pizza

Naga Chaitanya, Venkat Prabhu Bilingual Film Custody Teaser On March 16th
నాగ చైతన్య, వెంకట్ ప్రభు, శ్రీనివాస చిట్టూరి, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ ద్విభాషా చిత్రం 'కస్టడీ' టీజర్ మార్చి 16న విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

13 March 2023
Hyderabad

Young hero Akkineni Naga Chaitanya’s Telugu-Tamil bilingual project Custody directed by leading filmmaker Venkat Prabhu is currently in the post-production phase, as production formalities have already been wrapped up. Meanwhile, promotions are in full swing for the movie. In fact, every promotional material- first-look posters of the lead cast and the glimpse got a superb response from all corners.

The makers today announced to release a teaser of the movie on 16th of this month. A teaser tease which is meant to announce the teaser date and also to increase our inquisitiveness has been unveiled. It says to hold on to your breath to witness one hell of a ride. Finally, Naga Chaitanya can be seen setting himself free from a prison in the river. He can be seen in a khaki uniform.

The film stars Krithi Shetty as the female lead, while Arvind Swami will be sene in a vital role. Priyamani played a powerful role. The film also stars Sarathkumar, Sampath Raj, Premji, Vennela Kishore, Premi Vishwanath, among others.

Custody is one of the most expensive films in the career of Akkineni hero. Srinivasaa Chitturi is producing the film in a prestigious manner under Srinivasaa Silver Screen banner. The film is being made with high production values and technical standards. Pavan Kumar is presenting this ambitious project. Maestro Ilaiyaraaja and Little Maestro Yuvan Shankar Raja together scored the music for the movie. Abburi Ravi penned the dialogues while SR Kathir is handling the cinematography. Rajeevan is the production designer and DY Satyanarayana is the art director.

Custody will have its theatrical release worldwide on May 12, 2023.

Cast: Naga Chaitanya, Krithi Shetty, Arvind Swami, Priyamani, Sharat Kumar, Sampath Raj, Premgi Amaren, Vennela Kishore, Premi Vishwanath and many other notable actors.

Technical Crew:
Story, Screenplay, Direction: Venkat Prabhu
Producer: Srinivasaa Chitturi
Banner: Srinivasaa Silver Screen
Presents: Pavan Kumar
Music: Maestro Ilaiyaraaja, Little Maestro Yuvan Shankar Raja
Cinematographer: SR Kathir
Editor: Venkat Raajen
Dialogues: Abburi Ravi
Production Designer: Rajeevan
Action: Stun Siva, Mahesh Mathew
Art Director: DY Satyanarayana

నాగ చైతన్య, వెంకట్ ప్రభు, శ్రీనివాస చిట్టూరి, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ ద్విభాషా చిత్రం 'కస్టడీ' టీజర్ మార్చి 16న విడుదల

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం 'కస్టడీ' ఇప్పటికే ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి కావడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి ప్రతి ప్రమోషనల్ కంటెంట్- ప్రధాన తారాగణం ఫస్ట్-లుక్ పోస్టర్లు, గ్లింప్స్ కు అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

ఈ నెల 16న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. టీజర్ తేదీని అనౌన్స్ చేయడానికి, ఆసక్తిని పెంచడానికి ఉద్దేశించిన టీజర్ టీజ్ ని విడదల చేశారు. నదిలో జైలు..ఆ జైలు నుంచి తనని తాను విడుపించుకొని బయటికి వస్తున్న నాగచైతన్య వీడియో చాలా క్యురియాసిటీని పెంచింది. ఈ టీజ్ వీడియోలో నాగచైతన్య ఖాకీ యూనిఫామ్‌లో కనిపించారు.

ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, అరవింద్ స్వామి కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో శరత్‌కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్‌జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు.

నాగచైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో కస్టడీ ఒకటి. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు. మాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్‌ రాస్తుండగా, ఎస్‌ఆర్‌ కత్తిర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రాజీవ్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌, డివై సత్యనారాయణ ఆర్ట్‌ డైరెక్టర్‌.

కస్టడీ మే 12, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

నటీనటులు: నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్‌జీ అమరెన్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు

సాంకేతిక విభాగం :
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
సమర్పణ: పవన్ కుమార్
సంగీతం: మాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రాఫర్: ఎస్ఆర్ కతీర్
ఎడిటర్: వెంకట్ రాజన్
డైలాగ్స్: అబ్బూరి రవి
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్
యాక్షన్: మహేష్ మాథ్యూ
ఆర్ట్ డైరెక్టర్: డివై సత్యనారాయణ

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved