటీల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఇప్ప‌టికే సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్‌, క్రిష్‌, దేవిశ్రీప్ర‌సాద్ ఇలా చాలా మంది క‌మిటీ కుర్రోళ్ళు టీమ్‌ను అభినందించారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘క‌మిటీ కుర్రోళ్ళు’ సినిమాను ప్ర‌త్యేకంగా వీక్షించి ఎంటైర్ టీమ్‌ను ప్ర‌త్యేకంగా క‌లుసుకున్నారు. నిర్మాత నిహారిక కొణిదెల‌, ద‌ర్శ‌కుడు య‌దువంశీతో పాటు చిత్రంలోని న‌టీన‌టులంద‌రూ చిరంజీవిని క‌లుసుకున్నారు. వారంద‌రితో చిరంజీవి ప్ర‌త్యేకంగా ముచ్చ‌టిస్తూ స‌క్సెస్‌లో భాగ‌మైన ప్ర‌తీ ఒక్క‌రిని ఆయ‌న అభినందించారు. ఈ సంద‌ర్భంగా ..

చిరంజీవి మాట్లాడుతూ మా నిహారిక నిర్మించిన ‘‘క‌మిటీ కుర్రోళ్ళు’ సినిమాను చూశాను.. చాలా చ‌క్క‌గా ఉంది. అంద‌రూ కొత్త కుర్రాళ్లే. చాలా బాగా చేశారు. సినిమా చూస్తున్న‌ప్పుడు కొత్త‌వాళ్లు యాక్ట్ చేస్తున్నార‌నే విష‌యాన్ని మ‌ర‌చిపోయాను. ఎమోష‌న‌ల్ సీన్స్ చాలా చ‌క్క‌గా పండాయి. న‌టీన‌టులంద‌రూ క‌థానుగుణంగా మేకోవ‌ర్ అయిన తీరు అద్భుతం. సినిమాను నేచుర‌ల్‌గా చిత్రీకరించ‌టం ఎంటైర్ టీమ్ ప‌డ్డ క‌ష్టం గురించి ఎంత చెప్పినా త‌క్కువే, అది తెర‌పై క‌నిపించింది. రీజ‌న‌బుల్ బ‌డ్జెట్‌లో సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు య‌దువంశీకి ప్ర‌త్యేక‌మైన అభినంద‌నలు. ద‌ర్శ‌కుడిగా త‌ను చ‌క్క‌టి ప్లానింగ్‌తో సినిమాలోని ప్ర‌తీ స‌న్నివేశాన్నిముందుగా డిజైన్ చేసుకోవటం వ‌ల్ల బాగా తెర‌కెక్కించ‌గ‌లిగారు. రీసెంట్‌గా విడుద‌లైన సినిమాల్లో క‌మిటీకుర్రోళ్లు ముందంజ‌లో ఉంటూ మంచి వ‌సూళ్ల‌ను రాబ‌డుతుంది. ఎంటైర్ టీమ్‌కు అభినంద‌న‌లు’’ అన్నారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved