pizza

Mahima Nambiar interview about Comrade Kalyan
'కామ్రేడ్ కళ్యాణ్'తో తెలుగులో డెబ్యు చేయడం చాలా హ్యాపీగా ఉంది. కామ్రేడ్ కళ్యాణ్ శ్రీవిష్ణు గారి సిగ్నేచర్ స్టైల్‌లో ఫన్ ఎంటర్‌టైనర్‌. అందరికీ కనెక్ట్ అవుతుంది: హీరోయిన్ మహిమా నంబియార్

You are at idlebrain.com > news today >

05 October 2026
Hyderabad

‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీ విష్ణు పీరియడ్ ఎలిమెంట్స్, హ్యూమర్, రొమాన్స్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ‘కామ్రేడ్ కళ్యాణ్’ తో అలరించబోతున్నారు. జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. మహిమా నంబియార్ హీరోయిన్. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ పాటలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మహిమా నంబియార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

ఇది మీ తొలి తెలుగు సినిమా కదా.. తెలుగులో నటించడం ఎలా అనిపించింది?
తెలుగులో నటించడం సరికొత్త అనుభవం. నేను ఏదైనా భాషని త్వరగా నేర్చుకోగలను. తెలుగు నాకు అర్థమవుతుంది. అలాగే ప్రతి లైన్‌కి దర్శకుడిని అడిగి అర్థం తెలుసుకుంటాను. అది నాకు మరింత హెల్ప్ అవుతుంది.

శ్రీ విష్ణు గారితో నటించడం ఎలా అనిపించింది?
శ్రీవిష్ణు గారు చాలా స్పాంటేనిటీ ఉన్న యాక్టర్. షూటింగ్ స్పాట్‌లో చాలా ఇంప్రొవైజ్ చేస్తుంటారు. అది నాకు మరింత ఛాలెంజింగ్‌గా ఉంటుంది. శ్రీవిష్ణు గారి తెలుగుని అర్థం చేసుకోవడం నాకు కష్టం (నవ్వుతూ). ఆయనకి ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంది. నిజంగా అంత స్పాంటేనిటీ ఉన్న యాక్టర్‌తో కలిసి నటించడం మంచి ఎక్స్‌పీరియన్స్.

-శ్రీవిష్ణు గారి సినిమాల్లో ‘బ్రోచేవారెవరురా’ నాకు చాలా ఇష్టం. అలాగే ‘స్వాగ్’ సినిమా కూడా చూశాను.

ఈ అవకాశం ఎలా వచ్చింది?
-డైరెక్టర్ గారు నేను చేసిన తమిళ్, మలయాళ సినిమా చూసి కాల్ చేసి కథ చెప్పారు. చాలా నచ్చింది. శ్రీవిష్ణు గారి సిగ్నేచర్ స్టైల్‌లో ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. ఇంతకుముందు శ్రీవిష్ణు గారితో నేను ‘సామజవరగమన’ సినిమా చేయాల్సింది. ఆ సినిమా కోసం ఫొటోషూట్ కూడా జరిగింది. కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఇప్పుడు ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాతో శ్రీవిష్ణు గారితో కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాతో తెలుగులో డెబ్యూ చేయడం లక్కీగా ఫీలవుతున్నాను.

మీ పాత్ర గురించి?
-ఇందులో నాది చాలా ఫన్ క్యారెక్టర్. నా పాత్ర పేరు సితార దేవి. పక్కింటి అమ్మాయిలాంటి పాత్ర. చాలా ఇన్నోసెంట్. ఒరిస్సా నుంచి వచ్చిన అమ్మాయిగా కనిపిస్తా. ఆ భాష కారణంగా హీరో, హీరోయిన్ మధ్య వచ్చే ఫన్ చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఒరిస్సాలో షూటింగ్ చేయడం కూడా కొత్త ఎక్స్‌పీరియన్స్. ‘ఒడియా పిల్లా’ పాటకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

-ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. ప్రతి భాషలో కొత్త కొత్త పాత్రలు చేయాలనే నా ఉద్దేశం. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ దేనికవే ప్రత్యేకంగా ఉంటాయి.

ఈ కథని ఎంచుకోవడానికి కారణం?
-ఈ కథ చాలా ఫన్‌గా ఉంటుంది. అలాగే 90ల బ్యాక్‌డ్రాప్ కూడా చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ఇది మంచి కమర్షియల్ ప్యాకేజ్ సినిమా. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఇందులో నక్సలిజం బ్యాక్‌డ్రాప్ ఉంటుంది. కానీ దాన్ని చాలా కామికల్‌గా డీల్ చేశారు.

నిర్మాత గురించి?
చాలా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. వెరీ నైస్ పర్సన్. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించారు.

తెలుగు ఆడియన్స్ గురించి?
-తెలుగు ఆడియన్స్ సినిమాని గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. మందాడి సినిమా ప్రమోషన్స్‌కి వచ్చినప్పుడు చాలా గొప్ప రిసెప్షన్ ఇచ్చారు. మంచి కంటెంట్ ఉంటే భాషలకు అతీతంగా ఆదరిస్తారు.

మీకు ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది?
-ఒక నటిగా అన్ని పాత్రలు చేయాలని ఉంది. నేను న్యాయం చేయగల అన్ని పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను.

కొత్త ప్రాజెక్ట్స్ గురించి?
మలయాళం, తమిళ్‌లో చెరో సినిమా చేస్తున్నాను. తెలుగు కథలు వింటున్నాను.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved