Superstar Rajinikanth, King Nagarjuna, Lokesh Kanagaraj & Sun Pictures unveil Aamir Khan’s powerful first‑look from Coolie
సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున, లోకేష్ కనగరాజ్, సన్ పిక్చర్స్ 'కూలీ' నుంచి దహాగా అమీర్‌ఖాన్ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్
Coolie, one of Superstar Rajinikanth’s most‑awaited films, is being directed by Lokesh Kanagaraj, who continues to expand his Lokesh Cinematic Universe (LCU). The big‑ticket project, produced by the prestigious Sun Pictures, also features recent Kubera blockbuster star King Nagarjuna in a commanding role, while Bollywood superstar Aamir Khan plays another key character.
Today the makers introduced Aamir Khan’s character “Dahaga” with a first‑look poster. Sporting a gold watch, gold‑rimmed glasses and puffing a cigar, Aamir appears in an intense, menacing avatar that has taken social media by storm.
Leading distribution house Asian Multiplexes Pvt. Ltd.—run by D. Suresh Babu, Sunil Narang and Dil Raju—has snapped up the Telugu theatrical rights for a hefty sum, underscoring the massive hype around the project.
Alongside Rajinikanth and Nagarjuna, the cast includes Sathyaraj, Soubin Shahir, Upendra, Shruti Haasan, and Mahendran in pivotal roles. In the Telugu states the film will be released grandly through Asian Suresh Entertainments.
Earlier‑released posters, teasers and the chart‑busting song “Chikitu” have already sparked huge buzz.
The film is set for a worldwide grand release on 14 August 2025.
సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున, లోకేష్ కనగరాజ్, సన్ పిక్చర్స్ 'కూలీ' నుంచి దహాగా అమీర్‌ఖాన్ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్
సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'కూలీ'కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో తన విజయాలని కొనసాగిస్తున్నారు. ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన కూలీలో రీసెంట్ కుబేర తో బ్లాక్ బస్టర్ అందుకున్న కింగ్ నాగార్జున పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
ఈ రోజు మేకర్స్ అమీర్‌ఖాన్ ని దహాగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. గోల్డెన్ వాచ్, గోల్డ్ ఫ్రేం వున్న గ్లాసెస్ ధరించి సిగార్ తాగుతూ అమీర్‌ఖాన్ ఇంటెన్స్ లుక్ లో కనిపించిన ఈ పోస్టర్ అదిరిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డి. సురేష్ బాబు, సునీల్ నారంగ్, దిల్ రాజు యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూలీ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇది ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న మ్యాసీవ్ హైప్‌ను సూచిస్తోంది.
రజనీకాంత్, నాగార్జునలతో పాటు సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతీ హాసన్, మహేంద్రన్ వంటి ప్రముఖులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా విడుదల చేయనుంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లు, టీజర్లు సినిమాపై భారీ క్రేజ్‌ను నెలకొల్పాయి. ‘చికిటు’ సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.
కలానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. ఆనిరుధ్ సంగీతం, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఫిలోమిన్ రాజ్.
ఈ చిత్రం 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.