Limitless Love & Enchanting Melody- Intha Istamaa From Sree Vishnu, Mahima Nambiar's Comrade Kalyan Released
శ్రీ విష్ణు, మహిమ నంబియార్ 'కామ్రేడ్ కళ్యాణ్' నుంచి మెస్మరైజింగ్ లవ్ మెలోడీ 'ఇంత ఇష్టమా' సాంగ్ రిలీజ్
After intriguing audiences with its title glimpse followed by first single, the makers of Comrade Kalyan have now unveiled the film's second musical offering, Intha Istamaa. Starring Sree Vishnu and Mahima Nambiar, the period action entertainer is directed by Janakiram Marella, presented by Kona Venkat, and produced by Venkata Krishna Karnati and Seetha Karnati under the Skanda Vahana Motion Pictures LLP banner.
Vijay Bulganin scored an enchanting melody that beautifully captures the emotions shared by the lead pair. The song portrays a young woman deeply touched by the unconditional love and affection showered on her by the protagonist, as she gradually opens her heart and reciprocates his feelings.
Bhaskarabhatla Ravikumar's evocative lyrics lend poetic depth to this tender love story, while Ram Miriyala and Lipsika breathe life into the composition with their soulful vocals. Adding to its charm, the song is brought alive through visually captivating frames and the sparkling on-screen chemistry between Sree Vishnu and Mahima Nambiar, making it a delightful romantic watch.
Set in the volatile Andhra–Odisha border region of 1992, Comrade Kalyan weaves together action, heartfelt emotions, and a touching love story. The film's first single introduces the blossoming romance between the protagonists, capturing the innocence of young love that transcends cultural boundaries.
The film also features Radhika Sarathkumar, Shine Tom Chacko, and Upendra Limaye in pivotal roles.
Sai Sriram handles the cinematography, while Chota K Prasad oversees the editing, complementing Vijay Bulganin's musical score.
The makers will announce the film’s release date soon.
శ్రీ విష్ణు, మహిమ నంబియార్ 'కామ్రేడ్ కళ్యాణ్' నుంచి మెస్మరైజింగ్ లవ్ మెలోడీ 'ఇంత ఇష్టమా' సాంగ్ రిలీజ్
టైటిల్ గ్లింప్స్, తొలి పాటతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన 'కామ్రేడ్ కళ్యాణ్' చిత్ర బృందం ఇప్పుడు రెండో పాట 'ఇంత ఇష్టమా' ను విడుదల చేసింది. శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా నటిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో, వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ లవ్ మెలోడీ హీరో చూపించే నిస్వార్థమైన ప్రేమ, ఆప్యాయతకు హీరోయిన్ మెస్మరైజ్ అయ్యి అతనిపై ప్రేమను పెంచుకునే భావోద్వేగాలను అందంగా చూపించారు.
భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం ఈ లవ్ సాంగ్ మరింత అందాన్ని తీసుకురాగా, రామ్ మిర్యాల, లిప్సిక వోకల్స్ తో పాటకు ప్రాణం పోశారు. శ్రీవిష్ణు, మహిమా నంబియార్‌ల మధ్య కెమిస్ట్రీ, ఆకట్టుకునే విజువల్స్ ఈ పాటను మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి.
1992 నాటి ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతున్న 'కామ్రేడ్ కళ్యాణ్' యాక్షన్, భావోద్వేగాలు, ఆకట్టుకునే ప్రేమకథ కలగలిపిన చిత్రంగా రూపొందుతోంది.
ఈ రెండో పాటలో లీడ్ పెయిర్ మధ్య చిగురించే ప్రేమను, సరిహద్దులను దాటే అమాయకమైన అనుబంధాన్ని అందంగా చూపించారు.
ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ.
'కామ్రేడ్ కళ్యాణ్' విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.
తారాగణం: శ్రీ విష్ణు, మహిమా నంబియార్, రాధిక శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: జానకిరామ్ మారెళ్ల
సమర్పణ: కోన వెంకట్
నిర్మాతలు: వెంకట కృష్ణ కర్నాటి & సీతా కర్నాటి
బ్యానర్: స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP
సంగీతం: విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్