pizza

Comrade Kalyan Ethara Ethu song released
హిట్ మిషన్ అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీ విష్ణు, జనకిరామ్ మారెళ్ల, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP 'కామ్రేడ్ కళ్యాణ్' రివల్యూషనరీ సాంగ్ ఎత్తర ఎత్తు

You are at idlebrain.com > news today >

29 September 2026
Hyderabad

‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీ విష్ణు పీరియడ్ ఎలిమెంట్స్, హ్యూమర్, రొమాన్స్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ‘కామ్రేడ్ కళ్యాణ్’ తో అలరించబోతున్నారు. జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ పాటలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా హిట్ మిషన్ అనిల్ రావిపూడి 'కామ్రేడ్ కళ్యాణ్' నుంచి ఎత్తర ఎత్తు సాంగ్ లాంచ్ చేశారు.

విజయ్ బుల్గానిన్ రివల్యూషనరీ ఫ్లేవర్ ఉన్న పాటను కంపోజ్ చేశారు. నల్గొండ గద్దర్ నర్సన్న తన ప్రత్యేకమైన వాయిస్‌తో పవర్‌ఫుల్ ఎనర్జీని అందించగా, భాస్కరభట్ల రాసిన లిరిక్స్ పాటకు రివల్యూషనరీ ఫీల్‌ను తీసుకొచ్చాయి.

శ్రీ విష్ణు పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్, పాటలోని బీట్, లిరిక్స్ కలిసి ‘ఎత్తర ఎత్తు’ ఫుల్ ఎనర్జిటిక్ స్ఫూర్తి నింపే పాటగా ఆకట్టుకుంది. ఈ సాంగ్ కి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. చోటా కె. ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

నటీనటులు: శ్రీవిష్ణు, మహిమా నంబియార్, రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే

సాంకేతిక బృందం:
దర్శకత్వం: జానకిరామ్ మారెళ్ల
సమర్పణ: కోన వెంకట్
నిర్మాతలు: వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి
సంగీతం: విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
ఎడిటర్: చోటా కె. ప్రసాద్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved