Q: You’ve been in the industry for over a decade, working with multiple stars across languages. What’s unique about Nandamuri Balakrishna?
Shraddha Srinath: Despite being in the industry for decades, Balakrishna sir remains curious and innocent in his approach. He genuinely listens to what the director wants to convey without any starry inhibitions. He surrenders himself completely to the director’s vision, which is very rare for a star of his stature.
Q: How did you feel when you were offered a role in Daaku Maharaaj?
Shraddha Srinath: The films I’ve done so far are mostly subtle, serious, or thrillers. But Daaku Maharaaj is different. Being part of a Balakrishna film means the entire world will be watching me. For me, it’s an opportunity to showcase my talent to a wider audience. It’s a do-or-die opportunity, and I am determined to give my best.
Q: Can you tell us about your character?
Shraddha Srinath: I play Nandini, a composed and soft-spoken yet courageous character. She knows when to speak and what to say. My role has a lot of emotional depth. Commercial cinema is often about looking pretty with limited scope for performance, but in this film, I got to do both. It was a challenging role, and I thoroughly enjoyed it.
Q: Did you have any reference points for your character?
Shraddha Srinath: Bobby garu had a clear vision of how my character should look on screen. We did extensive research and put a lot of effort into the look and costumes, down to details like nail polish.
Q: Do you believe Daaku Maharaaj will have an impact on your career?
Shraddha Srinath: I am super confident about this film. I truly believe it will have a very positive impact on my career.
Q: Did you dub for your role?
Shraddha Srinath: Yes, I dubbed for myself.
Q: How was your working experience with Balakrishna?
Shraddha Srinath: His energy surpasses all of ours combined. He’s so cool and asked me to call him “Bala” instead of “sir,” though I didn’t have the courage to do so. He jokes around on set, but when the camera rolls, he transforms into his character effortlessly.
Q: How does it feel to work with Sithara Entertainments again after Jersey?
Shraddha Srinath: I feel they have a lot of trust in me. They gave me one memorable film with Jersey, and I’m thrilled to be working with them again for Daaku Maharaaj. I look forward to being associated with them for more films. Their lineup is always exciting, with the perfect mix of content and entertainment.
Q: Tell us about your experience working with Bobby Kolli.
Shraddha Srinath: Bobby Kolli is extremely passionate and has an incredible understanding of acting. I often joke that I want to learn acting from him. Initially, I wasn’t sure if I could pull off this character, but I followed his instructions and trusted his vision. I’ll always be grateful to him for believing in me.
'డాకు మహారాజ్' సినిమా ఒక పూర్తి ప్యాకేజ్ లా ఉంటుంది : కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్
నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'డాకు మహారాజ్'. వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలు. సంక్రాంతి కానుకగా జనవరి 12న 'డాకు మహారాజ్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలలో మరింత జోరును పెంచింది చిత్ర బృందం. ఈ క్రమంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్, సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
బాలకృష్ణ గారి గురించి?
ఎన్నో ఏళ్ళ నుంచి సినీ పరిశ్రమలో ఉన్నాను, నేనొక బిగ్ స్టార్ ని అనే అహం బాలకృష్ణ గారిలో కొంచెం కూడా ఉండదు. సెట్స్ లో అందరితో సరదాగా ఉంటారు. తనకంటే చిన్నా పెద్దా అని చూడకుండా దర్శకుడికి ఆయన ఎంతో గౌరవం ఇస్తారు. సినిమా కోసం దర్శకుడు ఏం చెప్తే అది చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.
'డాకు మహారాజ్' సినిమాలో నటించడం ఎలా ఉంది?
నేను ఇప్పటివరకు కొన్ని విభిన్న సినిమాలు చేశాను. అయితే ఈ చిత్రం మాత్రం ఒక పూర్తి ప్యాకేజ్ లా ఉంటుంది. ఇలాంటి నేను ఇప్పటి వరకు చేయలేదు. కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్నీ ఉంటాయి. పైగా బాలకృష్ణ గారి సినిమా అంటే ఎక్కువ మంది ప్రేక్షకులకు నా ప్రతిభను చూపించే అవకాశం ఉంటుంది.
మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
నా పాత్ర పేరు నందిని. చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఎంతో ఓపిక ఉంటుంది. అదే సమయంలో ఎప్పుడు మాట్లాడాలో స్పష్టంగా తెలుసు. నా పాత్రలో ఎంతో డెప్త్ ఉంటుంది. నటనకు కూడా ఎంతో ఆస్కారముంది.
'డాకు మహారాజ్' మీ సినీ కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపనుంది?
ఈ సినిమాపైనా, ఇందులో నేను పోషించిన నందిని పాత్ర పైనా ఎంతో నమ్మకంగా ఉన్నాను. నందిని పాత్రతో ప్రేక్షకులకు మరింత చేరువ కానున్నాను.
ఈ సినిమా ప్రయాణంలో మీకు ఛాలెంజింగ్ గా అనిపించింది ఏంటి?
నటిగా ఈ సినిమా నుంచి ఎంతో నేర్చుకున్నాను. ముఖ్యంగా ఇందులో డైలాగ్ లు కరెక్ట్ మెజర్ లో ఉంటాయి. డబ్బింగ్ చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకున్నాను. ప్రతి డైలాగ్ మీద ఎంతో కేర్ తీసుకొని డబ్బింగ్ చెప్పించారు.
మీ పాత్ర పరంగా 'జెర్సీ', 'డాకు మహారాజ్' సినిమాల్లో ఏది బెస్ట్ అంటే ఏం చెప్తారు?
రెండూ వేటికవే ప్రత్యేకం. జెర్సీలో నేను పోషించిన సారా పాత్ర నా మనసుకి బాగా నచ్చిన పాత్ర. ప్రేక్షకులు కూడా ఎంతో ఆదరించారు. ఇప్పుడు డాకు మహారాజ్ లోని నందిని పాత్ర కూడా ప్రేక్షకులకు ఆ స్థాయిలో చేరువ అవుతుందనే నమ్మకం ఉంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ గురించి?
సితార ఎంటర్టైన్మెంట్స్ నాకు జెర్సీ వంటి మెమరబుల్ ఫిల్మ్ ని ఇచ్చింది. నాపై నమ్మకం ఉంచి, ఇప్పుడు 'డాకు మహారాజ్'లో మరో మంచి పాత్ర ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. సితార ఎన్నో మంచి మంచి సినిమాలను నిర్మిస్తూ ఉంటుంది. అలాంటి బ్యానర్ లో సినిమా చేయడం ఎప్పుడూ గౌరవంగానే భావిస్తాను.
దర్శకుడు బాబీ గారి గురించి?
బాబీ గారు ప్రతిభగల దర్శకుడు. సినిమా పట్ల ఆయనకు ఎంతో పాషన్ ఉంది. అలాగే, బాబీ గారిలో మంచి నటుడు కూడా ఉన్నాడు. అద్భుతమైన సూచనలు ఇస్తూ, నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకుంటారు.
మీకు ఎలాంటి సినిమాలు, పాత్రలు చేయాలని ఉంది?
అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది. నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలు పోషించడానికి ఎక్కువ ఇష్టపడతాను.