Daaku Maharaaj’s Third Song "Dabidi Dibidi" ft. Nandamuri Balakrishna and Urvashi Rautela is out
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' చిత్రం నుంచి మూడవ గీతం 'దబిడి దిబిడి' విడుదల
The much-anticipated third song from Daaku Maharaaj, titled "Dabidi Dibidi," is here and setting social media on fire! This lavishly shot mass dance number pays tribute to the legendary dialogues of Nandamuri Balakrishna, offering a true feast for his fans. Featuring the powerhouse actor Nandamuri Balakrishna alongside the glamorous Urvashi Rautela, the song captures the essence of mass appeal with both delivering high-energy performances.
Vagdevi’s powerful vocals infuse the track with vibrancy, while lyrics penned by the talented lyricist Kasarla Shyam seamlessly blend Balakrishna’s iconic monologues with Thaman’s high-octane beats and dynamic musical arrangement. The lyrics not only celebrate the grandeur of his dialogues but also transform the track into a dance anthem, set to become the next "Jai Balayya" for fans. This song is bound to become a favorite for all. Rich and striking visuals captured by Vijay Karthik Kannan, combined with high-energy choreography by Shekar VJ, create a larger-than-life experience that guarantees this track will be a true mass treat and a sure-shot hit among fans of all ages.
Alongside Nandamuri Balakrishna, the film stars Bobby Deol, Pragya Jaiswal, Shraddha Srinath, Chandini Chowdary, and Urvashi Rautela in significant roles. Directed by Bobby Kolli, Daaku Maharaaj is shaping up to be a grand cinematic experience. With stellar cinematography by Vijay Kartik Kannan and precise editing by Niranjan Devaramane and Ruben, the film promises to captivate audiences on a grand scale. Produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas, and presented by Srikara Studios, the film is slated for a worldwide theatrical release on January 12, 2025, this Sankranti. Blending action, drama, entertainment, and heartfelt emotions, Daaku Maharaaj promises to deliver a grand cinematic experience.
Cast & Crew :
Hero: Nandamuri Balakrishna
Co-Stars: Bobby Deol, Pragya Jaiswal, Shraddha Srinath, Chandini Chowdary, Urvashi Rautela
Director: Bobby Kolli
Producers: Naga Vamsi S, Sai Soujanya
Music Director: Thaman S
Cinematography: Vijay Kartik Kannan
Editor: Niranjan Devaramane, Ruben
Production Designer: Avinash Kolla
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' చిత్రం నుంచి మూడవ గీతం 'దబిడి దిబిడి' విడుదల
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా నటించిన సినిమా విడుదలవుతుందంటే తెలుగునాట ఉండే సందడే వేరు. ఈ సంక్రాంతికి ఆయన 'డాకు మహారాజ్' చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు రెండు పాటలు విడుదల కాగా, రెండింటికీ మంచి స్పందన లభించింది. ఇక ఇప్పుడు మూడవ గీతం విడుదలైంది.
'డాకు మహారాజ్' చిత్రం నుంచి అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న మూడవ గీతం 'దబిడి దిబిడి'ని తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ పాట సామాజిక మాధ్యమాల్లో ఒక ఊపు ఊపుతోంది. నందమూరి బాలకృష్ణ అంటే డైలాగ్ లకు పెట్టింది పేరు. అలాంటి బాలకృష్ణ చిత్రాలలోని అత్యంత ప్రజాదరణ పొందిన డైలాగ్ లతో రూపుదిద్దుకున్న 'దబిడి దిబిడి' గీతం అభిమానులకు నిజమైన విందును అందిస్తోంది. ఈ మాస్ నృత్య గీతాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించారు. ఈ పాటలో బాలకృష్ణతో కలిసి ఊర్వశి రౌతేలా కాలు కదిపారు. తమ అసాధారణ ఎనర్జీతో, అదిరిపోయే స్టెప్పులతో మాస్ ప్రేక్షకులు మెచ్చేలా పాటను మలిచారు.
నందమూరి బాలకృష్ణ సినిమా అంటే తమన్ ఏ స్థాయిలో సంగీతం అందిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కలయికలో వచ్చే ప్రతి పాట ప్రేక్షకులని రంజింపచేస్తుంది. ఇప్పుడు 'దబిడి దిబిడి' కోసం తమన్ మరోసారి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. వాగ్దేవి తన శక్తివంతమైన గాత్రంతో పాటను మరో స్థాయికి తీసుకెళ్ళారు. ఇక ప్రతిభావంతులైన గీత రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. సంగీతానికి తగ్గట్టుగా డైలాగ్ లతో అద్భుతమైన సాహిత్యం అందించారు. సంగీతం, సాహిత్యం చక్కగా కుదిరి.. ఇది గొప్ప నృత్య గీతంగా మారింది. "జై బాలయ్య" తరహాలో అభిమానుల హృదయాల్లో ఈ పాట నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. విజయ్ కార్తీక్ కన్నన్ అద్భుతమైన విజువల్స్, శేఖర్ వీజే అదిరిపోయే కొరియోగ్రఫీ ఈ పాటను నిజమైన మాస్ ట్రీట్ లా మార్చాయి. అభిమానులతో పాటు, అన్ని వయసుల వారు కాలు కదిపేలా ఉన్న ఈ గీతం, ఖచ్చితంగా చాలా కాలం వినిపించే పాటగా నిలుస్తుంది.
నందమూరి అభిమానులతో పాటు, సినీ ప్రియులకు ఒక గొప్ప అనుభూతిని అందించేలా డాకు మహారాజ్ చిత్రాన్ని దర్శకుడు బాబీ కొల్లి రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా, నిరంజన్ దేవరమానే, రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2025 న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. యాక్షన్, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన డాకు మహారాజ్ చిత్రంతో ప్రేక్షకులను గొప్ప సినిమా అనుభూతిని అందిస్తామని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.