pizza

Global Star Ram Charan brands Niharika Konidela's "Committee Kurrollu" 'Incredible'
నిహారిక! ఈ విజ‌యానికి నువ్వు అర్హురాలివి.. నీ టీమ్‌తో క‌లిసి నువ్వు ప‌డ్డ క‌ష్టం, నిబ‌ద్ధ‌త స్ఫూర్తినిస్తున్నాయి - ‘కమిటీ కుర్రోళ్ళు’కి గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌శంస‌

You are at idlebrain.com > news today >

13 August 2024
Hyderabad

"Committee Kurrallu," helmed by Yadhu Vamsi and backed by Mega Daughter Niharika Konidela, is making waves at the box office, taking audiences on a nostalgic journey back to their childhood. Set against the picturesque backdrop of the Godavari River and its surrounding districts, the film is resonating with audiences of all ages.

The film's success is not just a box office phenomenon but also a critical triumph. Leading figures in the Telugu film industry have showered praise on the film, including Megastar Chiranjeevi, Superstar Mahesh Babu, and renowned filmmaker SS Rajamouli. Global Star Ram Charan, adding his voice to the chorus of accolades, took to social media to congratulate the entire team, praising Niharika for her dedication and Yadhu Vamsi for bringing the story to life.

Ram Charan shared his feelings with the following post. "Congratulations on the massive success of "Committe Kurrollu" Niharika Thalli ! The is well-deserved !! Your hard work and dedication, along with your team are truly inspiring. Kudos to the entire cast and crew for their incredible effort, and a special shoutout to the director Yadhu Vamsi for bringing this story to life!"

Niharika's vision to entertain audiences with a fresh, youthful story that celebrates friendship is resonating strongly. This, coupled with the dynamic performances of the 11 newcomers – Sandeep Saroj, Yaswanth Pendyala, Eshwar Rachiraju, Trinadh Varma, Prasad Behara, Manikanta Parasu, Lokesh Kumar Parimi, Shyam Kalyan, Raghuvaran, Shiva Kumar Matta, Akshay Srinivas, Raadhya, Tejaswi Rao, Teena Sravya, Vishika, and Shanmukhi Nagumanthri – is drawing audiences into the film's world. Seasoned actors Sai Kumar, Goparaju Ramana, and Sri Lakshmi add depth and experience to the cast.

Yadhu Vamsi's skillful direction, coupled with an engaging screenplay and captivating storytelling, leaves a lasting impact. The film's music and background score, composed by Anudeep Dev, and the breathtaking cinematography by Raju Edurolu immerse viewers in the story.

"Committee Kurrallu" has already crossed its break-even point, and with the support of the film industry's leading figures, the makers are confident of a surge in box office collections. The film stands as a testament to the power of a well-crafted narrative, fresh talent, and a heartfelt tribute to childhood friendships.

నిహారిక! ఈ విజ‌యానికి నువ్వు అర్హురాలివి.. నీ టీమ్‌తో క‌లిసి నువ్వు ప‌డ్డ క‌ష్టం, నిబ‌ద్ధ‌త స్ఫూర్తినిస్తున్నాయి - ‘కమిటీ కుర్రోళ్ళు’కి గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌శంస‌

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ సంతోషానికి అవ‌ధులు లేవు. త‌న సోద‌రి నిహారిక కొణిదెల‌ స‌క్సెస్‌పై ఆయ‌న ఆనందాన్ని మాట‌ల రూపంలో వ్య‌క్తం చేశారు. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం మండే టెస్ట్ కూడా పాస్ అయ్యింది. నాలుగు రోజుల్లోనే రూ.7.48 కోట్లు వ‌సూళ్ల‌ను సాధించి అన్నీ ఏరియాస్‌లో సినిమా బ్రేక్ ఈవెన్ సాధించ‌టం విశేషం.

నిహారిక ‘కమిటీ కుర్రోళ్ళు’ అద్భుత‌మైన విజ‌యం సాధించినందుకు అభినంద‌న‌లు. ఈ విజ‌యానికి నువ్వు అర్హురాలివి. నీ టీమ్‌తో నువ్వు ప‌డ్డ క‌ష్టం, పనిలో చూపించిన నిబ‌ద్ధ‌త స్ఫూర్తిని క‌లిగిస్తుంది. మీ టీమ్ చేసిన ప్ర‌య‌త్నానికి హ్యాట్యాఫ్‌. ఈ క‌థ‌కు జీవాన్ని పోసిన ద‌ర్శ‌కుడు య‌దు వంశీకి ప్ర‌త్యేక‌మైన అభినంద‌న‌లు’ అని పేర్కొన్నారు రామ్ చ‌ర‌ణ్‌.

మంచి ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణంలో స్నేహం, ప్రేమ‌, కుటుంబంలోని భావోద్వేగాల‌ను ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో చ‌క్క‌గా ఆవిష్క‌రించారు. సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నాన్ని అభినందిస్తూ ప్రేక్ష‌కులు సినిమాను ఆద‌రించార‌ని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి. సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందని చిత్ర యూనిట్ తెలియజేసింది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved